India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ జిల్లా కోఆర్డినేటర్‌గా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతను విజయసాయిరెడ్డికి అప్పగిస్తూ పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారు. కాగా గతంలో విశాఖ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా విజయసాయిరెడ్డి సేవలందించిన విషయం తెలిసిందే.
కేజీబీవీల్లో బోధన, బోధనేతర (అకౌంటెండ్, 5 వార్డెన్) పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు చేసిన అభ్యర్థుల జాబితాను vizianagaram.ap.gov.in వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు విజయనగరం డీఈవో ఎన్. ప్రేమకుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు పెట్టుకున్న అభ్యర్థులు చూసుకోవాలని ఆయన కోరారు.
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరిగిన మరుసటి మంగళవారం తెప్పోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెల 22వ తేదీన పెద్ద చెరువులో జరిగే తెప్పోత్సవం కార్యక్రమానికి సంబంధించిన పడవ తయారీ, తదితర పనులకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా కార్యక్రమాలను ఆలయ ఈఓ ప్రసాదరావు శుక్రవారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డీవీజీ శంకర్రావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. క్షేత్ర స్థాయిలో జరిపిన పర్యటనల్లో గిరిజనుల సమస్యలను అధ్యయనం చేసి, కమిషన్ సిఫార్సులను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారన్నారు. ఏకలవ్య పాఠశాలల్లో భాషోపాధ్యాయుల సమస్య, గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాల కల్పనపై అభ్యర్థించారన్నారు. గిరిజనుల సంక్షేమానికి క్షేత్ర స్థాయి సర్వే చేయాలని కోరారన్నారు.
> బొబ్బిలి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి > విజయనగరం జిల్లావ్యాప్తంగా ఐదో రోజు పల్లె పండగ వార్షికోత్సవాలు> గుర్లలో మెడికల్ క్యాంపులో కుప్పకూలిన ఏఎన్ఎం > మంత్రి కొండపల్లి చొరవతో రోడ్ల నిర్మాణాలకు నిధుల విడుదల> రామతీర్ధం గిరి ప్రదక్షిణ రహదారికి ఎమ్మెల్యే నాగమాధవి శంకుస్థాపన > గుర్లలో కలెక్టర్ అంబేద్కర్ పర్యటన
బొబ్బిలి ఫ్లైఓవర్ డౌన్‌లో టూవీలర్‌పై నుంచి భారీ కంటైనర్ వెళ్ళిపోవడంతో ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మరణించాడు. మృతుడు మెట్టవలస గ్రామానికి చెందిన కర్రి సత్యనారాయణగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరికొంతమందికి గాయాలైనట్లు సమాచారం. బొబ్బిలి ఇన్స్పెక్టర్ కే సతీష్ కుమార్ ఘటన స్థలానికి సిబ్బందితో చేరుకున్నారు. వివరాలు సేకరించడంతో పాటు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
మంగళిగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన మహిళ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, విజయనగరం, ఎస్.కోట, కురుపాం ఎమ్మెల్యేలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, కోళ్ల లలిత కుమారి,తోయక జగదీశ్వరి హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు విలువైన సూచనలు, సలహాలు అందజేశారు.
ఉమ్మడి జిల్లాలో ఉన్న అంబేద్కర్ గురుకులాల సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నెల్లిమర్ల పాఠశాలలో శుక్రవారం సందడిగా జరిగింది. పది పాఠశాలల నుంచి 103 మంది బాలికలు, 53 మంది బాలురు ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. మొత్తం 130 ప్రదర్శనలు ప్రదర్శించారు. గురుకులాల సమన్వయకర్త టీఎం ఫ్లోరెన్స్, డిప్యూటీ డీఈఓ కెవి రమణ, ఎంఈఓలు సూర్యనారాయణమూర్తి, విజయ్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారావు పాల్గొన్నారు.
గుర్ల మండలంలో డయేరియాతో మరొకరు మృతిచెందారు. ప్రతివాడ సూరమ్మ (70 ) డయేరియాతో శుక్రవారం మృతి చెందింది. ఇదే గ్రామానికి చెందిన కలిసేట్టి రవి (28) తల్లి కలిసేటి సీతమ్మ మంగళవారం డయేరియాతో మృతి చెందింది. తల్లి మరణం తట్టుకోలేక మనస్తాపానికి గురైన రవి శుక్రవారం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు రోజు రోజుకు పెరగడంతో గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
రైలులో గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన లడ్డ- పార్వతీపురం రైల్వే స్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. పోలీసులు వివరాల మేరకు రాయగడ గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేస్తున్న బండారి సన్యాసిరావు (57) కు గుండెపోటు రావడంతో రైల్లోనే మృతి చెందారు. గమనించిన తోటి ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం చేరవేయడంతో దీనిపై స్పందించిన పోలీసులు మృతుని కుటుంబ సభ్యులను రప్పించి మృతదేహాన్ని రాయగడ తరలించారు.
Sorry, no posts matched your criteria.