Vizianagaram

News June 4, 2024

9వ రౌండ్: చీపురుపల్లిలో వెనుకబడ్డ బొత్స

image

9వ రౌండ్ పూర్తయ్యేసరికి చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ మరింత వెనుకబడ్డారు. ఇక్కడ టీడీపీ నుంచి కళా వెంకట్రావుకి 39,328 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకి 35,051 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన 4,277 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

ఉమ్మడి విజయనగరంలో కూటమి క్లీన్ స్వీప్!

image

ఉమ్మడి విజయనగరంలో మొదటి మూడు రౌండ్లు ముగిసేసరికి అన్నీ స్థానాల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో ఆధిక్యంలో ఉన్న బొత్స రెండో రౌండ్ నుంచి వెనుకంజ వేశారు. అటు పార్వతీపురం జిల్లాలో సాలూరు నుంచి రెండు రౌండ్లు లీడ్‌లో ఉన్న రాజన్న దొర మూడో రౌండ్‌కి వెనుకబడ్డారు. దీంతో జిల్లాలోని 9 సీట్లలో 8 టీడీపీ, 1 జనసేన ఆధిపత్యం కనబరుస్తున్నాయి.

News June 4, 2024

చీపురుపల్లి 3వ రౌండ్: బొత్స వెనుకంజ

image

మూడో రౌండ్ పూర్తయ్యేసరికి చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కళా వెంకట్రావు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ పోటీలో ఉన్నారు. 3వ రౌండ్‌లో వెంకట్రావుకి 12,637 ఓట్లు పోలవ్వగా.. బొత్స సత్యనారాయణకి 11,717 ఓట్లు పడ్డాయి. దీంతో బొత్స 920 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

విజయనగరం ఎంపీ స్థానంలో టీడీపీ ముందంజ

image

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. 1వ రౌండ్‌లో కలిశెట్టి అప్పలనాయుడుకి 6,687 ఓట్లు పోలవ్వగా.. చంద్రశేఖర్‌కి 3,772 ఓట్లు పడ్డాయి. అప్పలనాయుడు 2,915 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.

News June 3, 2024

కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత: మన్యం జిల్లా ఎస్పీ

image

గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యానవన కళాశాలలో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత కల్పించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కౌంటింగ్ కేంద్రం వద్ద విధులకు హాజరవుతున్న పోలీసులకు సమావేశం నిర్వహించి విధివిధానాలు తెలియజేశారు. కౌంటింగ్ హాజరైన వారికి ఐడీ కార్డు లేనిదే లోనికి అనుమతించరాదన్నారు. 400 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

News June 3, 2024

సాలూరులో యువతి ఆత్మహత్య

image

ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సాలూరులో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సీహెచ్ వాసునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. గడివలసకి చెందిన చోడిపల్లి ఉష(19) పట్టణంలో ఓ హోటల్‌లో పని చేస్తుంది. ఆదివారం సాయంత్రం సాలూరులో అద్దెకు ఉన్న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని వచ్చిన ఫిర్యాదుతో వెళ్లి పరిశీలించామన్నారు. తండ్రి ఫిర్యాదుతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

News June 3, 2024

RTV ఎగ్జిట్ పోల్స్: విజయనగరంలో ఎవరికి ఎన్ని సీట్లంటే?

image

ఉమ్మడి విజయనగరంలో తొమ్మిది స్థానాల్లో టీడీపీ-4, వైసీపీ-4, జనసేన ఒక స్థానంలో విజయం సాధిస్తాయని RTV అంచనా వేసింది.
➢ కురుపాం: పుష్పశ్రీవాణి
➢ పార్వతీపురం: అలజంగి జోగారావు
➢ సాలూరు: పీడిక రాజన్నదొర
➢ బొబ్బిలి: బేబినాయన
➢ గజపతినగరం: కొండపల్లి శ్రీనివాస్
➢ చీపురుపల్లి: బొత్స సత్యనారాయణ
➢ నెల్లిమర్ల: లోకం మాధవి
➢ ఎస్.కోట: కోళ్ల లలితకుమారి
➢ విజయనగరం: అతిది గజపతిరాజు గెలుస్తారని తెలిపింది.

News June 3, 2024

VZM: MLC ఇందుకూరిపై అనర్హత వేటు

image

విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై వైసీపీ అనర్హత వేటు వేసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీలో ఉంటూ టీడీపీ అభ్యర్థులకు సహకరించారని ఆరోపణలతో వైసీపీ విప్ పాలవలస విక్రాంత్ శాసనమండలిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండలి చైర్మన్ మోషేన్ రాజు చర్యలు తీసుకున్నారు. వివరణ ఇవ్వాలని 3సార్లు పిలిచినా.. డుమ్మా కొట్టడంతో.. సస్పెన్షన్ వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.

News June 3, 2024

VZM: ఆలయాల బాట పట్టిన కోలగట్ల

image

నగరంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి విజయనగరం పుత్యుల వీధిలో ఉన్న ఉమా రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మల్యేగా తను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

News June 3, 2024

వంగరలో పిడుగు పాటుకు మూగజీవాలు మృతి

image

వంగర మండలం పట్టువర్ధనం గ్రామ సమీపంలో పిడుగు పాటుకు ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి. చిన్న గంగులు, చిన్ని అయ్యప్పకు చెందిన గొర్రెల మందతో పొలంలో కాపు కాస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఉరుములు మెరుపులతో కూడిన పిడుగు పడడంతో ఈ దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరిలోకి పరుగులు తీసి తమ ప్రాణాలు కాపాడుకున్నామన్నారు.