India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1980వ సంవత్సరం పదో తరగతి చదివిన విద్యార్థులు 44 ఏళ్ల తరువాత ఆదివారం ఆత్మీయ సమ్మేళన సమావేశంలో కలుసుకున్నారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చదువుకున్న సమయంలో చేసిన అల్లరిని గుర్తు చేసుకున్నారు. తమకు చదువు నేర్పిన గురువులను సన్మానించారు. రోజంతా ఉల్లాసంగా గడిపారు.
గన్నవరం మండలం కేసరపల్లి IT పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో ట్రాఫిక్‌పై ఆంక్షలు చేపట్టినట్లు SP అద్నాన్ తెలిపారు. విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను కత్తిపూడి నుంచి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు మళ్లిస్తామన్నారు. చెన్నై నుంచి విశాఖ వచ్చే వాహనాలు ఒంగోలు, రేపల్లె మీదుగా వయా మచిలీపట్నం- లోసరి బ్రిడ్జి- నరసాపురం- అమలాపురం- కత్తిపూడి మీదుగా విశాఖ చేరుకుంటాయి.
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న కల్కి 2898 AD ట్రైలర్ రేపు విడుదలకానుంది. అభిమానుల కోసం విజయనగరం జిల్లాలోని పలు థియేటర్లలో రేపు 6PMకు ట్రైలర్ విడుదల చేస్తున్నారు. విజయనగరంలో ఎన్‌సీఎస్, ఎస్‌వీఎస్ రంజనీ థియోటర్‌లో స్క్రీనింగ్ ఉండగా.. చీపురుపల్లిలో వంశీ, ఎస్.కోటలో శ్రీ వెంకటేశ్వర, సాలూరులో శ్రీ రామ, పార్వతీపురంలో SVC TBR థియేటర్‌లలో ట్రైలర్ స్క్రీనింగ్ చేస్తారు.SHARE IT
బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మక్కువ మండలంలో చోటు చేసుకుంది. సీబిల్లికి చెందిన వడ్డి నాగేశ్వరరావు (53) ఈనెల7 నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం పాతకాముడువలస సమీపంలో బావిలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కొడుకు ఫిర్యాదుతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నర్సింహమూర్తి తెలిపారు.
విజయనగరంలో క్లీన్ స్వీప్ చేసిన కూటమి అభ్యర్థుల్లో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. సీనియర్ విభాగంలో కోళ్ల, కిమిడి పదవి ఆశిస్తుండగా.. క్షత్రియ సామాజికవర్గానికి చెందిన బేబినాయన, అదితి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. అటు జనసేన ఏకైక మహిళా MLA లోకం మాధవితో పాటు ఎస్టీ కేటగిరీలో గుమ్మడి పేరు జోరుగా వినిపిస్తోంది. మరి వీరిలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.
1995 నుంచి 2000 వరకు ఈనాడులో జర్నలిస్టుగా పనిచేసిన కలిశెట్టి అప్పలనాయుడు.. నేడు విజయగనం ఎంపీ అయ్యారు. ఈనాడు సంస్థ ఉద్యోగిగా ఉన్న తాను ఎంపీగా ఎదగడానికి రామోజీరావే స్ఫూర్తి అని ఆయన తెలిపారు. జీవిత పాఠాలు నేర్పిన ఆయన ఇక లేరన్న విషయం కలిచివేసిందన్నారు. జీవితాంతం రామోజీరావుకు రుణపడి ఉంటానన్న కలిశెట్టి.. రామోజీరావును తలుచుకున్న ప్రతిసారీ కన్నీరు వస్తుందన్నారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
విజయనగరం MP స్థానంలో 22,301 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా 13,329(59.74%) ఓట్లు NDAకి పడ్డాయి. YCPకి 6,071(27.21%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి 353(1.58%) మంది మాత్రమే ఓటు వేశారు. అరకు MP స్థానంలో 21,432 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా కూటమికి 9,312(43.44%) ఓట్లు పడ్డాయి. YCPకి 5,535(25.83%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి 4,113(19.19%) మంది ఓటు వేశారు. రాష్ట్రంలో ఇండియా కూటమికి ఇదే అత్యధికం.
రైలు ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చీఫ్ డీటీఐ సీహెచ్వీ. రమణ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ క్రాసింగ్ అవేర్నెస్ డే పురస్కరించుకుని స్థానిక వీటీ. అగ్రహారం సమీపంలో ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద శనివారం ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే క్రాసింగ్ ఉన్నప్పుడు ప్రయాణీకులు గేట్ల కింద దూరి వెళ్లరాదన్నారు.
రైలు కింద పడి యువకుడు మృతి చెందిన ఘటన పార్వతీపురం మండలం దాలినాయుడు వలస రైల్వే గేట్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం పట్టణం బూరాడ వీధికి చెందిన తెంటు భరత్ (31) రైల్వే గేట్ దాటుతుండగా గూడ్స్ ఢీకొనడంతో మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
అరకు, పాడేరు నియోజకవర్గాలు YCPకి కంచుకోటగా మారాయి. రెండింటిలోనూ YCP ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 2014 నుంచి YCP పోటీలో నిలవగా.. 3సార్లు వేర్వేరు అభ్యర్థులే పోటీచేసి గెలిచారు. అరకులో 2014లో కిడారి సర్వేశ్వరరావు, 2019లో చెట్టి ఫాల్గుణ, 2024లో రేగం మత్స్యలింగం గెలిచారు. ఇటు పాడేరులో 2014 గిడ్డి ఈశ్వరి, 2019లో భాగ్యలక్ష్మి, 2024లో విశ్వేశ్వర రాజు గెలిచారు. అరకు MP స్థానంలో కూడా ఇదే ఫార్ములా నడిచింది.
Sorry, no posts matched your criteria.