India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ రూరల్ తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడికి విశాఖ జిల్లా కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. మూడు నెలల తర్వాత నిందితుడికి ఊరట లభించింది. కోర్టు షరతుల ప్రకారం బెయిల్ మంజూరు చేసింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
కంబోడియా సైబర్ నేరగాళ్ల నుంచి ఎట్టకేలకు 60 మందికి విముక్తి లభించింది. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకున్న విశాఖ వాసి ఒకరు ఇచ్చిన సమాచారంతో విశాఖ నగర కమిషనర్ స్పందించారు. విశాఖకు చెందిన 150 మంది, దేశవ్యాప్తంగా 5,000 మంది కంబోడియా మోసగాళ్ల చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. విముక్తి లభించిన 60 మంది గురువారం భారత్‌కు బయలుదేరినట్లు విశాఖ పోలీసులకు సమాచారం అందింది. వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2024కు సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.inలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఆయా వెబ్‌సైట్‌లో డౌన్లోడ్ చేసి సంబంధిత కాపీలను విద్యార్థులకు అందజేయవలసిందిగా విజయనగరం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపట్టే ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని విజయనగరం కలెక్టర్, ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. ఆర్ఓలు, ఏఆర్వోలు, డీటీలు, నోడల్ అధికారులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టరేట్ ఆడిటోరియంలో తొలివిడత అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పారు.
పట్టణంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుడిని 24 గంటల్లోనే అరెస్టు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ బి.వెంకటరావు తెలిపిన వివరాల మేరకు.. గాజులరేగకు చెందిన వెంకటేశ్ 21న ఆంజనేయస్వామి గుడివద్ద నిలబడ్డాడు. లంకాపట్నంకు చెందిన ఏసు లిఫ్ట్ ఇస్తానని నమ్మించి, చైన్ లాక్కోగా నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. అతని వద్ద స్కూటీని, బంగారం గొలుసు రికవరీ చేసినట్లు చెప్పారు.
వేపాడ మండలంలో కుమ్మపల్లి జంక్షన్ వద్ద కొత్తవలస నుంచి ఆనందపురం వైపు వస్తున్న టాటా మ్యాజిక్ వ్యక్తిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వల్లంపూడి ఎస్సై రాజేశ్ వివరాల మేరకు ఎల్.కోట మండలం పిల్ల అగ్రహారానికి చెందిన గొలగాని అప్పన్న కుమ్మపల్లి జంక్షన్ కోళ్ల ఫారమ్‌లో పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం టాయిలెట్‌కు వెళుతున్న అప్పన్నను టాటా మ్యాజిక్ ఢీకొంది. డ్రైవర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసారు.
గంట్యాడ మండలంలోని ఒక గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలిక ఆడుకుంటున్న సమయంలో 54 సంవత్సరాలు వయస్సు గల అడ్డూరి చందర్రావు మంగళవారం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో రక్తం మడుగులో ఉన్న బాలికను విజయనగరం హాస్పిటల్‌కి చికిత్స నిమిత్తం తరలించారు. బాలిక అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరం దిశ పోలీస్ స్టేషన్ ఎస్సై నారాయణరావు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కి తరలించారు.
విజయనగరం గిరిజన యూనివర్సిటీలో వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు తుది గడువును ఈ నెల 26వ తేది వరకు పొడిగిస్తున్నట్లు వైస్ ఛాన్స్‌లర్ ప్రొ.తేజస్వి కట్టిమని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్ష రాసిన వారు 26వ తేదీ రాత్రి 11.55 వరకు https://www.ctuap.ac.in లో గాని https://ctuapcuet.samarth.edu.in/pg లో గాని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
రాష్ట్రంలో విజయవాడ తరువాత జిల్లాలో సాలూరు లారీ పరిశ్రమకు పెట్టింది పేరు. ఇక్కడ సుమారు 2300 వరకు లారీలు ఉన్నాయి. ఈ మోటారు పరిశ్రమపై 18 వేల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగాను ఆధారపడి జీవిస్తున్నాయి. ఇంతమందికి జీవనాధారమైన ఈ పరిశ్రమ పెరిగిన ఆయిల్, విడిభాగాలు ధరలకు అనుగుణంగా కిరాయిలు పెరగకపోవడంతో బాటు లోడింగ్ లేక అధిక మొత్తం లారీలు యార్డ్‌లోనే ఉంటున్నాయి. దీనివలన చాలా కుటుంబాల వారు రోడ్డున పడ్డారు.
గరుగుబిల్లి మండలం సుంకి గ్రామ సమీపంలో ఉన్న పామాయిల్ తోటల్లో గజరాజుల గుంపు సంచరిస్తోంది. దీంతో సమీప ప్రాంత ప్రజలంతా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపు ఏ క్షణాన ఎవరిపై దాడికి వస్తుందోనన్న భయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో పంటలు వేసేందుకు రైతులు పంట పొలాలను దుక్కులు వేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇదిలా ఉంటే తక్షణమే ఏనుగులను ఈ ప్రాంతాల నుంచి తరలించాలని కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.