India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సామాజిక మాధ్యమాల్లో పరిచయం చేసుకొని అమ్మాయిల ఫొటోలు ఎరగా చూపి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న హైదరాబాద్ వాసి కె.లోకేశ్‌ను అరెస్టు చేసినట్లు విశాఖ సైబర్ క్రైమ్ సీఐ భవాని ప్రసాద్ తెలిపారు. ఆ వ్యక్తి మాయలో నగరానికి చెందిన ఓ వ్యక్తి రూ. 28 లక్షలు పోగొట్టుకున్నాడని, అతడి ఫిర్యాదుతో నిందితుడిని పట్టుకున్నామన్నారు. కేసులో సంబంధం ఉన్న మరి కొంతమంది పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.
టమాటా ధరలు బహిరంగ మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయి. దీంతో వాటిని రైతు బజార్లలో ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ క్రమంలో విజయనగరంలోని 3రైతు బజార్లలో శనివారం నుంచి కిలో రూ.34కే విక్రయించనున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా అధికారులు కోరారు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద రాయితీతో ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుని విద్యుత్ బిల్లు తగ్గించుకోవచ్చని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. రాయితీపై అందిస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం గృహ వినియోగదారులకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గించుకునేందుకు చక్కని అవకాశం అన్నారు.
రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 నుంచి 10 గంటలు వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటలు వరకు జిల్లా పరిషత్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారని జిల్లా అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గజపతినగరం కార్యాలయంలో అందుబాటులో ఉంటారన్నారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.30 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు కలెక్టర్ డా. బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ మేరకు పురుషులకు 10, మహిళలకు 10 వంతున 20 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎం.డి. ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఉచిత ఇసుక పంపిణీ పధకం అమలు పై భూగర్భ గనుల శాఖ కమీషనర్ ప్రవీణ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ఇసుకను లబ్దిదారులకు ఉచితంగా అందిస్తున్నాదన్నారు. ఈ కాన్ఫిరెన్స్‌లో కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, జేసీ శోభిక పాల్గొన్నారు.
విశాఖ జిల్లా మారికవలస ప్రాంతానికి చెందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం దత్తిరాజేరు మం. మరడాం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎస్.బూర్జివలస ఎస్.ఐ ప్రసన్న కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. లొడగల పైడినాయుడు బొలెరోను అతివేగంగా నడపడంతో పొలాల్లోకి దూసుకెళ్లిందన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందినట్లు తెలిపారు. శివకుమార్ అనే వ్యక్తికి గాయాలయ్యాయని, దీనిపై కేసు నమోదు చేశామన్నారు.
విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే తల్లి పైడితల్లమ్మ చదురుగుడిలో శుక్రవారం వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలతో శాఖాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో.. వేకువ జాము నుంచి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
సెర్ప్ (వెలుగు) డిపార్ట్మెంట్లో పని చేస్తున్న ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర జెఏసి నాయకులు అమరావతిలో మంత్రిని గురువారం కలిశారు. గత ప్రభుత్వం హయాంలో స్ట్రైక్‌లో పాల్గొన్న సమయంలో జీతాలు ఇప్పించాలని కోరారు. పెండింగ్ ఇంక్రిమెంట్లు చెల్లించాలని, మండల సమాఖ్య సీసీలకు జీతాలు పెంచాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రంలో ఈ సంవత్సరం బీఈడి, MBA హాస్పిటల్ మేనేజ్మెంట్, బీకాం కంప్యూటర్ సైన్స్, BBA, ఎం.ఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు ఇన్ఛార్జ్ వీసీ ఆచార్య జి.శశిభూషణరావు తెలిపారు. దూరవిద్యలో 75 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారని వీరి సంఖ్యను లక్షకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.