Vizianagaram

News October 16, 2024

విశాఖకు తలమానికంగా అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్: MP

image

విశాఖపట్నానికి తలమానికంగా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నిలవబోతోందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. భోగాపురంలో విమానాశ్రయం వద్ద GMR సంస్థ ప్రతినిధులతో బుధవారం భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. వచ్చే 50ఏళ్లను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి రాకపోకలు సులభతరం చేయడానికి అవసరమైన మార్గాల అభివృద్ధిపై చర్చించామని చెప్పారు.

News October 16, 2024

VZM: డయేరియా మరణాలపై సీఎం ఆరా

image

గుర్లలో డయేరియాతో ఐదుగురు మృతి చెందడంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారన్న సమాచారంపై సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న చికిత్స, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

News October 16, 2024

VZM: పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ

image

ఢిల్లీలో జరిగిన మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరిగిన ఎగ్జామినేషన్ ఆఫ్ డిమాండ్ ఫర్ గ్రాండ్స్ 2024-25 సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి ఎంపీ పలు సూచనలు, సలహాలు అందజేశారు.

News October 16, 2024

గుర్లలో కోరలు చాచిన డయేరియా

image

విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో డయేరియా కోరలు చాచింది. రెండు రోజుల వ్యవధిలో ఐదుగురు మ్యత్యవాత పడ్డారు. బుధవారానికి డయేరియా కేసులు మరిన్ని పెరిగాయి. స్థానిక ఉన్నత పాఠశాలలో161 మందికి చికిత్స అందిస్తున్నారు. కలుషిత నీరు తాగడం వల్లే డయేరియా ప్రబలిందని బాధితులు చెబుతున్నారు. నెల్లిమర్ల సీహెచ్సీ, విజయనగరం పెద్ద ఆసుపత్రి, గోషాలో డయేరియా రోగులు చికిత్స పొందుతున్నారు.

News October 16, 2024

అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలలో పైడిరాజుకు కాంస్య పతకం

image

సాలూరు మండలం మామిడిపల్లికి చెందిన కనకల పైడిరాజు ఈనెల 10 నుంచి 19 వరకు మలేషియాలో జరుగుతున్న అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో 800 మీటర్ల రన్నింగ్‌లో కాంస్య పతకం సాధించినట్లు ఆమె గురువు పొట్నూరు శ్రీరాములు తెలిపారు. 36వ మలేషియా ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ఇండియా తరఫున పాల్గొన్న పైడిరాజు భారతదేశానికి 800 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

News October 16, 2024

విజయనగరం డ్వాక్రా బజార్‌ను సందర్శించిన మన్యం జిల్లా కలెక్టర్

image

విజయనగరంలో ట్యాంక్ బండ్ సమీపంలో, DRDA ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్‌ను మన్యం జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన వివిధ రాష్ట్రాలు నుంచి వచ్చి అమ్మకాలు చేపడుతున్న మహిళా సంఘాలు సభ్యులతో మాట్లాడి ఆదాయం ఎంత వస్తుంది అనేది అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో, DRDA పీడీ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు.

News October 15, 2024

VZM: సిరిమానోత్సవంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు

image

విజయనగరం శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, శ్యాం ప్రసాద్ సందడి చేశారు. సిరిమాను రథంతో పాటు పర్యటించారు. మూడు సార్లు కూడా రథం ముందు నడిచి ముందుకు సాగారు. ఈ సందర్భంగా విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ మాట్లాడుతూ.. ఉత్సవాల విజయవంతానికి సహకరించిన అధికార యంత్రాంగానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

News October 15, 2024

DCCB బ్యాంకు ఆవరణ నుంచి సిరిమాను ఘట్టాన్ని తిలకించిన బొత్స

image

ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎప్పటిలాగే DCCB బ్యాంకు ఆవరణ నుంచి పైడితల్లి సిరిమానోత్సవాన్ని తిలకించారు. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి.. అమ్మవారి సిరిమానును భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. పైడిమాంబ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా బొత్స ఆకాంక్షించారు.

News October 15, 2024

కోట నుంచి సిరిమాను ఘట్టాన్ని తిలకించిన అశోక్ గజపతి

image

కేంద్ర మాజీ మంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఎప్పటిలాగే కోట నుంచి సిరిమాను ఘట్టాన్ని తిలకించారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సిరిమానును దర్శించుకున్నారు. అశోక్‌తో కలిసి సిరిమాను ఘట్టాన్ని తిలకించిన వారిలో విశాఖ ఎంపీ శ్రీ భరత్, శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ నేత గొంప కృష్ణ, రాజ కుటుంబీకులు ఉన్నారు.

News October 15, 2024

విజయనగరంలో సందడి చేసిన సినీ తారలు

image

విజయనగరంలో ‘జనక అయితే గనక’ సినిమా హీరో సుహాస్, హీరోయిన్ సంఘీర్తన మంగళవారం సందడి చేశారు. సినిమా సక్సెస్ మీట్‌లో భాగంగా స్థానిక సప్తగిరి సినిమా హాల్‌కు విచ్చేశారు. ఈ నేపథ్యంలో పైడితల్లి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చిన్న సినిమా అయినప్పటికీ, పెద్ద ఎత్తున హిట్ సాధించిందని, ఈ నేపథ్యంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నట్లు చెప్పారు.