India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐ కళాశాలల్లో ప్రవేశాలకు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ టీవీ గిరి బుధవారం ఓ ప్రకటనలో కోరారు. iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు వచ్చే నెల 10వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వెల్డర్, ప్లంబర్లకు 8వ తరగతి, మిగతా అన్ని ట్రేడ్ లకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 15,62,921 మంది ఓటర్లు ఉన్నారు. ఏప్రిల్ 25వ తేదీ నాటికి ఎన్నికల అధికారులు తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం… జిల్లాలో 7,70,805 మంది పురుష ఓటర్లు ఉండగా… 7,92,038 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాగా మరో 78 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. వీళ్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మొత్తం 1897 పోలింగ్ స్టేషన్లను అధికారులు సిద్ధం చేశారు.
ఈ నెల 13న ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈనెల 11న సాయంత్రం 7నుంచి 13 సాయంత్రం 7 వరకు పూర్తిగా మూసివేయాలన్నారు. అదే విధంగా జూన్ 4న కౌంటింగ్ రోజు కూడా దుకాణాలను మూసి ఉంచాలని ఆదేశించారు.
వచ్చే ఎన్నికల్లో ప్రతీఒక్కరూ ఓటు వేసి, జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు తలాత్ పర్వేజ్ ఇక్బాల్ రోహిల్లా పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయనగరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. కలెక్టరేట్ వద్ద పరిశీలకులు స్వయంగా మోటార్ సైకిల్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు.
గురువారం చీపురుపల్లిలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ స్థలం వద్ద జరుగుతున్న ఏర్పాట్లును విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున బుధవారం పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున వెంట కిమిడి సూరప నాయుడు, మొండి దివాకర్, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కురుపాం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నట్లు టీడీపీ నియోజకవర్గ నాయకులు తెలిపారు. ఉదయం 9 గంటలకు సాయిబాబా గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుని.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వచ్చి రావాడ జంక్షన్ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం చీపురుపల్లిలో జరిగే రోడ్ షోలో పాల్గొనున్నారు.
సాధారణ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రమోద్ కుమార్ మెహర్డ అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సూక్ష్మ పరిశీలకుల ఓరియంటేషన్ ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని మంగళ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ రహస్యంగా, ప్రశాంతంగా జరగాలని అన్నారు.
రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో అర్హులైన 25,125 మంది పిల్లలకు విద్యాహక్కు చట్టం కింద ఉచితంగా ప్రవేశాలు కల్పించినట్లు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా వారికి ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రవేశాలు కల్పించాలన్నారు. ప్రవేశాలపై ఇబ్బందులు ఎదుర్కొంటే apscpcr2018@gmail.comకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడానికి అవకాశం లేని 85 ఏళ్లు పైబడిన వయో వృద్దులు, 40 శాతం వికలాంగత్వం దాటిన విభిన్న ప్రతిభావంతులు తమ ఇంటివద్దనే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చింది. వీరి ఇళ్లకు వెళ్లి ఓటు తీసుకొనే ప్రక్రియ సెక్టార్ అధికారుల పర్యవేక్షణలో మంగళవారం ప్రారంభించారు.
ఈరోజు ఇచ్ఛాపురంలో జరుగుతన్న సిద్ధం సభలో CM జగన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సాలూరులో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కురుపాంలో ట్రైబుల్ ఇంజినీరింగ్ కాలేజీ, పార్వతీపురం, విజయనగరం ప్రాంతాలలో మెడికల్ కాలేజీలు నిర్మించామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉరుకులు పరుగులతో నిర్మాణమవుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.