India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు పరిధి జగన్నాథగట్టుపై ఉన్న ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం కుదమకి చెందిన ఎన్.సాయికార్తీక్ నాయుడు(20) ఈసీఈ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం కళాశాలలోని హాస్టల్‌లోని 9వ అంతస్తు పైనుంచి దూకాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు గల కారణాలు తెలియాల్సివుంది. కాగా.. విద్యార్థి జేబులో సూసైడ్ నోట్ ఉన్నట్లు సమాచారం.
బొబ్బిలిలోని అమ్మిగారి కోనేరు సమీపంలోని అపార్టుమెంట్లోకి ఓ అపరిచిత వ్యక్తి శనివారం రాత్రి ప్రవేశించి కలకలం సృష్టించాడు. చంటి పిల్లలను ఎత్తుకెళ్లిపోవడానికి వచ్చాడని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెబుతున్నారు. ఆ వ్యక్తిని వెంటనే పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్టేషన్లో అతడు గట్టిగా అరుస్తుండడంతో మతిస్థిమితం లేని వ్యక్తి కావచ్చని భావిస్తున్నారు.
విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ ను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురు ఎస్పీలు కాసేపు చర్చించుకున్నారు. ఏఓబీ లోని మావోయిస్టుల కదలికలు, అంతర్ జిల్లాల పరిధిలో గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు ఉమ్మడిగా తీసుకోవలసిన చర్యల గురించి సమావేశంలో చర్చించారు.
జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాలని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఆ మేరకు వ్యవసాయాధికారులంతా సన్నద్ధంగా ఉండాలన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అంబేడ్కర్‌తో కలసి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. ఎరువులు పేద రైతులకే అందేలా చూడాలని, ఈ సీజన్‌లో వేసిన అన్ని పంటలకు సహాయం అందేలా అధికారులు చూడాలన్నారు.
భారత క్రీడాకారులు ఒలింపిక్స్‌లో ఘన విజయాలు సాధించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకాంక్షించారు. శనివారం ‘ఐ చీర్ ఫర్ భారత్’ నినాదంతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద మంత్రి సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా భారత క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధన్నానపేటలో ఆక్రమణను తొలగించినట్లు నెల్లిమర్ల తహశీల్దార్ ధర్మరాజు స్పష్టం చేశారు. రోడ్డును ఆక్రమించి నిర్మించిన ప్రహరీగోడను, ప్రజా ప్రయోజనాల కోసమే తొలగించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆక్రమణ దారునికి ముందుగా నోటీసులు కూడా ఇచ్చామని, తగిన గడువు ఇచ్చిన తరువాత, అతని నుంచి స్పందన రాకపోవడంతో తొలగించినట్లు తహశీల్దార్ తెలిపారు.
మంత్రి కొండపల్లి శ్రీనివస్ ఆదివారం నాడు జిల్లాలో అందుబాటులో ఉంటారని అధికారులు తెలియజేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌లో మంత్రి అందుబాటులో ఉంటారని చెప్పారు. ఉదయం 10.15 నుంచి జిల్లా పార్టీ కార్యాలయం (అశోక్ బంగ్లా)లో అందుబాటులో ఉంటారని తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమైన నేపథ్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద ఒలింపిక్ సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. దీనిని కలెక్టర్ అంబేడ్కర్ ప్రారంభించి, జేసీ కార్తీక్‌తో కలిసి సెల్ఫీ దిగారు. ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు అధిక సంఖ్యలో పతకాలు సాధించాలని ఆకాక్షించారు. క్రీడాభిమానులు, యువత కూడా సెల్ఫీ దిగి ఇండియా అథ్లెట్స్‌కు శుభాకాంక్షలు తెలిపాలని కోరారు.
ఈ నెల 28 నుంచి ఆగష్టు 2వ తేదీ వరకు జరగనున్న శాఖాపరమైన పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DRO ఎస్.డి. అనిత తెలిపారు. గాజులరేగలో ఉన్న సీతం కళాశాలలో, అయాన్ డిజిటల్ జోన్ కేంద్రాలుగా ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 10గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు రెండు పూటలా పరీక్షలు జరుగుతాయని తెలిపారు. DRO ఛాంబర్‌లో ఏర్పాట్ల పై అధికారులతో సమీక్షించారు.
ఈనెల 30న పార్వతీపురం govt జూనియర్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా తెలిపారు. sbi లైఫ్ ఇన్సూరెన్స్‌లో సేల్స్ అధికారి, అడ్వైజర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 18 సం. పైబడిన పది, 12th, గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 80 ఖాళీలు ఉన్నాయని, www.ncs.gov.in వెబ్‌సైట్‌లోని job seeker లాగిన్‌లో నమోదుచేసుకొని బయోడేటా, 2 పాస్ ఫోటోలతో హాజరుకావాలన్నారు.
Sorry, no posts matched your criteria.