Vizianagaram

News September 4, 2024

పార్వతీపురం మన్యం జిల్లాలో 71 మందికి పురస్కారాలు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో 71 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జీ.పగడాలమ్మ తెలిపారు. 10 మంది ప్రధాన ఉపాధ్యాయులు, 21 మంది స్కూల్ అసిస్టెంట్లు, 7గురు పీడీలను, 33 మంది సెకండ్ గ్రేడ్ టీచర్లను జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశామన్నారు. వీరందరికీ కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు అందిస్తున్నట్లు తెలిపారు.

News September 4, 2024

విజయనగరం జిల్లాలో 75 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

image

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక అయిన ఉపాధ్యాయులకు అవార్డులు బహుకరించబడుతున్నాయని డి.ఈ.ఒ. ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. ఎంపికైన 75 మంది ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సహాయకులు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు గురువారం ఉ.9గంటలకు విజయనగరం జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో అవార్డు బహుకరణకు హాజరు కావాలని సూచించారు.

News September 4, 2024

రూ.10 లక్షల విరాళమిచ్చిన విజయనగరం జిల్లా సమాఖ్య

image

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ జిల్లా సమాఖ్య ముందుకు వచ్చింది. కలెక్టర్ అంబేడ్క‌ర్ పిలుపు మేరకు వరద బాధితుల సహాయార్థం జిల్లా స్వయం శక్తి మహిళల తరఫున రూ.10 లక్షల సీఎం సహాయనిధికి అందజేయాలని నిర్ణయించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ద్వారా బుధవారం విజయవాడలో సమాఖ్య ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందజేశారు.

News September 4, 2024

రద్దు చేసిన దూర ప్రాంత ఆర్టీసీ సర్వీసుల పునరుద్ధరణ

image

భారీ వర్షాల కారణంగా రద్దు చేసిన దూర ప్రాంతాల సర్వీసులన్నింటినీ ఆర్టీసీ విశాఖ రీజియన్‌ అధికారులు పునరుద్ధరించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడం, రోడ్ల మీద వరద ప్రవాహం తగ్గడంతో విజయవాడ, గుంటూరు జిల్లాలకు వెళ్లాల్సిన 14 బస్సులు, విజయవాడ, ఆపై ప్రాంతాల నుంచి విశాఖ రావలసిన ఆరు బస్సులను పునరుద్ధరించారు. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లాల్సిన బస్సును మాచర్ల మీదుగా నడుపుతున్నారు.

News September 4, 2024

పార్వతీపురం మన్యం జిల్లాలో ఇద్దరు ఆత్మహత్యాయత్నం

image

పార్వతీపురం జిల్లాలో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. సీతానగరం మండలానికి చెందిన ఓ మహిళ భర్త వదిలేశాడని మనస్తాపంతో ఇంట్లో ఉన్న చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జియ్యమ్మవలస మండలానికి చెందిన మరో మహిళ ఇతర కారణాలవల్ల గాజు పెంకులు మింగింది. ఇద్దరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 4, 2024

నేడు సికింద్రాబాద్‌కు వన్ వే స్పెషల్

image

వరదలు కారణంగా ఆయా స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు వన్ వే ఏపీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నడుపుతున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. విశాఖ-సికింద్రాబాద్ వన్ వే ఏపీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ బుధవారం రాత్రి 7.50 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు.

News September 4, 2024

జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయిలో సందర్శించిన పోలీసులు

image

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు తమ స్టేషను పరిధిలోని గ్రామాలను, వార్డులను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాలు, మహిళల రక్షణ, రహదారి భద్రత, నూతన చట్టాలు గురించి తెలిపారు. అదేవిధంగా గణేశ్ ఉత్సవాల నిర్వహణలో పాటించాల్సిన నియమ, నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు.

News September 3, 2024

VZM: ‘5 నుంచి జిల్లాలో భారీ వ‌ర్షాలు’

image

ఈ నెల 5 నుంచి 7వ తేదీవ‌ర‌కు జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని, అలాగే బంగాళాఖాతంలో మ‌రో అల్ప‌పీడ‌నం కూడా ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ తెలిపారు. అధికారులతో మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా యంత్రాంగమంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. మడ్డువలస రిజర్వాయర్‌లో ఇన్‌ఫ్లో ఇప్ప‌టికే ఎక్కువ‌గా ఉంద‌ని ఇప్ప‌టినుంచే అప్రమత్తంగా ఉండాలన్నారు.

News September 3, 2024

మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు..!

image

తీవ్ర కడుపునొప్పితో ఆగస్టు 28న ఓ మహిళ విశాఖ కేజీహెచ్‌లో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపులో 24 వారాల శిశువు ఎముకల గూడు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి వాటిని తొలగించారు. ఆమె 3 ఏళ్ల క్రితం గర్భం దాల్చగా.. అబార్షన్‌కు మందులు వాడారని అప్పటి నుంచి నొప్పితో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు ఇప్పటివరకు 25లోపే నమోదైనట్లు వైద్యులు తెలిపారు.

News September 3, 2024

గురజాడ గ్రంథాలయంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి: డీవైఎఫ్ఐ

image

విజయనగరం గురజాడ గ్రంధాలయంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలంటూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం గ్రంథాలయ ప్రతినిధి బీ.లక్ష్మీకి వినతి పత్రం ఇచ్చారు. డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ మాట్లాడుతూ.. జిల్లా ప్రధాన గ్రంథాలయానికి సుమారు 400 మంది విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారని, వసతులు, మరుగుదొడ్లు లేవన్నారు. భవనాలు పెచ్చులు ఊడిపోతున్నాయని చెప్పారు. పరిసరాలు క్లీన్‌గా లేవన్నారు.