Vizianagaram

News July 27, 2024

నేడు మంత్రి కొండపల్లి జిల్లా పర్యటన

image

రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 నుంచి 10 గంటలు వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటలు వరకు జిల్లా పరిషత్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారని జిల్లా అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గజపతినగరం కార్యాలయంలో అందుబాటులో ఉంటారన్నారు.

News July 27, 2024

VZM: సామాజిక మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు

image

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.30 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు కలెక్టర్ డా. బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ మేరకు పురుషులకు 10, మహిళలకు 10 వంతున 20 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎం.డి. ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

News July 27, 2024

పార్వతీపురం: ‘ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు’

image

ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఉచిత ఇసుక పంపిణీ పధకం అమలు పై భూగర్భ గనుల శాఖ కమీషనర్ ప్రవీణ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ఇసుకను లబ్దిదారులకు ఉచితంగా అందిస్తున్నాదన్నారు. ఈ కాన్ఫిరెన్స్‌లో కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, జేసీ శోభిక పాల్గొన్నారు.

News July 26, 2024

మరాడంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

image

విశాఖ జిల్లా మారికవలస ప్రాంతానికి చెందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం దత్తిరాజేరు మం. మరడాం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎస్.బూర్జివలస ఎస్.ఐ ప్రసన్న కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. లొడగల పైడినాయుడు బొలెరోను అతివేగంగా నడపడంతో పొలాల్లోకి దూసుకెళ్లిందన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందినట్లు తెలిపారు. శివకుమార్ అనే వ్యక్తికి గాయాలయ్యాయని, దీనిపై కేసు నమోదు చేశామన్నారు.

News July 26, 2024

శాఖాంబరి అలంకరణలో పైడితల్లమ్మ

image

విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే తల్లి పైడితల్లమ్మ చదురుగుడిలో శుక్రవారం వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలతో శాఖాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో.. వేకువ జాము నుంచి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

News July 26, 2024

వెలుగు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి

image

సెర్ప్ (వెలుగు) డిపార్ట్మెంట్లో పని చేస్తున్న ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర జెఏసి నాయకులు అమరావతిలో మంత్రిని గురువారం కలిశారు. గత ప్రభుత్వం హయాంలో స్ట్రైక్‌లో పాల్గొన్న సమయంలో జీతాలు ఇప్పించాలని కోరారు. పెండింగ్ ఇంక్రిమెంట్లు చెల్లించాలని, మండల సమాఖ్య సీసీలకు జీతాలు పెంచాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

News July 26, 2024

ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో కొత్త కోర్సులు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రంలో ఈ సంవత్సరం బీఈడి, MBA హాస్పిటల్ మేనేజ్మెంట్, బీకాం కంప్యూటర్ సైన్స్, BBA, ఎం.ఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ వీసీ ఆచార్య జి.శశిభూషణరావు తెలిపారు. దూరవిద్యలో 75 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారని వీరి సంఖ్యను లక్షకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

News July 26, 2024

జొన్నాడ టోల్ గేటు తరలించాలని కేంద్రమంత్రికి లేఖ

image

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం లేఖ రాశారు. జొన్నాడ సమీపంలోని ఏర్పాటు చేసిన టోల్ గేట్‌ను కొత్తగా నిర్మించిన విజయనగరం బైపాస్ రహదారిలోకి తరలించాలని ఎంపీ ఆ లేఖలో పేర్కొన్నారు. జొన్నాడ టోల్ గేట్ వలన వాహన డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని, పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

News July 26, 2024

కురుపాం: మనుమడు మృతిని.. తట్టుకోలేక

image

చిన్నతనంలోనే మనుమడు మృతిని జీర్ణించుకోలేని తాత(హిజ్రా) ఆత్మహత్య చేసుకున్న ఘటన కురుపాం మండలంలోని తిత్తిరి పంచాయతీలో చోటు చేసుకుంది. కీడవాయికి చెందిన బిడ్డిక పృథ్వి ఇటీవల జ్వరంతో మృతి చెందాడు. పృథ్వి మృతిని తట్టుకోలేక తాత బిడ్డిక పాపన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. గమనించిన కుటుంబ సభ్యులు భద్రగిరి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు.

News July 25, 2024

VZM: ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలోని 26 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.పద్మ లీల తెలిపారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీకి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం http://vizianagaram.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.