India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవరోత్సవం ఈనెల 20న జరగనుంది. చదురుగుడి ఆలయం వద్ద దేవస్థానం సహాయక కమిషనర్ డి.వి.వి ప్రసాదరావు, సిబ్బంది, భక్తుల సమక్షంలో తలయారి చినపైడిరాజు చాటింపు వేశారు. ఉత్సవంలో భాగంగా అమ్మవారు తొలుత వనంగుడి నుంచి హుకుంపేటకు రానున్నారని సిరిమాను పూజారి వెంకటరావు తెలిపారు. అక్కడి నుంచి 21న వేకువజామున మూడులాంతర్లకు చేరనున్నారన్నారు.
ఏపీలో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వచ్చి తిరిగి వెళ్లే వారి సౌకర్యార్ధం రైల్వే శాఖ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. విశాఖ-సికింద్రాబాద్-విశాఖ(08589/08590) మధ్య ఈ నెల 14, 15 తేదీలలో నడుస్తుందని తెలిపారు. 14వ తేదీ సాయంత్రం 4.15గంటలకు విశాఖలో బయలుదేరి 15వ తేదీ ఉదయం 6.15కి సికింద్రాబాద్ చేరుతుంది. మరల 15వ తేదీ ఉదయం 10.30గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి అదే రోజు రాత్రి 11.30కు విశాఖ చేరుతుంది.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్నిపోలింగ్ కేంద్రాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. సా.5గంటలకు కురుపాం, సాలూరులో పోలింగ్ ముగిసింది. మరో గంటలో మిగిలిన చోట్లు పోలింగ్ ముగుస్తున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి. >SHARE IT
పార్వతీపురం మన్యం జిల్లాలో ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మాక్ పోలింగ్ అనంతరం ఈవీఎంలను చెక్ చేసి ఓటర్లను లోపలకు అనుమతించారు. పార్వతీపురం ప్రభుత్వ బ్రాంచ్ హైస్కూల్లో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్, ఆయన సతీమణి లైన్‌లో నిల్చున్నారు. పార్వతీపురం మినహా కురుపాం, సాలూరు, పాలకొండ నియోజవకర్గాల్లో గంట ముందు పోలింగ్ ముగియనుంది.
విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక సోమవారం విజయనగరం పట్టణం తోటపాలెంలో గల ఎం.ఎస్.ఎన్. కళాశాల పోలింగు కేంద్రంలో సామాన్య ఓటర్లతో పాటు క్యూ లైనులో నిలబడి, తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ కూడ రాజ్యాంగబద్ధమైన తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.
విజయనగరం కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల కంట్రోల్ రూం నుంచి మాక్ పోలింగ్‌ను కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పర్యవేక్షణ చేస్తున్నారు. ఉదయం 5-45 గంటలకే జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్‌ల సమక్షంలో ప్రారంభమైన మాక్ పోలింగ్ నిర్వహించామని అధికారులు తెలిపారు. ఎన్నికల సజావుగా సాగేందుకు అన్నీ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలింగ్ సమయానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ఏజెంట్లు రాకపోవడంతో మాక్ పోలింగ్ ఆలస్యమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కురుపాం, సాలూరు, పాలకొండలో గంట మందే పోలింగ్ ముగియనుంది.
విజయనగరం జిల్లాలో సోమవారం జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికల పోలింగ్ సాఫీగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి చెప్పారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది ఆదివారం చేరుకున్నారని తెలిపారు. అన్ని మౌళిక వసతులు కల్పించినట్లు తెలిపారు.
సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం సేకరించేందుకు, విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశాల మేరకు ప్రత్యక ఏర్పాట్లు చేశారు. పోల్ డే మేనేజ్ మెంట్ సిస్టం అనే యాప్ ద్వారా పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు ఆయా నియోజకవర్గాల నుంచి పోలింగ్ శాతం నమోదు చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు.
ఎన్నికల ప్రక్రియ కోసం సిబ్బందిని, సామగ్రిని తరలించడానికి విజయనగరం జిల్లా వ్యాప్తంగా 226 రూట్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ రూట్లలో 120 ఆర్టీసీ బస్సులు, 265 మినీ బస్సులను వినియోగిస్తున్నామన్నారు. ఇవి కాకుండా ఎన్నికల అధికారులకు కార్లు, వ్యాన్‌లు తదితర ఇతర వాహనాలను సమకూర్చారు. మొత్తం 225 మంది సెక్టార్ అధికారులు ఈ రూట్లను పర్యవేక్షించనున్నట్ల తెలిపారు.
Sorry, no posts matched your criteria.