Vizianagaram

News March 27, 2024

కొమరాడ: ఐదు కిలోల గంజాయి స్వాధీనం

image

ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం కూనేరు చెక్‌పోస్ట్ వద్ద బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాయగడ వైపు నుంచి వస్తున్న ఒక ప్రైవేట్ బస్సులో గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు ఒక వ్యక్తి పట్టుబడినట్లు తెలుస్తుంది. ఈ నెల 5వ తేదీన కూడా మూడు కిలోల గంజాయితో ఇద్దరు మైనర్లు పట్టుబడిన విషయం తెలిసిందే.

News March 27, 2024

జియ్యమ్మవలస: ‘అనుమానంతోనే హత్య చేశాడు’

image

జియ్యమ్మవలస మండలం సింగనాపురం గ్రామంలో <<12902871>>భార్యను హత్య<<>> చేసిన భర్తను అరెస్ట్ చేసినట్లు పాలకొండ డీఎస్పీ జి. కృష్ణారావు బుధవారం తెలిపారు. ఈ నెల 22న మృతురాలు గంట అప్పలనరసమ్మ కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు హంతకుడైన గంట ముసలి నాయుడిని అరెస్ట్ చేశామన్నారు. తన భార్యపైన అనుమానంతోనే హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందని స్పష్టం చేశారు. సీఐ మంగరాజు, ఎస్సై ఈ.చిన్నం నాయుడు పాల్గొన్నారు.

News March 27, 2024

VZM: ‘ప్రభుత్వ భవనాలపై పార్టీల రంగులు తొలగించాలి’

image

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, భవనాలపై ఉన్న పార్టీల రంగులను తొలగించాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు, ప్రవర్తన నియమావళి అమలు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సీఈఓ ముఖేశ్ కుమార్‌ మీనా జిల్లా కలెక్టర్‌లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

News March 27, 2024

విశాఖలో IPL మ్యాచ్.. ఓపెన్ అయిన గంటలోనే..!

image

ఈనెల 31న విశాఖలో చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసందే. మ్యాచ్‌కు సంబంధించి ఈరోజు ఉ.10 గంటలకు ఆన్‌లైన్ టికెట్లను అందుబాటులో ఉంచారు. ఓపెన్ అయిన గంటలోపే వెయ్యి, రూ.2వేలు, రూ.3వేలు, రూ.4 వేల టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోగా.. మ.12.30కి మొత్తం టికెట్లు అయిపోయాయి. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ధోనీ క్రేజ్ వల్లే టికెట్లు త్వరగా అయిపోయాయని ఫ్యాన్స్ అంటున్నారు.

News March 27, 2024

VZM: ఏప్రిల్ 4 నుంచి సదరం స్లాట్ బుకింగ్ లు

image

సదరం ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఏప్రిల్ 4 వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ లు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధిత ప్లాట్లు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు అందరూ మీ దగ్గర లో ఉన్న అన్ని గ్రామ, వార్డు సచివాలయాలు లేదా మీ సేవా సెంటర్లకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. > SHARE IT

News March 27, 2024

విజయనగరం: రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో కలెక్టర్ సమావేశం

image

ఏప్రెల్ 14వ తేదీ లోగా కొత్తగా ఓటు న‌మోదు కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి సూచించారు. ఇలా వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను 25వ తేదీలోగా ప‌రిశీలించి, అర్హులైన‌వారికి ఓటుహ‌క్కు క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. వివిధ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో త‌న ఛాంబ‌ర్‌లో బుధ‌వారం క‌లెక్ట‌ర్ స‌మావేశ‌మ‌య్యారు. ఓట‌ర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, ఎన్నిక‌ల‌కు సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించారు.

News March 27, 2024

బొత్సకు పోటీగా ఎవరు?

image

ఉమ్మడి విజయనరగం జిల్లాలో చీపురుపల్లి మినహా ఎన్డీఏ కూటమి మిగతా అభ్యర్థులు ప్రకటించింది. బొత్స సత్యనారాయణకు పోటీగా గంటా శ్రీనివాస్‌ను బరిలో దింపాలని టీడీపీ అధిష్ఠానం భావించినా.. ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో మీసాల గీత పేరును అధిష్ఠానం పరిశీలించింది. అంతేకాక విజయనగరం ఎంపీ అభ్యర్థి కోసం చేసిన ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా గీత పేరును చేర్చింది. దీంతో చీపురుపల్లి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

News March 27, 2024

రేపు విశాఖకు చెన్నై సూపర్ కింగ్స్ టీం..!

image

ఈనెల 31న విశాఖలో జరిగే చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ టికెట్ల అమ్మకాలు ఈరోజు ఉ.10 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్‌ వెబ్‌సైట్‌ ద్వారా ప్రారంభం కానున్నాయి. టికెట్ల ధరలు రూ.1,000, రూ.1,500, రూ.2వేలు, రూ.3వేలు, రూ.3,500, రూ.5వేలు, రూ.7,500గా నిర్ణయించారు. కేవలం ఆన్ లైన్ లో మాత్రమే టికెట్లు అమ్మకాలు జరుగుతాయి. రేపు CSK జట్టు, ఎల్లుండి ఢీల్లీ క్యాపిటల్స్ జట్టు విశాఖ రానున్నట్లు సమాచారం.

News March 27, 2024

VZM: మే 1 నుంచి వేసవి క్రీడా శిబిరాలు

image

బాలల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు, సెలవులను సద్వినియోగం చేసుకునేలా ఏటా క్రీడాశాఖ వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది మే 1 నుంచి 31 వరకు శిబిరాలు ఉంటాయని ఆ శాఖ ఉమ్మడి జిల్లా అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. 8 నుంచి 14 ఏళ్ల లోపున్న బాలబాలికలు ఈనెల 30వ తేదీలోగా వివరాలు అందజేయాలని కోరారు. శిబిరాల నిర్వహణకు ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

News March 27, 2024

VZM: నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

image

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు సీఈవో కె.రాజ్ కుమార్ తెలిపారు. విజయనగరంలోని జడ్పీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా అధికారులంతా పూర్తి సమాచారంతో హాజరుకావాలని సూచించారు. సభ్యులు అడిగిన సమాచారం సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు.