India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ. గిరీశ పి.ఎస్.ఆదివారం జిల్లాలో పర్యటించనున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 12 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకొని విజ్జీ స్టేడియం వద్ద శాప్ క్రీడా మైదానాన్ని పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనంతరం క్రీడా సంఘాలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.
1. విజయనగరం జిల్లా ఎప్పుడు ఏర్పడింది.?
2. బొబ్బిలి యుద్ధం ఎప్పుడు జరిగింది.?
3. విజయనగరం జిల్లాలోని 4నదుల పేర్లు చెప్పండి?
4. జిల్లాకు చెందిన ద్వారం వెంకటస్వామి నాయుడు ఏ రంగంలో నిష్ణాతుడు.? ఈ ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ రూపంతో తెలియజేయండి.
NOTE: వీటి ఆన్సర్లను ఇదే ఆర్టికల్‌లో మధ్యాహ్నం 3గంటలకు మీరు చూడవచ్చు.
విజయనగరం జిల్లాకు 2 కుంకీ ఏనుగులు రానున్నట్లు సమాచారం. మన జిల్లాలో ఏనుగులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి ఏపీకి 4 ఏనుగులను రప్పిస్తుండగా.. అందులో విజయనగరానికి 2 కుంకీలు వచ్చే అవకాశం ఉంది. మన రాష్ట్రం నుంచి ఐదు మంది ట్రాకర్లను అక్కడకు పంపి శిక్షణ ఇప్పించి, మచ్చిక చేసుకోనున్నారు.
మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జిల్లాలో నమోదు చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 23 మందికి రూ.1.20 లక్షల జరిమానాను కోర్టు విధించిందని చెప్పారు. వీరిలో ఏడుగురికి రూ.10వేలు చొప్పున జరిమానా విధించారని చెప్పారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విశాఖ- కిరండూల్ మధ్య నడుస్తున్న రైళ్లు వర్షాల కారణంగా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు దంతెవాడకు కుదించినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ శుక్రవారం తెలిపారు. ఈ రైళ్లు విశాఖ నుంచి దంతెవాడ తిరుగు ప్రయాణంలో దంతెవాడ నుంచి విశాఖకు చేరుకుంటాయని తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా ఈనెల 28న పెదతాడివాడ గ్రామం నుంచి సిరిమాను వృక్షాన్ని తరలించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుకుంపేట వద్ద సిరిమాను వృక్షాన్ని తరలించేందుకు వడ్రంగులు ఎడ్ల బండిని తయారు చేస్తున్నారు. ఈ ఎడ్ల బండి పైన సిరిమాను, ఇరుసుమాను వృక్షాలను భారీ ఊరేగింపు నడుమ దేవస్థానం వద్దకు తరలించిన అనంతరం సిరిమానుగా మలుస్తారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 223 <<14205579>>మద్యం షాపు<<>>లకు ప్రభుత్వం అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. విజయనగరం జిల్లాలో మొత్తం 165 షాపులకు గాను అన్ రిజర్వ్ షాపులు 149, కల్లుగీత కార్మికులకు 15, సొండిలకు 1 కేటాయించినట్లు తెలుస్తోంది. పార్వతీపురం జిల్లాలో 58 షాపులకు అన్ రిజర్వ్ 53, కల్లుగీత కార్మికులకు 5 షాపులు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రామతీర్థం ఉత్తరాంధ్రకే పెద్ద వరంగా చెప్పొచ్చు. సహజసిద్ధంగా ఉండే బోడికొండ ప్రకృతి ప్రేమికులను తన చెంతకు రప్పించుకుంటుంది. రాముడు నడయాడిన నేలగా కొండపై ఎన్నో చారిత్రక ఆనవాళ్లున్నాయి. దుర్గాభైరవకొండ, గురు భక్తుల కొండ మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంతటి ఘనకీర్తి ఉన్నప్పటికీ కనీసం రహదారి సదుపాయం కూడా లేదు. ప్రభుత్వం దృష్టిపెడితే గొప్ప పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది.
డెంకాడ మండలం పెదతాడివాడలో గుర్తించిన పైడితల్లి అమ్మవారి సిరిమాను చింతచెట్టు నగరానికి శనివారం తీసుకురానున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, చెట్టును కొట్టే కార్యక్రమం చేపడతారు. అనంతరం భారీ ఊరేగింపుతో ఆ చెట్లను పలు కూడళ్ళ మీదుగా పూజారి స్వగృహం ఉన్న హుకుంపేట తరలిస్తారు. అక్కడ నిపుణులైన వడ్రంగులు ఈ చెట్టును సిరిమానుగా మలిచే పని మొదలు పెడతారు.
డెంకాడ మండలంలోని జాతీయ రహదారిపైనున్న నాతవలస టోల్ గేట్ వద్ద సిబ్బందితో మంత్రి నారా లోకేశ్ గురువారం సందడి చేశారు. శ్రీకాకుళం నుంచి విశాఖ రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో టోల్ గేట్ వద్ద కాసేపు ఆగి కార్యకర్తలు, అభిమానుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా టోల్ గేట్ సిబ్బంది లోకేశ్‌తో సెల్ఫీలు తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.