India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పైడితల్లి సిరిమానోత్సవ ఘట్టంలో పలువురు ప్రజాప్రతినిధులు సందడి చేశారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, తదితరులు సిరిమానుతో పాటు తిరిగి భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సిరిమాను ఘట్టం ముగింపు వరుకు పర్యటించి సందడి చేశారు.
ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విజయనగరం పట్టణంలో మంగళవారం సందడి చేశారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరి మానోత్సవానికి విచ్చేసిన ఆయన అమ్మవారి దర్శనం అనంతరం.. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జరిగిన సిరిమానోత్సవంలో పలువురు కోరిక మేరకు సెల్ఫీలు దిగి సందడి చేశారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఇక నుంచి వారు జిల్లా కార్యకలాపాల్లో భాగస్వామ్యం కానున్నారు.
➤ విజయనగరం జిల్లాలో ఓ సిండికేట్ 500కు పైగా దరఖాస్తులు వేశారు.
➤ వారు దరఖాస్తులకు రూ.10 కోట్లు పెట్టారు.
➤ వారికి దక్కింది మాత్రం 8 షాపులే..!
➤ టీడీపీ నేత 25 దరఖాస్తులు వేశారు.
➤ ఆయకు ఒకే ఒక్క షాపు తగిలింది.
➤ వైసీపీ నేత 50 దరఖాస్తులు వేశారు.
➤ అతనికి మూడు షాపులు వచ్చాయి.
విజయనగరం కళలకు పుట్టినిల్లు అని రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి వంగలపూడి అనిత కొనియాడారు. రెండురోజులపాటు ఘనంగా నిర్వహించిన విజయనగరం ఉత్సవాల ముగింపు సభలో సోమవారం రాత్రి హోమ్ మంత్రి మాట్లాడారు. విజయనగరం ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. నగరంలో ఏ మూల చూసినా కళా ప్రదర్శనలతో కోలాహలంగా ఉందని అన్నారు. ఘంటసాల, సుశీల లాంటి ఎంతోమంది ప్రఖ్యాతి పొందిన కళాకారులు ఇక్కడ నుంచే వచ్చారన్నారు.
మద్యం షాపుల లాటరీలో ఈ ముగ్గురు అదృష్టవంతులనే చెప్పాలి. ఆయా మద్యం షాపులకు మొదటి దరఖాస్తు సమర్పించిన ముగ్గురికి లాటరీలో షాపులు దక్కాయి. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో తొలి టెండర్ వేసిన కనకల కృష్ణ, చీపురుపల్లిలో నామాల గణపతి, గజపతిగరంలో కుమిలి శ్రీనుకు టోకెన్ నంబర్లు 1గా కేటాయించారు. అనూహ్యంగా లాటరీలో సైతం వీళ్ల టోకనే రావడంతో షాపులు వారికే ఇచ్చారు. ఈ ముగ్గురి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ సీఎండీ ఇమ్మడి పృథ్వితేజ్ అన్నారు. సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూడాలని, అవసరమైన యంత్రాంగం, పరికరాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఎస్ఈ, ఈఈలను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ ప్రమాదాలు గుర్తిస్తే టోల్ ఫ్రీ నెం. 1912 లేదా కంట్రోల్ రూమ్ నెం. 94906 10102 తెలియజేయాలన్నారు.
విజయనగరంలో మంగళవారం జరగబోవు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో లక్షలాది భక్తులు పాల్గోనున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ లైన్లు తగిలి ప్రమాదాలు జరగకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చీకటికి చెక్ పెట్టేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. విద్యుత్, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా జనరేటర్ సహాయంతో వెలిగే విద్యుత్ లైట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరం సోమవారం ఘనంగా జరిగింది. ఊరంతా పండగ శోభను సంతరించుకుంది. పులివేషాలు, కర్రసాము, కత్తిసాము, వివిధ వేషాలతో పట్టణంలో సందడి నెలకొంది. అమ్మవారికి మొక్కులు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. ఘటాలతో, అమ్మవారి నామ స్మరణతో పట్టణం మారుమోగింది. వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి భక్తులు తరలివస్తున్నారు.
భక్తుల కోర్కెలు తీర్చే పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. నేటి నుంచి మొదలయ్యే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జాతర అక్టోబర్ 29న ఉయ్యాల కంబాల ఉత్సవంతో ముగుస్తుంది. రేపు సిరిమానోత్సవం జరగనుండగా 2 వేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పైడితల్లి జాతర నేపథ్యంలో నేడు, రేపు విజయనగరంలో మద్యం దుకాణాలు, బార్లు మూసివేయనున్నట్లు సీఐ మన్మథరావు తెలిపారు.
Sorry, no posts matched your criteria.