Vizianagaram

News April 25, 2024

VZM: పోక్సో కేసులో నిందితుడికి జైలు

image

విజయనగరం దిశ మహిళా పోలీసు స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష పడింది. పూసపాటిరేగ మండలం కృష్ణాపురానికి చెందిన జి.రాంబాబు(27)పై 2021లో పోక్సో కేసు నమోదయ్యింది. ఈ మేరకు విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి ఏడేళ్లు జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించారని దిశా స్టేషన్ ఇన్ ఛార్జ్ డీఎస్పీ డి.విశ్వనాథ్ తెలిపారు.

News April 25, 2024

VZM: మొన్న చంద్రబాబు.. నిన్న జగన్.. నేడు పవన్

image

ఉత్తరాంధ్రపై ప్రధాన పార్టీల అధ్యక్షులు ఫోకస్ పెంచారు. సోమ, మంగళవారాల్లో చంద్రబాబు S.కోట, గజపతినగరం సభల్లో పాల్గొనగా.. నిన్న చెల్లూరులో జరిగిన మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగించారు. నేడు నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల్లో జరిగే సభల్లో చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్ పాల్గోనున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంటోంది. మరి మీ మద్దతు ఎవరికో కామెంట్ చెయ్యండి..

News April 25, 2024

నేడు విజయనగరంలో చంద్రబాబు, పవన్ రోడ్ షో

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు విజయనగరం జిల్లాలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. డెంకాడ మండలం సింగవరం వద్ద సా.4 గంటలకు ప్రజాగళం-వారాహి విజయభేరి సభలో వారు పాల్గొంటారు. సభ జరిగే ముందు సింగవరం వద్ద రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం విజయనరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ప్రజాగళం సభలో వారు ప్రసంగించనున్నారు. వీరి పర్యటన నిమిత్తం చందకపేట వద్ద రెండు హెలీప్యాడ్‌‌లు ఏర్పాటు చేశారు.

News April 25, 2024

VZM: అంధ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

విజయనగరంలోని పూల్ బాగ్ లో ఉన్న ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధానాచార్యుడు మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 38 సీట్లు ఉన్నాయన్నారు. 40 శాతం అంధత్వం కలిగిన 6 నుంచి 14 ఏళ్లలోపు బాల, బాలికలు అర్హులన్నారు. ఉచిత వసతి, పౌష్టికాహారం, ఆధునిక బ్రెయిలీ సామగ్రితో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు.

News April 25, 2024

VZM: మే 13న వేతనంతో కూడిన సెలవు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 13న జరిగే పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్టు జిల్లా ఉప కార్మిక కమిషనర్ ఎన్.సుబ్రహ్మణ్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ దుకాణాలు, సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సెలవు ప్రకటించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు దుకాణదారులు, వివిధ సంస్థల యాజమాన్యాలకు ఆదే శాలు జారీ చేశామన్నారు.

News April 24, 2024

విజయనగరం: వెనుతిరుగుతున్న ప్రయాణికులు..!

image

సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో విజయనగరం ఆర్టీసీ డిపోలోని కొన్ని బస్సులను ఆ సభకు తరలించారు. దీంతో కాంప్లెక్స్‌కి వచ్చిన ప్రయాణికులు వెనుతిరుగుతున్నారు. కనీసం ప్రయాణికుల కోసం కొన్ని బస్సులనైనా ఉంచకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు, పక్క జిల్లాలకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో ఎక్కువ డబ్బులు చెల్లించి వెళ్లాల్సి వస్తుందని మండిపడుతున్నారు.

News April 24, 2024

బొత్స ఝాన్సీ ఆస్తుల వివరాలు

image

➤ అభ్యర్థి పేరు: బొత్స ఝాన్సీ
➤ చరాస్తులు: రూ.4.75 కోట్లు
➤ స్థిరాస్తులు: రూ.4.46 కోట్లు
➤ అప్పులు: రూ.2.32కోట్లు
➤ భర్త బొత్స పేరిట చరాస్తులు: రూ.3.78కోట్లు
➤ భర్త పేరిట స్థిరాస్తులు: రూ.6.75 కోట్ల విలువైన భవనాలు,భూములు
➤ భర్త పేరిట అప్పులు: రూ.1.92కోట్లు
➤ కేసులు: లేవు
➤➤ఆమెకు 325 తులాల బంగారం, రెండు కార్లు.. భర్త పేరిట 31 తులాల బంగారు ఆభరణాలు, ఒక కారు ఉన్నట్లు అఫడివెట్ లో పేర్కొన్నారు.

News April 24, 2024

విజయనగరం: చెల్లూరులో సీఎం జగన్ సభ

image

సీఎం జగన్ ఈరోజు ఉ.9 గంటలకు ఎంవీవీ సిటీ నుంచి బయలుదేరతారు. విశాఖలోని మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత బొద్దవలస మీదుగా సా. 3.30 గంటలకు చెల్లూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారని వైసీపీ నాయకులు తెలిపారు.

News April 24, 2024

బొత్స డ్రామాలాడి ఇదంతా చేశారు: చంద్రబాబు

image

ఎస్.కోట నియోజకవర్గంలో నిన్న జరిగిన సమావేశంలో బొత్సపై చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎస్.కోట నియోజకవర్గ ప్రజలు విశాఖపైనే ఆధారపడతారని..కానీ ఈ నియోజకవర్గాన్ని విశాఖలో కలపకుండా విజయనగరంలో ఉంచారని అన్నారు. ఇదంతా బొత్స డ్రామాలాడి చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాగానే ఎస్.కోటను విశాఖ జిల్లాలో కలుపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

News April 24, 2024

బేబినాయన చరాస్తులు రూ.3,1953,154

image

➤ నియోజకవర్గం: బొబ్బిలి
➤ అభ్యర్థి: బేబినాయన
➤ పార్టీ: టీడీపీ
➤ విద్యార్హత: డిగ్రీ
➤ చరాస్తులు: రూ.3,19,53,154
➤ స్థిరాస్తులు: రూ.1,00,51,100
➤ భార్య పేరిట చరాస్తులు: రూ.71,99,116
➤ భార్య పేరిట స్థిరాస్తులు: రూ.33,77,500
➤ అప్పులు: రూ.5.70కోట్లు(బ్యాంకుల్లో)
➤ కేసులు: 1