India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీ అవినీతి, అరాచక, దోపిడి ప్రభుత్వానికి మే 13న ప్రజలు ఉరి వెయ్యాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గురువారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. మేం అధికారంలోకి రాగానే బాదుడు లేని సంక్షేమం అందిస్తాం, పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
విజయనగరం జీఆర్పీ పరిధిలో గజపతినగరం, గరుడబిల్లి రైల్వే ట్రాక్ మధ్యలో గుర్తు తెలియని మృతదేహం విజయనగరం రైల్వే పోలీసులు గురువారం గుర్తించారు. మృతుడు వయస్సు సుమారు 60 నుంచి 65 సంవత్సరములు ఉంటుందని వారు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చీపురుపల్లిలోని బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలని ఎద్దేవా చేశారు. సోదరుడు అప్పలనరసయ్య గజపతినగరం MLA, మేనల్లుడు శ్రీను జడ్పీ ఛైర్మన్, మరో తమ్ముడు బడ్డుకొండ నెల్లిమర్ల MLA, అతనికి చీపురుపల్లి, భార్య విశాఖ ఎంపీ అభ్యర్థి అన్నారు. ఉత్తరాంధ్రలో సమర్థులు లేరా అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులకు సీట్లు ఇచ్చినందుకు ఉత్తరాంధ్రను దోచుకున్నా మాట్లాడట్లేదన్నారు.
జగన్ మందు బాబుల రక్తం తాగాలనుకున్నాడని కురుపాం సభలో చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ హయాంలో రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయ్యిందని ఆరోపించారు. నాసిరకం మందు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారని విమర్శించారు. కురుపాం కిల్లీ కొట్టులో ఉన్న ఆన్‌లైన్ పేమెంట్.. మందుషాపులో ఎందుకు లేదని ప్రశ్నించారు. కురుపాంలో దోచే డబ్బులు తాడేపల్లికి పంపిస్తున్నారని విమర్శించారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యండ్ లూమ్ టెక్నాలజీలో డిప్లమో కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి ఆర్.వి.మురళీ కృష్ణ తెలిపారు.
వెంకటగిరి, తిరుపతిలోని కాలేజీలకు జూన్1లోపు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
టీడీపీతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పల నాయుడు, నెల్లిమర్ల అసెంబ్లీ అభ్యర్థి లోకం మాధవి అన్నారు. గురువారం నెల్లిమర్ల పట్టణంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికలు ప్రచారం నిర్వహించారు. నెల్లిమర్ల అసెంబ్లీ NDA ఉమ్మడి కూటమి అభ్యర్థి మాధవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
చంద్రబాబు నేడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:25కు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో 10:35గం.కు విశాఖ చేరుకుంటారు. అక్కడ నుంచి హెలీకాప్టర్‌లో 11:30గంటలకు కురుపాం చేరుకుంటారు. అనంతరం రావాడ జంక్షన్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. భోజనం అనంతరం హెలికాప్టర్‌లో చీపురుపల్లిలో జరిగే సభకు చేరుకుని ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత విశాఖ సభలో పాల్గొంటారు.
రేపు జరిగే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనాన్ని మొదటిగా అనువంశిక ధర్మకర్తల కుటుంబ సభ్యులైన విజయనగరం గజపతిరాజులకే కల్పిస్తారు. ఉదయం 3.30 గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు అనువంశిక ధర్మకర్తల కుటుంబ సభ్యులతో పాటు న్యాయమూర్తులు, పట్టు వస్త్రాలు సమర్పించే దేవాదాయ శాఖ అధికారులకు మాత్రమే అంతరాలయ దర్శనాలు కల్పిస్తారు. సాయంత్రం మూడు నాలుగు గంటల మధ్య సేవకులు, విభిన్న ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తారు.
సింహాచలం ఆలయంలో ఈనెల 10వ తేదీన జరగనున్న అప్పన్న బాబు చందనోత్సవం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సాయంత్రం 6 తర్వాత సింహగిరి పైకి భక్తులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. రూ.300, రూ.1000, రూ.1500 టికెట్లు తీసుకున్నవారికి దర్శన సమయాల స్లాట్లు కేటాయించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉండడంతో ఈసారి ప్రోటోకాల్ దర్శనాలు లేవు.
ఎన్నికల రోజున పోలింగ్ బూత్‌ల వద్ద ఏర్పాట్లన్నీ పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. పోల్ డే మానేజ్మెంట్ సిస్టం ప్రకారంగా విధులన్ని నిర్వహించాలన్నారు. బుధవారం సెక్టార్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని పోలింగ్ స్టేషన్‌లలో ఎన్నికల సిబ్బందికి సరైన ఆహారం సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.