India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎస్.కోట నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అనర్హతపై ఈనెల 31న విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించిన రఘురాజు వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని మండలి ఛైర్మన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం అనర్హతపై ఛైర్మన్ మోషేన్ రాజు నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఎన్నికల ముందు అతని భార్య టీడీపీలో చేరగా ఆయన మాత్రం వైసీపీలో ఉంటూ టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు విమర్శలున్నాయి.
ఉమ్మడి జిల్లాలో బాల్య వివాహాలకు అడ్డుకట్టపడడంలేదు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు, అవగాహన లేకపోవడం వంటి కారణాలతో చిన్న వయసులో అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. దీంతో జిల్లాలో టీనేజీ ప్రెగ్నెన్సీ శాతం క్రమేపి పెరిగి వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. 2023-24లో గర్భందాల్చిన వారిలో బాలికల శాతం పార్వతీపురం మన్యం జిల్లాలో 9.71% ఉండగా.. విజయనగరం జిల్లాలో 8.41 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
బెస్ట్ వాల్యూ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇన్ ఏషియాలో ఏయూకు మెరుగైన స్థానం లభించింది. ఆసియాలోని 20 దేశాలలో 3,349 ఉన్నత విద్యాసంస్థలను అధ్యయనం చేసి ఈ స్థానాలు ప్రకటించారు. ఏయూ అత్యుత్తమమైన వర్సిటీల్లో మొదటి 9 శాతంతో 271 ర్యాంక్ సాధించింది. అధికారిక ఉత్తర్వులను ఏయూ వీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్‌లకు అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీఎన్ ధనుంజయరావు అందజేశారు.
పిల్లల సరదాలు కన్నపేగుకు కడుపుకోతను మిగిలుస్తున్నాయి. బొబ్బిలి మండలంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తోనంగి సాయి ఏకైక సంతానం కావడంతో అతని తల్లిదండ్రుల ఆర్తనాదాలకు అవధులు లేవు. అటు జామి ఘటనలో మరణించిన షాకిద్ ఖాన్ తల్లిదండ్రులు రోజువారీ కూలీ చేసుకుంటూ చదిస్తున్నారు. ముగ్గురు కుమార్తెల తర్వాత పుట్టిన ఏకైక మగ సంతానం మహమ్మద్ అస్రాఫ్ మరణవార్త విన్న అతని అమ్మానాన్న శోక సంద్రంలో మునిగిపోయారు.
గర్భిణులు పొందుతున్న సేవలపై నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా మాతృ, శిశు మరణాలు సమీక్ష ఉప కమిటీ చైర్మన్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఎస్.భాస్కరరావు అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో మార్చి, ఏప్రిల్ నెలలో జిల్లాలో సంభవించిన మాతృ, శిశు మరణాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గర్భిణులపై పర్యవేక్షణ ఉండాలని చెప్పారు.
మధ్యప్రదేశ్‌లోని బాంధవగఢ్ టైగర్ ఫారెస్టులో బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన పర్యటిస్తున్నారు. తనకు ఇష్టమైన వన్యప్రాణులకు ఫోటోలు తీస్తూ సేద తీరుతున్నారు. బేబినాయన తీస్తున్న ఫోటోలు ‘కాక ఆంగ్లం మ్యాగజైన్’లో ప్రచురితం అవుతాయి. గతంలో తల్లీపిల్ల పులుల ఫోటోకు అంతర్జాతీయ అవార్డును బేబినాయన సొంతం చేసుకున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పలు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద వాహనాల పార్కింగ్ కేంద్రం బయట ఏర్పాటు చేయడం జరిగిందని, నిర్దేశిత ప్రదేశంలో వాహనాలను నిలుపుదల చేయాలని స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రంలోనికి ప్రవేశించే వారికి విధిగా పాస్ ఉండాలని ఆయన చెప్పారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎక్కడ ఎక్కువ మంది గుమికూడరాదని ఆయన అన్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లాలో సజావుగా, ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ప్రతీఒక్కరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ దీపిక కోరారు. విజయనగరం పార్లమెంటు స్థానంలో పోటీ చేసిన అభ్యర్ధులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.
జామి వాటర్ ఫాల్స్‌లో గల్లంతైన విజయనగరం కంటోన్మెంట్‌కు చెందిన<<13330025>> ముగ్గురు <<>>యువకులలో ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఇంకొకరి కోసం APSDRF బృందాల చేత గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తమ పిల్లల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.యువకుల మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జామి వాటర్ ఫాల్స్‌లో ముగ్గురు యువకులు గల్లంతైన<<13329808>> విషయం తెలిసిందే<<>>. వీరు విజయనగరం కంటోన్మెంట్‌కు చెందిన వారిగా గుర్తించారు. మొత్తం ఆరుగురు యువకులు వాటర్ ఫాల్స్ వద్దకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వీరిలో మహమ్మద్ రజక్(13), మహమ్మద్ షాహిద్ ఖాన్ (17), మహమ్మద్ ఆశ్రీఫ్ (16) గల్లంతు అయినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరిని రక్షించేందుకు విశాఖ నుంచి APSDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
Sorry, no posts matched your criteria.