India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత ఎన్నికల కమీషన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా ప్రమోద్ కుమార్, పార్లమెంటరీ నియోజకవర్గ పోలీస్ పరిశీలకులు నయీం ముస్తఫా మన్సూరి, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టిన ఎన్నికల ఏర్పాట్లను, పర్యవేక్షణను వివరించారు.
ఈ నెల 11వ తేదీ నాటికే పోలింగ్ కేంద్రాలను అన్ని వసతులతో సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. తాగునీరు, విద్యుత్, ర్యాంపులు, మరుగుదొడ్లు, నేమ్ బోర్డులతో సిద్ధంగా ఉంచాలని చెప్పారు. తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర ఎన్నికల అధికారులతో శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
చీపురుపల్లి ఎన్నికల రోడ్‌షోలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తండ్రి పేరు చెప్పుకొని బ్రతికే బాలకృష్ణ తమ గురించి మాట్లాడటమేంటని ప్రశ్నించారు. గడిచిన ఐదేళ్లలో విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని, తెలుసుకోవాలని హితవు పలికారు. పింఛన్లు ఆపేసిన పాపం ఊరికే పోదన్నారు.
జమీందారీ వ్యవస్థలు ఉన్నప్పుడు 1937 ఫిబ్రవరి 9న తొలిసారి విజయనగరం గ్రామ సంస్థానానికి ఎన్నిక నిర్వహించారు. విజయనగరం సంస్థానాదీశులు మీర్జా రాజా పూసపాటి అలకనారాయణ గజపతి మహారాజు నీలిరంగు పెట్టె గుర్తుతో బరిలో దిగారు. అప్పట్లో ఆయన్ను గెలిపించాలని కోరుతూ విజయనగరం సంస్థాన మార్‌గుజారీమాన్యమ్ ఇనాందార్లు కట్టోజు పెద్దగంగరాజు, జి.వీర్రాజునాయుడు పంచిన కరపత్రాన్ని మనం పై ఫొటోలో చూడొచ్చు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల6న నారా లోకేశ్ విజయనగరం రానున్నారు. ఆరోజు జరిగే యువగళం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని టీడీపీ నాయకులు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు నగరానికి చేరుకొని సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటారు. ఇక్కడ సభ అనంతరం శ్రీకాకుళం వెళ్లనున్నారు. ఇప్పటికే ఈనియోజకవర్గంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ ప్రచారం చేశారు.
కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్వతీపురంలో గురువారం పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థి కొత్తపల్లి గీతతో కలిసి చినబొండపల్లిలో జరిగన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మన్యం జిల్లాలో ఏనుగుల బెడద తప్పిస్తామని హామీ ఇచ్చారు. అరకు పార్లమెంట్ పరిధిలో రోడ్లు, నీళ్లు, విద్యుత్తు, కమ్యూనికేషన్ మొదలగు వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
నకిలీ డబ్బు, బంగారంతో మోసగిస్తున్న ముఠాను మధురవాడ పోలీసులు రెస్టు చేశారు. పట్టుబడ్డ నిందితుల్లో హేమచంద్రరావు, హరి శ్రీను, హేమంత్ కుమార్, ఎం.సుబ్బారెడ్డి, డి.శ్రీనివాస్, జన్న సునీల్ ఉన్నారు. వారి వద్ద నుంచి నకిలీ రూ.500 నోట్లు, బంగారం బిస్కెట్లు, నాణేలు, 23 చరవాణులు, ల్యాప్ టాప్, రూ.1000, వివిధ మారణాయుధాలు, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విజయనగరం నుంచి విశాఖ వెళ్తుండగా పట్టుబడ్డారు.
సాధారణ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు నియమించిన సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల) శిక్షణ ర్యాండమైజేషన్ గురువారం పూర్తి చేసారు. కలెక్టరేట్‌లో పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు ప్రమోద్ కుమార్ మెహార్థ సమక్షంలో, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూక్ష్మ పరిశీలకుల శిక్షణ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.
విజయనగరం పట్టణంలో కొత్తపేట వాటర్ ట్యాంక్ జంక్షన్ నుంచి గంటస్తంభం కూడలి వరకు నిర్వహించిన రోడ్ షోలో బాలకృష్ణ పాల్గొన్నారు. అనంతరం గంటస్తంభం జంక్షన్‌లో ఏర్పాటు చేసిన సభలో టీడీపీ మేనిఫెస్టోను సూపర్ సిక్స్ పధకాలను ప్రజలకు తెలియజేశారు. విజయనగరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థి పూసపాటి అధితి గజపతిరాజును పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడును గెలిపించాలని కోరారు.
విజయనగరం జిల్లాలో ఈనెల 13న జరిగే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పోలింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి పీఓలు, ఏపీఓల రెండో విడత శిక్షణ కార్యక్రమాలు జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం చేపట్టారు.
Sorry, no posts matched your criteria.