India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో పలు రకాల సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. వివిధ పనుల కోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకుని రవాణా శాఖ కార్యాలయానికి చేరుకుంటున్న వాహనదారులు సర్వర్ డౌన్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ డౌన్‌కి సంబంధించిన సమాచారాన్ని నోటీసు బోర్డులో పెట్టడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు.
ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎస్.కోట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు బుధవారం రాత్రి అమెరికాకు పయనమయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు అమెరికాలో ఉంటున్నారు. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు భార్య అమెరికాలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. అతని పిల్లలు అక్కడే చదువుకుంటున్నారు.
గతేడాది అక్టోబరు 29న కంటకాపల్లి-అలమండ స్టేషన్ల మధ్య జరిగిన రైలు ప్రమాదానికి సీనియర్ రైల్వే ఆపరేటింగ్ అధికారుల నిర్లక్ష్యమూ కారణమేనని ఇండియన్ రైల్వే లోకో రన్నింగ్ మెన్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సంజయ్ పాండీ పేర్కొన్నారు. అదే రోజు మూడు రైళ్లు సిగ్నళ్లను జంప్ చేశాయన్న ఆయన.. నిర్దేశిత వేగం కంటే అధొక వేగంతో వెళ్లినట్లు డేటాలాగర్ పరికరంలో నమోదైనా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు.
సీతానగరం మండలం మర్రివలస సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన కాలువలో గురువారం ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. జీఆర్పీ హెచ్సీ ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని మృతదేహం రైల్వే ట్రాక్ పక్కన ఉన్నట్లు స్థానికుల తెలిపిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని, మృతదేహం గుర్తు పట్టలేనంతగా కుళ్లిపోయిందన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విజయనగరంలో నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు గురువారం హల్చల్ చేశారు. ఓ హోటల్‌కు వెళ్లిన నలుగురు యువకులు.. తాము FCI అధికారులమని, డబ్బులు ఇవ్వాలని, లేకపోతే తనిఖీలు చేస్తామని బెదిరించారు. అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు చెప్పడంతో.. గొర్లి మహేశ్వరరావు(గరివిడి), కిరణ్(విశాఖ), తర్లాడ దయానంద(నర్సీపురం), కామేశ్వరరావు( కొరటాం)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్సై హరిబాబు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల కళాశాలల్లో ఫస్టియర్‌లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త టి.పద్మజ తెలిపారు. బాలురుకు 210(ఎంపీసీ-110, బైసీపీ-100) బాలికలకు 169(ఎంపీసీ-60, బైసీపీ-53, సీఈసీ-22, ఎంఈసీ-33) సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెల 16న కొప్పెర్ల గురుకులంలో బాలురకు, 17న చీపురుపల్లిలో బాలికలకు కౌన్సెలింగ్ ఉంటుందని, ఆసక్తిగల వారు సర్టిఫికేట్లతో హాజరవ్వాలన్నారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దువ్వాడ మీదుగా భువనేశ్వర్-యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. భువనేశ్వర్-యలహంక (02811) ప్రత్యేక రైలు జూన్ 1 నుంచి 29 వరకు నడపనున్నారు. యలహంక-భువనేశ్వర్ (02812) ప్రత్యేక రైలు యలహంకలో జూన్ 3 నుంచి జూలై 1 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందనున్నది. ఈ రైళ్లు ఖుర్దా, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్ల కోట తదితర స్టేషన్‌ల మీదుగా నడవనున్నాయి.
<<13254747>>బొబ్బిలి<<>> మండలం ఎం.బూర్జివలస వద్ద రైలు ఢీకొని బుధవారం యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. రైల్వే హెచ్సీ ఈశ్వరరావు వివరాల మేరకు.. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న తెర్లాం మండలం నందబలగకు చెందిన పక్కి రవి (21) ఓటు వేయడానికి వచ్చాడు. బొబ్బిలి వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఎం. బూర్జివలస సమీపంలో బైక్ ఆపి, బహిర్భూమికి వెళ్లడానికి పట్టాలు దాటుతుండగా గూడ్స్ ఢీకొని మృతి చెందాడు.
సార్వత్రిక ఎన్నికల్లో కూటవి విజయం తథ్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 130కి పైగా స్థానాల్లో విజయం సాధింస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి, అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు వైసీపీపై తమ వ్యతిరేకతను ఓటు ద్వారా తెలిపారన్నారు. పార్వతీపురంలో ఓ కార్యక్రమానికి బుధవారం హాజరైన ఆయన.. విలేకర్లతో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్, పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్ బుధవారం తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్‌లకు కల్పించిన మూడంచెల భద్రత, బందోబస్తును పరిశీలించారు. రేయింబవళ్లు పహారాతో పాటు సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. అప్రమత్తంగా ఉండాలని భద్రతా అధికారులకు తెలిపారు.
Sorry, no posts matched your criteria.