Vizianagaram

News May 26, 2024

మూడంచెల భద్రతను తనిఖీ చేసిన ఎస్పీ

image

విజయనగరం ఎస్పీ ఎం.దీపిక శనివారం లెండి ఇంజనీరింగ్ కళాశాలలో సార్వత్రిక ఎన్నికల తదనంతరం భద్రపరచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూం వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రత, గార్డ్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

News May 25, 2024

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసిన ఎస్పీ

image

ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే జేఎన్టీయూ, లెండి ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పన, భద్రత ఏర్పాట్లను ఎస్పీ దీపిక ఎం.పాటిల్ శనివారం పరిశీలించారు. ఎటువంటి ఆటంకం తలెత్తకుండా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రత, గార్డ్స్‌ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.

News May 25, 2024

పూసపాటిరేగ: జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు గంగపుత్రుల ఎంపిక

image

పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన సత్తిరాజు, దిలీప్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. చింతపల్లి గ్రామ పెద్దలు ఈ విద్యార్థులను సన్మానించారు. గ్రామానికి చెందిన పలువురు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటే మత్స్యకార కుటుంబాలకు చెందిన విద్యార్థులు మంచి ప్రతిభను చాటుతారన్నారు. కార్యక్రమంలో చింతపల్లి గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

News May 25, 2024

డిగ్రీ ఫలితాల్లో బొబ్బిలి విద్యార్థిని టాప్ ర్యాంకర్

image

డిగ్రీ ఫలితాల్లో బొబ్బిలికి చెందిన పొట్నూరు హారిక జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. బీఎస్సీ మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో హారిక 9.7 గ్రేడ్ పాయింట్స్ సాధించి జిల్లా టాప్ ర్యాంకర్‌గా నిలిచింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన హారిక జిల్లాలో మొదటి స్థానంలో నిలవడంతో కుటుంబ సభ్యులు, పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, తదితరులు ఆమెకు అభినందనలు తెలిపారు.

News May 25, 2024

నేత్రపర్వంగా సింహాద్రి అప్పన్న నిత్య కళ్యాణం

image

సింహాచలం ఆలయంలో వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠిపజేశారు. పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.

News May 25, 2024

VZM: కూల్.. కూల్‌గా వాతావరణం

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వాతావరణం శనివారం చల్లబడింది. వారం రోజులుగా భానుడు తన ఉగ్రరూపాన్ని చూపించడంతో ప్రజలు ఉష్ణ తాపానికి ఇక్కట్లు పడ్డారు. నిన్న సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి.

News May 25, 2024

విజయనగరంలో నేడు డిప్యూటీ డీఈవో పరీక్ష

image

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఈవో పరీక్ష నేడు విజయనగరం జిల్లాలో 6 కేంద్రాల్లో జరుగుతోందని, మొత్తం 1,470 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని డీఆర్‌ఓ అనిత పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌‌‌‌తో పాటు ఒరిజినల్ ఫోటో, గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలని సూచించారు.

News May 25, 2024

VZM: విద్యార్థిని ఆత్మహత్య

image

ఇంటర్ ఫెయిల్ అయ్యిందని తండ్రి మందలించడంతో కుమార్తె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం సింగిరెడ్డివలసకు చెందిన విద్యార్థిని (17) విశాఖలోని మహారాణిపేట బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. ఇంటర్ ఫెయిల్ అయిన విషయం తెలుసుకున్న తండ్రి కుమార్తెకు ఫోన్ చేసి మందలించాడు. మనస్తాపానికి గురైన బాలిక శుక్రవారం మహారాణిపేట ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

News May 25, 2024

విశాఖలో ఎల్.కోట మహిళ మృతి

image

కుమార్తెను కాలేజీలో చేర్చడానికి తన కుమారుడితో బైక్‌పై వెళ్తుండగా వెల్లంకి సాధుమఠం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి అక్కడికక్కడే మృతిచెందగా, కుమార్తె, కుమారుడు గాయాలపాలయ్యారు. విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం గనివాడకు చెందిన సవళ్ళ నవ్య(40) తన కుమార్తె ఝాన్సీని ఇంటర్‌లో జాయిన్ చేయడానికి వెళ్తుండగా లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

News May 25, 2024

విజయనగరం: సరిగ్గా 10 రోజులు.. ఉత్కంఠ

image

ఎన్నికల ఫలితాలకు సరిగ్గా నేటి నుంచి 10 రోజులు ఉంది. ఒక్కోరోజు గడుస్తున్నా కొద్దీ అభ్యర్థులు సహా.. పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో ఎక్కడ చూసినా ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. పలుచోట్ల ఎవరికి వారు గెలుపుపై అంచనాలు వేస్తూ బెట్టింగులు వేస్తున్నారు. మన విజయనగరం జిల్లాలోని 9 స్థానాల్లో ఎవరు గెలుస్తారో చూడాలి. మరోవైపు అధికార యంత్రాంగం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద నిరంతరం భద్రత చర్యలు తీసుకుంటోంది.
– మీ కామెంట్..?