India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
10, ITI వరకే చదివి ఉద్యోగాలు చేస్తున్న వారు <<14419916>>పాలిటెక్నిక్ కోర్సు<<>> పూర్తి చేయవచ్చు. వీరికి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు క్లాస్‌లు నిర్వహిస్తారు. ఆదివారం పూర్తిగా తరగతులు ఉంటాయి. విశాఖ గవర్నమెంట్ కెమికల్ ఇన్‌స్ట్యూట్‌లో కెమికల్ ఇంజినీరింగ్ కోర్సు, అచ్యుతాపురం ప్రశాంతి కాలేజ్‌లో సీఈ, ఎంఈ కోర్సులు, విశాఖలో బెహర శుభాకర్ కాలేజ్‌లో ECE,EEE,ME కోర్సులు అందుబాటులో ఉన్నాయి. >Share it
గుర్ల గ్రామంలో డయేరియా విజృంభణపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి కె.విజయానంద్(ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి) నేడు విజయనగరం జిల్లాకు రానున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలో అధికారులతో సమావేశమై ఘటనకు కారణాలు తెలుసుకుంటారు. అనంతరం గుర్ల బయలుదేరి వెళ్లి అక్కడ స్థానికులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులపై విచారించి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విజయనగరం జిల్లా పరిధిలో గల డిపోల్లో మెషినిస్ట్ ట్రేడ్‌లో అప్రెంటిషిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా ఆధికారి సీహెచ్ అప్పల నారాయణ తెలిపారు. మెషినిస్ట్ ట్రేడ్‌లో ఐ.టి.ఐ పాసైన అభ్యర్థులు ఈ నెల 20 నుంచి 30 వరకు www.apprenticeship.gov.in 2024 registrationలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
>గుర్లలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన > చెత్త వాహనంలో తరలించిన వెల్ల ఏనుగుకు సంప్రోక్షణ >ప్రభుత్వ పనితీరు, జమిలీ ఎన్నికలపై మండిపడ్డ శాసన మండలి విపక్షనేత బొత్స >పెద్ద చెరువులో పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవ ట్రయిల్ రన్ >దివ్యాంగురాలి కోసం కాన్వాయ్ ఆపించిన పవన్ >తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు మండలాల వారిగా కలెక్టర్ యాక్షన్ ప్లాన్.
తుఫానును ఎదుర్కొనేందుకు మండలాల వారీగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధ, గురువారాల్లో జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 22 నుంచి 26 వరకు స్పెషల్ ఆఫీసర్లు, మండల అధికారులంతా ఆయా మండలాల్లోనే ఉండాలన్నారు.
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదికకు మొత్తం 180 అర్జీలు అందాయి. భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 122 వినతులు అందాయి. పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డీఆర్డీఏకు 17 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 5, పంచాయితీ శాఖకు 12, విద్యా శాఖకు 4 అందగా, వైద్య శాఖకు 6 అందాయి. మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి.
జిల్లాలోని మాజీ సైనికులు, వితంతు మాజీ సైనికుల సంక్షేమం కోసం తగిన సూచనలు, సలహాలను ఈ నెల 31లోగా అందజేయాలని విజయనగరం జిల్లా సైనిక సంక్షేమాధికారి కృష్ణారావు తెలిపారు. మాజీ సైనికులు, వితంతు మాజీ సైనికుల సమస్యల సత్వర పరిష్కారం కోసం వచ్చే నెల మొదటి వారంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా సైనిక బోర్డు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఉమ్మడి విజయనగరంలోని పెదపెంకి గ్రామంలో ఫైలేరియా సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. గుర్ల గ్రామాన్ని సందర్శించిన అనంతరం ఆయన విజయనగరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యాధికారులతో మాట్లాడుతూ.. నియంత్రణకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
గ్రామ సచివాలయ వాలంటరీలను కొనసాగించి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బొగత అశోక్ డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటరీలను కొనసాగించకపోవడం అన్యాయమన్నారు. గ్రామాల్లో వాలంటరీలు ప్రజలకు చేరువుగా ఉండి మంచి సేవలు అందించారని తెలిపారు. వారిని కొనసాగించేందుకు ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.
ఎన్నికల అనంతరం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నేడు విజయనగరం జిల్లాకు మొదటసారి వస్తున్నారు. గుర్లలో అతిసార బాధితులను పరామర్శించనున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలోని కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో ఏళ్లుగా పట్టిపీడిస్తున్న ఏనుగుల సమస్య పరిష్కారంపై క్లారిటీ ఇవ్వాలని ఆ ప్రాంతప్రజలు కోరుతున్నారు. ఇటీవల ఆ సమస్య పరిష్కారానికి కుంకీ ఏనుగుల కోసం కర్ణాటక ప్రభుత్వంతో ఏంవోయూ చేసుకున్న సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.