India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా పలు నియోజకవర్గాలకు టీడీపీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను పార్టీ అధిష్టానం నియమించింది. విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార బాధ్యతలను చూసుకుంటూ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో, విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార భాద్యతలను టీడీపీ అధినాయకత్వం అప్పగించింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం జగన్ బొబ్బిలిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మొదట బొబ్బిలి మొయిన్ రోడ్డులో సభ పెట్టేందుకు సన్నాహాలు చేయగా.. బొబ్బిలి కోట ఉత్తర ద్వారం ఎదురుగా సభ పెట్టేందుకు మంగళవారం సాయంత్రం నిర్ణయం తీసుకున్నారు. కూటమి అభ్యర్థి బేబినాయన ఇంటికి సమీపంలో సభ నిర్వహించడంపట్ల అవాంఛనీయ ఘటనలు జరగకుండా రక్షణ కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది గంట శర్మ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి బొబ్బిలిలో జరిగే సభలో ఈరోజు పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు బొబ్బిలి మొయిన్ రోడ్డు సెంటర్లో జరిగే ప్రచార సభలో ప్రసంగించనున్నారు. ఈమేరకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. బొబ్బిలి సభ అనంతరం ఆయన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట బయలుదేరి వెళ్తారు.
సాధారణ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. మంగళవారం పార్వతీపురంలో మన్యం జిల్లా డీఎస్పీ, సీఐ, ఎస్సైలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యాత్మక గ్రామాలు, వ్యక్తులపై నిరంతర నిఘా ఉండాలని, ఎన్నికల నిబంధనలు ప్రకారం పని చేయాలన్నారు. అనంతరం మార్చి నెల సంబంధించిన నేర సమీక్ష చేపట్టారు.
మక్కువ మండలంలోని పెద్ద ఊటగడ్డ గ్రామంలో సాలూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి మంగళవారం మధ్యాహ్నం ప్రచారం చేశారు. ఎండ ఎక్కువగా ఉండటంతో వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన పార్టీ శ్రేణులు అర్ధాంతరంగా ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశారు. అనంతరం సంధ్యారాణిని సాలూరుకు తరలించారు.
ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఎంతమంది పోటీలో ఉంటారన్నది లెక్క తేలింది. నామినేషన్ల తిరస్కరణ, ఉపసంహరణ అనంతరం మొత్తంగా 99 మంది బరిలో ఉన్నారు. అయితే అత్యధికంగా విజయనగరం నియోజకవర్గంలో 15 మంది పోటీచేస్తుండగా..అత్యల్పంగా చీపురుపల్లి, కురుపాం, సాలూరులో 7గురు చొప్పున బరిలో ఉన్నారు. ఎస్.కోట-12, నెల్లిమర్ల-12, గజపతినగరం-13, బొబ్బిలి-8, పార్వతీపురం-8 మంది చొప్పున పోటీ చేస్తున్నారు.
మాజీ MLA మీసాల గీతను TDP అధిష్ఠానం సస్పెండ్ చేసింది. విజయనగరం MLA సీటు ఆశించి భంగపడ్డ గీత ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంది. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసినప్పటికీ ఆమె ఉపసంహరించుకోకపోవడంతో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
విజయనగరం జిల్లాలో జరగనున్న సాధారణ ఎన్నికల విధుల్లో భాగంగా కొత్తగా ఓ.పి.ఓలుగా నియమితులైన వారు మే 1వ తేదీలోగా తమ ప్రాంత తహశీల్దారుకు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.నాగలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోని ఓపిఓలు ఫారం-12 లో దరఖాస్తులు అందజేయాల్సి వుంటుందన్నారు.
మెంటాడ మండలం ఆండ్రలో సోమవారం చంపావతి బ్రిడ్జిని ఆనుకొని ఉన్న ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన పసికందును పడేసినట్లు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. దర్యాప్తు చేసి పూర్తి సమాచారం వెల్లడిస్తామని ఆండ్ర సబ్ ఇన్‌స్పెక్టర్ బొడ్డు దేవి చెప్పారు. తదుపరి శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.
నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. విజయనగరం పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 77 మంది పోటీలో ఉన్నారు. VZM అసెంబ్లీ స్థానంలో 15 మంది అభ్యర్థులు, ఎస్.కోటలో 12, నెల్లిమర్లలో 12, గజపతినగరంలో 13, చీపురుపల్లిలో 7, రాజాంలో 10, బొబ్బిలిలో 8 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 7 అసెంబ్లీ స్థానాల నుంచి 7 అభ్యర్థులు తప్పుకున్నారు.
Sorry, no posts matched your criteria.