Vizianagaram

News May 22, 2024

పామాయిల్ తోటల్లో గజరాజుల గుంపు

image

గరుగుబిల్లి మండలం సుంకి గ్రామ సమీపంలో ఉన్న పామాయిల్ తోటల్లో గజరాజుల గుంపు సంచరిస్తోంది. దీంతో సమీప ప్రాంత ప్రజలంతా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపు ఏ క్షణాన ఎవరిపై దాడికి వస్తుందోనన్న భయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో పంటలు వేసేందుకు రైతులు పంట పొలాలను దుక్కులు వేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇదిలా ఉంటే తక్షణమే ఏనుగులను ఈ ప్రాంతాల నుంచి తరలించాలని కోరుతున్నారు.

News May 22, 2024

VZM: పది సప్లమెంటరీ పరీక్షలు రాయనున్న 4,210 మంది విద్యార్థులు

image

ఈ నెల 24 నుంచి జూన్ 3 వ‌ర‌కు ప‌దోత‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ప్రారంభకానున్నాయి. ప‌రీక్ష ఉద‌యం 9.30కి మొదలై మ‌ధ్యాహ్నం 12.45కి ముగుస్తుంది. జిల్లాలో మొత్తం 4,210 మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాయ‌నున్నారు. వీరిలో 2,482 మంది బాలురు, 1728 మంది బాలికలు ఉన్నారు. వీరికోసం జిల్లా వ్యాప్తంగా 19 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

News May 22, 2024

VZM: 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఈ నెల 24 నుంచి 31 వ‌ర‌కు ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ప్రారంభంకానున్నాయి. మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థులు 14,904 మంది, ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్ధులు 7,927 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కానున్నారు. మొత్తం 42 ప‌రీక్షా కేంద్రాల్లో, మొద‌టి సంవ‌త్స‌ర ప‌రీక్ష ఉద‌యం 9 నుంచి 12 గంట‌లు వ‌ర‌కు, రెండో సంవ‌త్స‌ర ప‌రీక్ష మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వ‌ర‌కు జ‌రుగుతుందని అధికారులు తెలిపారు.

News May 22, 2024

విజయనగరం: టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

image

ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్న టెన్త్‌ అడ్వాన్స్డ్ స‌ప్లిమెంట‌రీ, ఇంట‌ర్ సప్లిమెంటరీ ప‌రీక్షల‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా కలెక్టర్ నాగ‌ల‌క్ష్మి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా.. పదోతరగతి, ఇంట‌ర్, సప్లిమెంటరీ, డైట్ సెట్ పరీక్షల నిర్వహణపై త‌న ఛాంబర్‌లో అధికారులతో బుధవారం స‌మీక్షించారు. ఆయా శాఖల అధికారుల ద్వారా సమాచారం అడిగి తెలుసుకున్నారు.

News May 22, 2024

రక్తహీనతపై శ్రద్ధ వహించాలి: మన్యం కలెక్టర్

image

రక్తహీనతపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ గర్భిణీలలో రక్తహీనత, ప్రసవ మరణాలు, తల్లిబిడ్డల నమోదు, కంటి వెలుగు, 108 వాహనాలు వంటి తదితర అంశాలపై సమీక్షించారు.

News May 22, 2024

పెద మానాపురం: బావిలో పడి వ్యక్తి మృతి

image

ప్రమాదవశాత్తు బావిలో పడి ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందినట్లు పెదమానాపురం ఎస్సై శిరీష బుధవారం విలేకరులకు తెలిపారు. విశాఖకు చెందిన కునిచెర్లపటి శివాజీ కుమార్ (60)తో పాటు మరో నలుగురు చినకాద శివారు రాజుల పేటలో జరిగే పండగకు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం వాష్ రూమ్‌కి వెళ్లిన కుమార్ ఎంతకీ రాకపోయేసరికి పరిసర ప్రాంతాలు వెతకగా నేలబావిలో మృతదేహం లభించిందని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

News May 22, 2024

చీపురుపల్లి: ప్రేమ విఫలం.. యువకుడు ఆత్మహత్య

image

చీపురుపల్లి మండలంలోని కర్లాం గ్రామంలోని జీడి మామిడి తోటలో మరువాడ లక్ష్మణరావు (25) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులు కథనం ప్రకారం.. మృతుడు అదే గ్రామంలోని ఓ యువతితో ప్రేమలో పడినట్లు, వీరి ప్రేమకు అబ్బాయి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కె కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు.

News May 22, 2024

ఎల్.కోట: ఊబిలో మునిగి పశువుల కాపరి మృతి

image

ఎల్.కోట మండలం రంగారాయపురంలో ఊబిలో మునిగి వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై గోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరమణ(62) పశువుల కాపరులతో కలిసి కరెడ్ల వారి కోనేరు సమీపానికి వెళ్లాడు. అక్కడ పశువులు కోనేరులో ఉన్న ఊబిలో దిగగా.. వాటిని నెట్టే ప్రయత్నంలో అతను ఊబిలో మునిగి చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News May 22, 2024

సింహాచలం: నేడు, రేపు ఆర్జిత సేవలు రద్దు

image

సింహాచలం ఆలయంలో బుధవారం, గురువారం ఆర్జిత సేవలన్నీ రద్దు చేసినట్లు సింహాచలం దేవస్థానం ఏఈఓ ఆనంద్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈనెల 22న శ్రీ నృసింహ జయంతి, స్వాతి నక్షత్ర హోమం నిర్వహిస్తున్న కారణంగా ఆర్జిత సేవలు అన్నింటిని రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే 23న వైశాఖ పౌర్ణమి కావడంతో గురువారం కూడా ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News May 22, 2024

VZM: నేటి నుంచి ఆ సేవలు బంద్..?

image

విజయనగరం జిల్లాలో ఆరోగ్యశ్రీకి సంబంధించి దాదాపు రూ.50 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ఆసుపత్రుల యజమానులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులతో చర్చలు జరిపారు. అవి విఫలం కావడంతో నేటి నుంచి జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు 46 ఉన్నాయి. వీటిలో ఏడాదికి రెండు లక్షలకు పైగా రోగులు చికిత్స పొందుతున్నారు.