Vizianagaram

News March 25, 2024

జియ్యమ్మవలస: గవరమ్మపేటలో ఏనుగులు

image

జియ్యమ్మవలస మండలంలోని వెంకటరాజుపురం, గవరమ్మపేట గ్రామాల మధ్య ఏనుగులు సంచరిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో అరటి, మొక్కజొన్న, వరి పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఏనుగులతో పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.

News March 24, 2024

అరకు ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత

image

TDP-జనసేన-BJP ఉమ్మడి అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి కొత్తపల్లి గీతను BJP అధిష్ఠానం ఖరారు చేసింది. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున అరకు ఎంపీగా కొత్తపల్లి గీత గెలిచింది. తరువాత వైసీపీని వీడి బీజేపీలో చేరారు. అదే సందర్భంలో ఆమెపై పలు అవినీతి ఆరోపణలు రాగా.. కోర్టులో సదరు అభియోగాలపై గీతకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కాగా.. వైసీపీ తరఫున అరకు ఎంపీ అభ్యర్థిగా చెట్టి తనూజ రాణి బరిలో ఉన్నారు.

News March 24, 2024

విజయనగరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

బొండపల్లి మండలంలోని గ్రహపతి అగ్రహారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు బొండపల్లి ఎస్.ఐ కె.లక్ష్మణరావు ఆదివారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. గ్రామానికి చెందిన నమ్మి గౌరి నాయుడు బహిర్భూమికి రోడ్డుపై రాగా రెల్లిపేటకు చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తూ ఢీకొట్టాడు. 108 వాహనం వచ్చేసరికి గౌరినాయుడు మృతి చెందినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News March 24, 2024

విజయనగరం: ఆ రెండు స్థానాల్లో వీడని ఉత్కంఠ..!

image

విజయనగరం ఎంపీ, చీపురుపల్లి ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత ఎంపీ టికెట్ బీజేపీకి వెళ్తుందనే ప్రచారం సాగింది. తాజాగా విజయనగరం సీటు టీడీపీకి కేటాయిస్తారని వార్తలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశావహుల్లో ఒకరైన మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ ఇప్పటికే చంద్రబాబు వద్దకు వెళ్లినట్లు సమాచారం.

News March 24, 2024

బొబ్బిలి: పవన్‌ను కలిసిన రంగారావు

image

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజయ కృష్ణ రంగారావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మతో పాటు మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి పవన్‌తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్‌ను ఘనంగా సత్కరించి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. 

News March 24, 2024

జియ్యమ్మవలసలో గుర్తు తెలియని మృత దేహం లభ్యం

image

జియమ్మవలస మండలం ఇటిక పంచాయతీ ఇటిక గదబవలస గ్రామ శివారులోని తోటపల్లి కుడి కాలువ నుంచి, గుర్తు తెలియని  మృత దేహం కొట్టుకొని వచ్చిందని పోలీసులు తెలిపారు. అతని వయసు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వాళ్ళు పోలీస్ స్టేషన్‌కి తెలియజేయాలని కోరారు.

News March 24, 2024

VZM: నారా లోకేశ్‌ని కలిసిన TDP MLA అభ్యర్థులు

image

విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అదితి గజపతిరాజు, బేబీ నాయన, కొండపల్లి శ్రీనివాస్ శనివారం విజయవాడలో టీడీపీ నిర్వహించిన ఎన్నికల సన్నాహాక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేనతో కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.

News March 24, 2024

విశాఖ తీరంలో సోమర్సెట్… బాహుబలి నౌక!

image

భారత్, అమెరికా దేశాల సైనిక సంబంధాలు బలోపేతమయ్యేలా బంగాళాఖాతంలో విశాఖపట్నం కేంద్రంగా ‘టైగర్ ట్రయంప్’ ప్రత్యేక సాగర విన్యాసాలు జరుగుతున్నాయని నేవీ అధికారులు తెలిపారు. రెండు వారాలపాటు జరగనున్న ఈ విన్యాసాల కోసం బాహుబలి నౌకగా పేరొందిన ‘యూఎస్ సోమర్సెట్’ విశాఖతీరానికి చేరుకుంది. ఇది ఉభయచర యుద్ధ నౌకగా ఖ్యాతిగాంచింది.

News March 24, 2024

సింహాచలం: సింహాద్రి అప్పన్నకు రేపు పెళ్లి చూపులు

image

సింహాచలం సింహాద్రి అప్పన్నకు ఈనెల 25వ తేదీన పెళ్లిచూపులు జరగనున్నాయి. స్వామిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి కొండ దిగువన గల పుష్కరిణి సత్రంలోని ఉద్యానవన మండపానికి తీసుకువస్తారు. అక్కడ మండపంలో అధిష్ఠింప చేస్తారు. పెళ్లి నిశ్చయం అయినందున స్వామిని ఊరేగింపుగా అడవివరంలో వేంచేసి ఉన్న పైడితల్లమ్మ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అనంతరం మళ్లీ ఇక్కడకు తీసుకువచ్చి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు.

News March 23, 2024

విజయనగరం: ఉపాధ్యాయుడు సస్పెండ్

image

ప్రభుత్వ నివాస గృహాన్ని రాజకీయ కార్యకలాపాలకు వినియోగించుకోవడం పై ఉపాధ్యాయుడు అడ్డాకుల సన్యాసి నాయుడును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఇన్‌ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి జి.కేశవ నాయుడు శనివారం ధ్రువీకరించారు. కురుపాం ఎన్నికల అధికారి ఇచ్చిన నివేదిక మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు.