India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బొబ్బిలి జీఆర్పీ హెచ్సీ బీ.ఈశ్వరరావు తెలిపిన వివరాల.. ప్రకారం బొబ్బిలి సమీపంలోని ఎం.బూర్జవలస రైల్వే ట్రాక్ వద్ద బుధవారం మృతదేహం లభ్యమయ్యింది. సాయంత్రం 5 గంటల సమయంలో పట్టాలు దాటుతుండగా గూడ్స్ ఢీకొనడంతో మృతిచెందినట్లు తెలిపారు. మృతుడు తెర్లాం మండలం నందబలగకు చెందిన పక్కి రవిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెచ్సీ తెలిపారు.
విజయనగరం ఓటర్లు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. 2019లో 70.86% పోలింగ్ నమోదవగా.. ఉమ్మడి జిల్లాలోనే అది అత్యల్పం. కాగా తాజా ఎన్నికల్లో ఆ శాతం స్వల్పంగా పెరిగి 71.84%గా నమోదైనప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఇదే తక్కువ. నియోజకవర్గంలో 1,84,787 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 89,886 మంది పురుషులు, 94,894 మంది మహిళలు, 7గురు ఇతరులు కలరు. ఇక్కడ అభ్యర్థుల విజయంలో మహిళల ఓటింగే కీలకంగా మారింది.
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో మూడుచోట్ల 2019 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే ఇప్పుడు తక్కువగా నమోదైంది. 2019లో సాలూరులో 79.46%, ఎస్.కోటలో 86.18%, గజపతినగరంలో 86.9% ఓటింగ్ నమోదైంది. 2024లో చూస్తే సాలూరులో 76.45%, ఎస్.కోటలో 85.45%, గజపతినగరంలో 86.44 శాతంగా పోలయ్యాయి. మరి ఇది గెలుపు ఓటముల్లో ఎవరిపై ప్రభావం చూపేనో..?
రాష్ట్రంలోను, ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2019 ఫలితాలు పునరావృతం అవుతాయని వైసీపీ కో ఆర్డినేటర్, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం తన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం తీవ్రంగా శ్రమించారన్నారు.
సోమవారం జరిగిన పోలింగ్ ప్రక్రియపై విభిన్న ఊహాగానాలు, విశ్లేషణలు ప్రచారం జరుగుతున్నాయి. ఉమ్మడి విజయనగరంలో ఉదయం ప్రభుత్వ వ్యతిరేక ఓటుబ్యాంకు బాగా పోలైందని, సాయంత్రం నుంచి ప్రభుత్వ అనుకూల ఓటింగ్ భారీగా నమోదయిందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. పోలింగ్ విధానాన్ని విశ్లేషిస్తూ ఆయా పార్టీల నాయకులు విజయం తమదంటే.. తమదంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మరి మీ జిల్లాలో ఓటర్లు ఎటువైపు ఉన్నారో కామెంట్ చెయ్యండి?
నెల్లిమర్ల నియోజకవర్గంలో 88.25% పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గంలో 2,13,551 మంది ఓటర్లు ఉండగా 1,88,456 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 92,820 మంది పురుషులు, 95,635 మంది మహిళలు, ఒకరు ఇతరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో మహిళలే ఎక్కువ శాతం ఉండటం విశేషం. ఉమ్మడి విజయనగరంలో అత్యధిక పోలింగ్ శాతం నెల్లిమర్లలోనే నమోదైంది.
విజయనగరం జిల్లాలో 81.06% ఓటింగ్ నమోదైంది. జిల్లాలో 15,85,206 మంది ఓటర్లు ఉండగా 12,84,900 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 6,36,609 మంది పురుషులు, 6,48,267 మంది మహిళలు, 24 మంది ఇతరులు ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో మహిళలు అధిక సంఖ్యలో ఉండటం విశేషం. కాగా.. పార్వతీపురం మన్యం జిల్లాలో 77.10 శాతం పోలింగ్ నమోదవ్వగా.. 6,04,064 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గుర్ల: చింతలపేటలో తెల్లవారుజాము 3 గంటలవరకు పోలింగ్
విజయనగరం: కుమ్మరివీధి, చెరువుగట్టు ప్రాంతంలో రాత్రి 9.30 గంటల వరకు ఓటింగ్
పార్వతీపురం: జగన్నాథపురం, వివేకానందకాలనీలో రాత్రి 9.10కి ముగించారు
జామి: రామభద్రపురంలో పోలింగ్ పూర్తయ్యే సరికి అర్ధరాత్రి 12 దాటింది
భోగాపురం: అప్పన్నపేటలో వేకువజాము 2.30 గంటల వరకు
డెంకాడ: పెదతాడివాడలో 12 వరకు, నాతవలస, డి.తాళ్లవలసలో రాత్రి 11 వరకు పోలింగ్ జరిగింది.
ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. లెండి ఇంజనీరింగ్ కళాశాలలో చీపురుపల్లి, రాజాం, నెల్లిమర్ల, ఎస్.కోట, గజపతినగరం నియోజకవర్గాల ఈవీఎంలను, జెఎన్‌టియు గురజాడ విశ్వవిద్యాలయంలో విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచారు. అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం స్ట్రాంగ్ రూములకు ఎన్నికల అధికారులు సీళ్లు వేశారు.
జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ప్రశాంత వాతావరణానికి ఎవరు భంగం కలిగించరాదని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు. 144 సెక్షన్ తక్షణం అమలులోకి వస్తుందని, తద్వారా ఎక్కడా ప్రజలు గుంపులుగా ఉండరాదని ప్రజలు గమనించాలని ఆయన సూచించారు.
Sorry, no posts matched your criteria.