Vizianagaram

News April 27, 2024

VZM: 7 నియోజకవర్గాలు.. 22 నామినేషన్లు REJECT

image

విజయనగరం జిల్లాలో 7అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 105నామినేషన్లు దాఖలు కాగా 83 నామినేషన్లను ఆమోదించినట్లు ఆయా నియోజకవర్గాల ROలు తెలిపారు. రాజాంలో 12 నామినేషన్లకు 10, బొబ్బిలి- 13 నామినేషన్లకు 9, చీపురుపల్లి- 13 నామినేషన్లకు 8, గజపతినగరం- 15 నామినేషన్లకు 13, నెల్లిమర్ల- 16 నామినేషన్లకు 13, విజయనగరం- 20 నామినేషన్లకు 16, ఎస్.కోట- 16 నామినేషన్లకు 14 ఆమోదించి మిగతావి తిరస్కరించామని తెలిపారు.

News April 26, 2024

విజయనగరం: కాంగ్రెస్ అభ్యర్థి.. విమానం గుర్తు..! (REWIND)

image

చీపురుపల్లి నియోజకవర్గానికి 1985లో జరిగిన ఎన్నికల్లో వింత ఘటన జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీసాల నీలకంఠం నాయుడికి అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి బీఫాం కొంత ఆలస్యంగా రావడంతో సకాలంలో నామినేషన్ వేయలేకపోయారు. ఆయనను EC స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించి విమానం గుర్తుఇచ్చింది. దీంతో ఆయన విమానం, హస్తం గుర్తులను బ్యానర్‌పై వేయించి ప్రచారం చేశారు. కాగా ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.

News April 26, 2024

విజయనగరం ఎంపీ స్థానానికి ఓ సెంటిమెంట్

image

విజయనగరం ఎంపీ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. విజయనగరం లోక్ సభ 2009లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇక్కడ గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపట్టాయి. 2009లో కాంగ్రెస్ నుంచి బొత్స ఝాన్సీ, 2014లో టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు, 2019లో వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ గెలిచారు. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలో బరిలో ఉన్నాయి. మరి ఈ సారి సెంటిమెంట్ వర్క్‌ఔట్ అవుతుందా కామెంట్ చేయండి.

News April 26, 2024

VZM: 30న అండర్–19 ఎంపిక పోటీలు

image

ఈ నెల 30న అండర్-19 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఎంఎల్ఎన్ రాజు తెలిపారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు 2005 సెప్టెంబర్ 1 తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు. పోటీలకు హాజరయ్యే వారు ఒరిజినల్ ఆధార్ కార్డు, జన్మదిన ధ్రువపత్రం, గత మూడేళ్ల స్టడీ సర్టిఫికెట్స్ తీసుకొని రావాలన్నారు. సంబంధిత తేదీల్లో ఉదయం 6.30 గంటలకు వైట్ డ్రెస్, సొంత కిట్‌తో హాజరు కావాలని కోరారు.

News April 26, 2024

VZM: ఎన్నికల కోడ్‌తో జిల్లాలో సీజ్ చేసిన వాటి వివరాలు ఇవే..

image

ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి గురువారం వరకు విజయనగరం జిల్లాలో సీజ్ చేసిన వాటి వివరాలను కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. సుమారు రూ.4.43 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, విలువైన లోహ పరికరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. రూ.1.04 కోట్ల నగదు, 14,372 లీటర్ల మద్యం, రూ.29.75 లక్షల విలువైన డ్రగ్స్, రూ.1.85 కోట్ల విలువైన లోహ పరికరాలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

News April 26, 2024

విజయనగరం మండలంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

విజయనగరం మండలంలో గురువారం మధ్యాహ్నం ఆటో, బైకును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. జామి నుంచి విజయనగరం వైపు వస్తున్న బస్సు రామనారాయణం వద్ద టీపాయింట్ సమీపంలో కొత్త భీమసింగి వైపు వెళ్తున్న ఆటోను, ఆ వెనుకే వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. మృతులు పద్మనాభం మండలం చిన్నాపురానికి చెందిన యు.లలిత(35), జామి మండలం కొత్త భీమసింగికి చెందిన పి.శశికుమార్‌గా గుర్తించారు.

News April 26, 2024

విజయనగరం: ‘మీ ఓటు.. మీ భ‌విష్య‌త్తు’

image

మీరు వేసే ప్ర‌తీ ఓటు మీ భ‌విష్య‌త్తును నిర్ణ‌యిస్తుంద‌ని అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ స‌హాదిత్ వెంక‌ట త్రివినాగ్ అన్నారు. స్వీప్ కార్య‌క్ర‌మంలో భాగంగా గురువారం ప‌ట్ట‌ణంలోని కోట‌, బాలాజీ, మ‌యూరి జంక్షన్ల వ‌ద్ద కేంద్రీయ గిరిజ‌న విశ్వ‌విద్యాల‌య విద్యార్దులు ఫ్లాష్ మాబ్ నిర్వ‌హించారు. ఓటు హ‌క్కు వినియోగం ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించారు. హుషారైన‌ నృత్యాల‌ను ప్ర‌ద‌ర్శించి ఉర్రూత‌లూగించారు.

News April 26, 2024

మన్యం: కౌంటింగ్ కేంద్రాలను సందర్శించిన ఎన్నికల పరిశీలకులు

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కమాండ్ కంట్రోల్ రూమ్‌ను అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ప్రమోద్, శాంతి భద్రతల పరిశీలకులు నయీం ముస్తఫా మన్సూరి గురువారం సందర్శించారు. జిల్లాకు విచ్చేసిన సాధారణ పరిశీలకులు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఎన్నికల ప్రవర్తన నియమావళి విభాగం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

News April 25, 2024

VZM: పార్ల‌మెంటు స్థానానికి 30, అసెంబ్లీకి 184 నామినేష‌న్లు

image

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పార్ల‌మెంటు స్థానానికి 30 సెట్లు, అసెంబ్లీ స్థానాల‌కు 184 సెట్ల నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌, జిల్లా ఎన్నిక‌ల అధికారి నాగ‌ల‌క్ష్మి తెలిపారు. పార్ల‌మెంటు స్థానానికి 18 మంది, మొత్తం 7 అసెంబ్లీ స్థానాల‌కు 105 మంది నామినేష‌న్లు వేశార‌ని చెప్పారు. నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగిసిన అనంత‌రం క‌లెక్ట‌రేట్ మీడియా సెంట‌ర్‌లో క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి మీడియాతో మాట్లాడారు.

News April 25, 2024

ఇండియా కూటమికే వైరిచర్ల మద్దతు

image

ఇండియా కూటమి అభ్యర్థులకు తన మద్దతు ఉంటుందని మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ గురువారం తెలిపారు. తెలుగుదేశం పార్టీ బీజీపీతో జతకట్టారని ఆయన నిరసిస్తూ టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇప్పటివరకు ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన మనసులో మాట వెల్లడించారు.