India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నివాసంలో శ్రావణమాస పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. సోదర, సోదరి అనుబంధానికి ప్రతీక రాఖీ అని మంత్రి చెప్పారు. అనంతరం ఆమె తన సోదరులు, పార్టీ నేతలు నిమ్మాది చిట్టి, మత్స శ్యామ్, గుళ్ల వేణు, ఆముదాల పరమేశు, కనక, కూనిశెట్టి భీమా తదితరులకు రాఖీలు కట్టారు.
విజయనగరం నుంచి గరివిడి, చీపురుపల్లి, పాలకొండ రహదారి విస్తరణకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబును కలిసి ప్రతిపాదనలు అందజేశారు. పలాస వరకు సుమారు 160 కిలోమీటర్ల పొడవునా నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని సీఎంను కోరారు. అలాగే నెల్లిమర్ల జంక్షన్ నుంచి రణస్థలం జంక్షన్ వరకు నాలుగు లైన్ల రహదారిగా మార్చాలని విన్నవించారు.
బొబ్బిలి మండలం మెట్టవలసకు చెందిన <<13886084>>చంటి<<>>(20) నిన్న చనిపోయిన విషయం తెలిసిందే. కాకినాడలో ఇంజినీరింగ్ చదివే చంటి అగ్నిపథ్‌లో ఆర్మీ విభాగానికి సెలెక్ట్ అయ్యాడు. త్వరలో రన్నింగ్ రేస్, ఇతర పరీక్షలు రాయాల్సి ఉంది. ఈక్రమంలోనే ఇంటికి వచ్చాడు. వినాయక చవితి మండపానికి ఎం.బూర్జివలస నుంచి కర్రలు తీసుకొస్తుండగా రైలు పట్టాలపై కర్రలు వైర్లకు తగిలి చనిపోయాడు. కుమారుడు చనిపోవడంతో తల్లిద్రండులు బోరున విలపించారు.
అన్న క్యాంటీన్ నిర్వహణకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇటీవల జిల్లా కేంద్రంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఆయన రూ.లక్ష చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. పేదల ఆకలి తీర్చేందుకు తన మొదటి నెల జీతం రూ.లక్షను నాన్నమ్మ పేరిట అందజేశారు. ఇంటికి ఎవరు వచ్చినా తన నాన్నమ్మ ఆకలితో ఉంచేది కాదని గుర్తు చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. రామభద్రపురం నుంచి వయా రాజాం, పొందూరు, చిలకపాలెం వరుకు సుమారు 60 కిలోమీటర్ల రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయాలని, అలాగే రామభద్రపురం నుంచి వయా పార్వతీపురం బైపాస్, రాయగడ వరుకు రహదారి విస్తరించాలని ప్రతిపాదనలు అందజేశారు. సీఎం సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.
గుమ్మలక్ష్మీపురం మండలం గొరడ, ఆర్ జమ్మూ, కొండ బారెడు, వలసబల్లేరు గ్రామాల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులను కలిసి ముచ్చటించారు. అక్కడ సాగు చేస్తున్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కొందరు రైతులు వరి నాట్లు వేస్తుండగా.. వారితో కలిసి ఆయన నాట్లు వేశారు. గిరిజనులతో రోజంతా గడపడం ఎంతో ఆనందంగా ఉందని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సబల్‌పూర్-ఈరోడ్ రైలును ఈనెల 21, నుంచి నవంబర్ 27 వరకు ప్రతి బుధవారం నడపనున్నారు. తిరుగు ప్రయాణంలో ఈరోడ్ నుంచి ప్రతి శుక్రవారం ఈ రైలు బయలుదేరుతుందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. ఈ రైలు కొత్తవలస స్టేషన్‌లో ఆగుతుందని చెప్పారు.
ఉమ్మడి విజయనగరంలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
➤బొబ్బిలి టౌన్: నాగేశ్వరరావు
➤విజయనగరం టాస్క్ ఫోర్స్: మోహన్ రావు
➤ఎల్విన్పేట: సత్యనారాయణ
➤సాలూరు టౌన్: CH వాసు నాయుడు
➤పార్వతీపురం టౌన్- PVVS కృష్ణారావు
➤విజయనగరం ఉమెన్ PS: నాగేశ్వరరావు.
వాగులో కొట్టుకుపోయి చనిపోయిన ఆర్తి, మహేశ్ మృతదేహాలను మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర పరిశీలించారు. ‘ఇది చాలా బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడానికి నేను వెళ్లగా వాళ్లు తిరస్కరించారు. ఇది వారి ఆత్మాభిమానానికి అద్దం పడుతుంది. మృతదేహాల తరలింపు తమకు సంబంధం లేదని తొలుత అధికారులు చెప్పడం దారుణం’ అని రాజన్న దొర మండిపడ్డారు. కాగా విమానంలో మృతదేహాల తరలింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఉమ్మడి విజయనగరం జిల్లా పాచిపెంట(M) సరాయివలస సమీపంలోని రాయిమాను కొండవాగులో ఇద్దరు టీచర్లు మృతిచెందిన విషయం తెలిసిందే. హరియాణాకు చెందిన టీచర్లు మహేశ్, ఆర్తి మృతదేహాలు స్వగ్రామం చేరే వరకు పూర్తి ఖర్చులు భరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు పరిహారంతో పాటు ఉద్యోగం ఇస్తామని పేర్కొంది. వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.4 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి సంధ్యారాణి ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.