India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడ ఏపీలో విజయవాడ తరువాత సాలూరులో అత్యధికంగా లారీలు ఉన్నాయి. సుమారు 2 వేలకు పైగా లారీలు ఉండగా 5 వేల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గతంలో నెలలో విశాఖ నుంచి రాయపూర్‌కి 4 ట్రిప్పులు ఉండేవని ఖర్చులు పోను రూ.30 వేల వరకు మిగిలేదని, ప్రస్తుతం ట్రిప్పులు లేక నష్టం వస్తున్నాయని లారీ యజమానులు తెలిపారు. కొంతమంది లారీలు అమ్ముకోగా, మరికొన్ని ఫైనాన్స్ కంపెనీలు తీసుకువెళ్లాయన్నారు.
కొమరాడ మండలంలో చంద్రంపేటకి చెందిన గార సింహగిరి (45) ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందాడు. కొమరాడ పోలీసులు స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సింహగిరి గురువారం బహిర్భూమికి వెళ్లి చెరువు వద్ద కాలుజారి పడిపోవడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు చెప్పారు. ఈయన తెలంగాణలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్లలో డయేరియా బాధితులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం పరామర్శించారు. తాగునీటి పథకాల ద్వారా సరఫరా అవుతున్న నీటి నాణ్యతపై రిపోర్టులు సేకరించాలని మంత్రి ఆదేశించారు. ఈ నివేదికలన్నీ సమగ్రంగా విశ్లేషించిన తర్వాత నీరు కలుషితం కావడానికి కారణాలపై ఒక అంచనాకు రావాలని చెప్పారు. అప్పటివరకు గ్రామస్థులకు ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారానే నీటిని సరఫరా చేయాలన్నారు.
విజయనగరంలో గురువారం లీటర్ పెట్రోల్ రూ.109.44గా ఉంది. గత పది రోజుల నుంచి పెట్రోల్ రేట్ రూ.108.69-109.91 మధ్యలో కొనసాగుతోంది. లీటర్ డీజిల్ రూ.97.24 కాగా నిన్నటితో పోల్చితే కొంతమేర పెరిగింది. ఇటు పార్వతీపురం జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.22గా ఉంది. లీటర్ డీజిల్ రూ.97.97 కాగా గత పదిరోజుల నుంచి దీని ధర రూ.97.97-98.11 మధ్యలో కొనసాగుతోంది.
ఉమ్మడి విజయనగరం జిల్లాకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినప్పటికీ మధ్యాహ్నం వరకు సముద్రంపై ఆ ప్రభావం కొనసాగుతూనే ఉంటుందని వెల్లడించింది. సుముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొంది. సాధారణ రోజుల కంటే 1.5 మీటర్ల ఎత్తు అదనంగా అలలు ఎగసిపడే అవకాశం ఉందని సూచించింది.
డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సిబ్బంది సమస్యలు 17 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఏపీ వైద్యమిత్ర ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జె.ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ఉన్నతాధికారులకు ఇప్పటికే వినతిపత్రం అందజేశామని, ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళుతున్నట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆదేశించారు. అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా పారిశుద్ధ్య సమస్య రాకూడదని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు. గుర్ల డయేరియా ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు.
శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జనసేనలో చేరుతారంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీన్ని ఆయన అనుచరవర్గం తీవ్రంగా ఖండించింది. గడిచిన 32 ఏళ్ల నుంచి DCCB బ్యాంకు నుంచి బొత్స సిరిమానోత్సవాన్ని తిలకించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపింది. ఈ నేపథ్యంలో DCCB కార్యాలయంలో కూర్చున్న ఫొటో ఆధారంగా అసత్య ప్రచారం చేయడం సరికాదంటూ మండిపడింది.
చంపావతి నదిలో కళేబరాలు కొట్టుకురావడం వల్లనే నీరు కలుషితమై గుర్లలో అతిసారం ప్రబలిందనే వార్త అపోహ మాత్రమేనని కలెక్టర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఆ నీటిని పరీక్షలు జరపగా నెగటివ్ వచ్చిందని, కలుషితం కాలేదని తెలిపారు. వదంతులను ప్రజలు నమ్మవద్దని, ప్రస్తుతం పరిస్థితి అంతా అదుపులోనే ఉందని వెల్లడించారు. చంపావతి నది నీరు 26 గ్రామాలకు సరఫరా అవుతుందని, ఏ గ్రామం లో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని పేర్కొన్నారు.
విశాఖపట్నానికి తలమానికంగా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నిలవబోతోందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. భోగాపురంలో విమానాశ్రయం వద్ద GMR సంస్థ ప్రతినిధులతో బుధవారం భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. వచ్చే 50ఏళ్లను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి రాకపోకలు సులభతరం చేయడానికి అవసరమైన మార్గాల అభివృద్ధిపై చర్చించామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.