Vizianagaram

News June 7, 2024

ఒడిశాలో బీజేపీ.. కొఠియా, జంఝావతి సమస్య కొలిక్కి వచ్చేనా..!

image

కేంద్రంలో TDP కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్న తరుణంలో కొఠియా, జంఘావతి సమస్యలు తెరపైకి వచ్చాయి. దీనికి తోడు ఒడిశాలో BJP ప్రభుత్వం కొలువుతీరనున్న నేపథ్యంలో జిల్లా ప్రజాప్రతినిధులు ఈ సమస్యలపై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. ఒడిశాలో పలు గ్రామాలతో పాటు కొంత భూభాగం ముంపునకు గురవ్వడంతో రబ్బరు డ్యాం నిర్మించాల్సి వచ్చింది. కొఠియా ప్రజల అభీష్టం మేరకు వారితో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

News June 7, 2024

విజయనగరం: మూడు కేంద్రాల్లో ఎడ్ సెట్

image

ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎడ్‌సెట్-24 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని పరిశీలకులు ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరంలోని సీతం ఇంజినీరింగ్ కళాశాల, అయాన్ డిజిటల్ జోన్, ఎంవీజీఆర్ కళాశాల కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని, ఉ 9 గంటల నుంచి 11 వరకు జరుగుతుందని, 850 మంది పరీక్ష రాస్తున్నట్లు వెల్లడించారు. హాల్ టికెట్లలో నిర్దేశించిన విధంగా అభ్యర్థులు నిబంధనలు పాటించాలన్నారు.

News June 7, 2024

విజయనగరం మహిళా మంత్రి ఎవరు?

image

విజయనగరం చరిత్రలో ఐదుగురు మహిళా ప్రజాప్రతినిధులు అసెంబ్లీలోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. కురుపాంలో జగదీశ్వరి, సాలూరులో సంధ్యారాణి, విజయనగరంలో అదితి గజపతి, నెల్లిమర్ల నుంచి జనసేన తరఫున గెలిచిన లోకం మాధవి మొదటిసారి అసెంబ్లీకి వెళుతన్నారు. అటు ఎస్.కోటలో మూడోసారి నెగ్గిన కోళ్ల లలితకూమారి అసెంబ్లీలో తన గళాన్ని వినిపించనున్నారు. మరి వీరిలో ఎవరికి మంత్రి పదవి వరిస్తుందో చూడాలి.

News June 7, 2024

విజయనగరంలో 30 ఏళ్ల క్రితం టీడీపీ క్లీన్ స్వీప్

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో సరిగ్గా 30 ఏళ్ల క్రితం టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. 1994లో జరిగిన ఎన్నికల్లో నాగూరు, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, తెర్లాం, గజపతినగరం, విజయనగరం, చీపురుపల్లి, సతివాడ, భోగాపురం, ఉత్తరావల్లి, ఎస్.కోటలో టీడీపీ అభ్యర్థులు గెలిపొందారు. నాగూరు, సతివాడ నియోజకర్గాలు కురుపాం, సతివాడగా మారగా.. తెర్లాం, భోగాపురం, ఉత్తరావల్లి నియోజకర్గాలు పునర్విభజనలో రద్దయ్యాయి.

News June 7, 2024

ఏపీఆర్‌డీ‌సీ డైరెక్టర్ పదవికి రాజీనామా

image

ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు నెల్లిమర్ల పట్టణానికి చెందిన నౌపడ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసరెడ్డికి పంపించినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో డైరెక్టర్‌గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లు శ్రీనివాసరావు తెలిపారు.

News June 6, 2024

పార్వతీపురం: ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

image

వెంకంపేట పంచాయితీ YKMనగర్ కాలనీలో అద్దెకు ఉంటున్న పల్లా సింహాచలం (39) అనే యువకుడు ఇంట్లో భార్య బిడ్డలు లేని సమయంలో గురువారం ఉదయం ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతికి కారణం ఆర్థికంగా ఇబ్బందులు అని బంధువులు చెబుతున్నారు. ఫర్నిచర్ షాపులో పనిచేస్తున్న అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 6, 2024

సామాన్య కార్యకర్తను ఎంపీగా చేశారు: కలిశెట్టి

image

టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చంద్రబాబు నివాసం వద్ద ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ బ్యానర్లకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్తను ఎంపీగా చేసిన ఘనత లోకేశ్‌కే దక్కుతుందని అన్నారు. ఈ స్థాయికి‌‌ తీసుకువచ్చిన చంద్రబాబు, లోకేశ్‌ను కలిసి అభినందనలు తెలిపేందుకు వచ్చానని‌ ఆయన తెలిపారు.

News June 6, 2024

సంధ్యారాణిని గట్టెక్కించిన సాలూరు టౌన్ 

image

సాలూరు ఎమ్మెల్యేగా 13,733 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థిని గుమ్మడి సంధ్యారాణి.. వైసీపీ అభ్యర్థి రాజన్నదొరపై గెలుపొందారు. నియోజకర్గంలో మండలాల వారీగా ఇద్దరు అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ వివరాలు ఇలా ఉన్నాయి.
☛ సాలూరు రూరల్‌‌లో YCPకి 3,155
☛ సాలూరు టౌన్‌లో TDPకి 12,579
☛ పాచిపెంటలో YCPకి 104
☛ మెంటాడలో TDPకి 4,258
☛ మక్కువలో YCPకి 520
☛☛ పోస్టల్ బ్యాలెట్‌లో TDPకి 675 ఓట్ల మెజార్టీ వచ్చింది.

News June 6, 2024

విజయనగరం: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

image

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందినట్లు ఎస్. బూర్జివలస ఎస్. ఐ లక్ష్మీ ప్రసన్నకుమార్ గురువారం తెలిపారు. పి.లింగాలవలస గ్రామానికి చెందిన పరిగి సుబ్బారావు (45) స్వగ్రామం వస్తుండగా జగన్నాథపురం సమీపంలో ఆటో ఢీకొట్టి మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా వెంకన్నపాలెం గ్రామానికి చెందిన గొంతినె శ్రీనివాసరావు బైక్‌పై వస్తుండగా మరడాం జంక్షన్ వద్ద బొలెరో వాహనం ఢీకొనడంతో మృతి చెందారు.

News June 6, 2024

విజయనగరం ప్రజల తీర్పుపై మీ కామెంట్?

image

ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం ప్రజల తీర్పు చర్చనీయాంశమయ్యింది. గత ఎన్నికల్లో 9 స్థానాల్లోనూ YCP అభ్యర్థులను గెలిపించిన ప్రజలు.. ఈసారి రివర్స్ తీర్పు ఇచ్చారు. కూటమి అభ్యర్థులకు పట్టం కట్టారు. గెలిచిన అభ్యర్థులు తమ నియోజకవర్గానికి కావాల్సిన నిధులపై అసెంబ్లీలో చర్చిస్తారు. కాకపోతే జిల్లాలో అభివృద్ధి, సమస్యలపై ప్రస్తావించేందుకు ప్రతిపక్షపాత్ర పోషించే నేత అప్పుడూ.. ఇప్పుడూ లేకపోవడం గమనార్హం.