Vizianagaram

News April 6, 2024

చీపురుపల్లి: ఆత్మీయ సమావేశంలో కళా వెంకట్రావు

image

చీపురుపల్లిలోని ఓ ప్రైవేట్ పంక్షన్ హల్ లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కూటమి అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ .. ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News April 5, 2024

పార్వతీపురం: గుర్తు తెలియని మృతదేహం

image

పార్వతీపురం మండలం కృష్ణపల్లి సమీపంలో గుర్తు తెలియని యువకుని మృతదేహాన్ని గుర్తించినట్లు రూరల్ ఎస్సై దినకర్ తెలిపారు. స్థానిక వీఆర్వో సంఘటనా స్థలానికి వెళ్లామన్నారు. మృతుడు గ్రీన్ కలర్ ట్రాక్ ప్యాంటు, నీలం రంగు షర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. 30-35 ఏళ్ళ వయసు ఉంటుందన్నారు. మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో భద్రపరిచినట్లు వెల్లడించారు. ఆచూకీ తెలిసినవారు రూరల్ పోలీస్ స్టేషన్ సంప్రదించాలన్నారు.

News April 5, 2024

G.M. వలస మండలాన్ని వీడని గజరాజులు

image

G.M. వలస మండలాన్ని గజరాజులు వీడడం లేదు. రబీ సీజన్లో రైతులు వేసిన పంటలను ఏనుగుల గుంపు నాశనం చేస్తుంది. అరటి, మొక్కజొన్న, కర్బూజా వంటి పంటలతో పాటు వరి చేలలో ఏనుగుల గుంపు సంచరించడంతో పంటలు పాడవుతున్నాయి. వేలాది రూపాయలు మదుపులుగా పెట్టి పంటను చేతికి అందుతున్న తరుణంలో ఏనుగులు పాడు చేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.

News April 5, 2024

‘అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థులు గెలుపే లక్ష్యం’

image

అరుకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీకి పోటీ చేస్తున్న తెదేపా బీజేపీ జనసేన అభ్యర్థుల సమావేశం విశాఖపట్నంలో శుక్రవారం జిల్లా పార్టీ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అరుకు ఎంపీగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీతతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా నుంచి పార్వతీపురం, సాలూరు, కురుపాం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థులు విజయచంద్ర, గుమ్మడి సంధ్యారాణి, జగదీశ్వరి హాజరయ్యారు.

News April 5, 2024

సాలూరు వీఆర్వో శ్రీరాములు మృతి

image

సాలూరు వీఆర్వో గోర్జ శ్రీరాములు(57) హార్ట్‌ఎటాక్‌తో మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. పెదబోరబంద గ్రామానికి చెందిన శ్రీరాములు సాలూరు పట్టణంలో వీఆర్వోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఆఫీసులోనే గుండె నొప్పి వచ్చింది. స్పందించిన తోటి సిబ్బంది హుటాహుటిన విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News April 5, 2024

జామిలో వ్యక్తి సూసైడ్

image

జామి మం. బలరాంపురానికి చెందిన వి అప్పారావు (52) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎంతకీ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో నీళ్లలో బ్లీచింగ్ పౌడర్ కలిపి తాగేశాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని కుటుంబ సభ్యులు విజయనగరం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదుచేశామన్నారు.

News April 5, 2024

విశాఖ: 7న జూలో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు

image

ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో జాతీయ’జూ ప్రేమికుల దినోత్సవం’ ఈనెల 8వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 7వ తేదీన ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు. 3 నుంచి 12 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు అన్నారు. జూలోని జంతువుల మాదిరి చిన్నారులు డ్రెస్ వేసుకుని పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.

News April 5, 2024

VZM: ఉపాధి హామీ పనులు అమలులో మనమే టాప్

image

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని అమలులో రాష్ట్రంలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం 1 ఏప్రిల్‌ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు జిల్లాలో 2.10 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా 1.18 లక్షల పని దినాలను కల్పించారు. జిల్లాలో 3.21 లక్షల కార్డులపై 5.04 లక్షల కూలీలు ఉపాధి హామీ పనులను వినియోగించుకుంటున్నారు.

News April 4, 2024

పార్వతీపురం: ‘ఆ కాలేజీలపై చర్యలు తీసుకుంటాం’

image

ఇంటర్ విద్యార్థులకు మార్చి 28 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించిందని జిల్లా వృత్తి విద్యాధికారిణి మంజుల వీణ తెలిపారు. జూన్ 1 నుంచి తిరిగి కాలేజీలు ప్రారంభమవుతాయని ఆమె వెల్లడించారు. సెలవుల్లో కళాశాలలో ఎటువంటి క్లాసులు నిర్వహించరాదని సూచించారు. షెడ్యూల్ విడుదల కాకుండా.. ప్రవేశాలు చేపట్టే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 4, 2024

విజయనగరం: టీచర్లపై పెట్టిన కేసు కొట్టివేత

image

విజయనగరం జిల్లాలో 2017 జూన్ 28న టీచర్ల బదిలీల కౌన్సిలింగ్ విధానంపై ఉపాధ్యాయ సంఘాలు చేసిన కలెక్టరేట్ ఫికెటింగ్ నిర్వహించారు. దీంతో పోలీసులు ఉపాధ్యాయ సంఘ నాయకులపై కేసు నమోదు చేశారు. కోర్టులో ఆనాటి నుంచి విచారణ జరుగుతూ ఉంది. గురువారం జిల్లా జడ్జి కోర్టులో ఈ కేసును కొట్టివేసినట్లు ఉపాధ్యాయ సంఘ నాయకులు తెలిపారు.