India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పోస్టుల భర్తీ కోసం గతంలో జారీ చేసిన 1/23 నోటిఫికేషన్‌ను రద్దు చేసి, ఆ స్థానంలో అదనపు పోస్టులు జోడించి మళ్లీ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.పద్మలీల తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో 13, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 69 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
నెల్లిమర్ల EVM గోడౌన్‌లో ఉన్న పని చేయని, అదనంగా ఉన్న, ఎన్నికలలో డెమో కు వినియోగించిన డమ్మీలను బెంగళూరుకి తరలిస్తున్నారు. బెల్ కంపెనీకి రెండు వాహనాల్లో కలెక్టర్ డా. బీఆర్.అంబేడ్కర్ ఆధ్వర్యంలో గురువారం పంపించారు. ఎన్నికలలో వినియోగించని (డిఫెక్ట్ ) EVMలలో బీయూలు 174, సీయూలు 930, వివిపాట్‌లు 224 యూనిట్లను బెల్‌కు పంపించారు.
ఫెడెక్స్, బ్లూడాట్ కొరియర్స్ పేర్లతో వచ్చే కాల్స్, లింక్స్, వీడియో కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ తరహా కాల్స్, లింక్స్, వీడియోకాల్స్‌తో సైబర్ మోసగాళ్లు ప్రజలకు ఉచ్చు వేస్తూ, వారి నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారన్నారు. ఎవరైనా నగదు పోగొట్టుకుంటే సైబర్ క్రైమ్ పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలని సూచించారు.
గత ప్రభుత్వంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. దీంట్లో మొత్తం 54 మంది ఆనాటి ప్రతిపక్ష నేతలు ఉన్నారు. వీరిలో మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పేరు కూడా ఉంది. ఈయన పై రెండు కేసులు నమోదైనట్లు సీఎం వెల్లడించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 27న జరగాల్సిన ఎంఎస్సీ రెండో సెమిస్టర్ పరీక్షను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసినట్లు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ టీ.చిట్టిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న యూజీసీ నెట్ ప్రవేశ పరీక్ష ఉన్న కారణంగా ఈ పరీక్షను వాయిదా వేశామని తెలిపారు. మిగిలిన తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. ఆ తేదిల్లో ఎలాంటి మార్పు చేయలేదని సూచించారు.
కొత్తవలస మండలంలోని రెల్లిలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రెల్లి రెవెన్యూ పరిధిలోని అప్పన్న దొరపాలెంలో వర్సిటీ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని కేటాయించి శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దత్తిరాజేరు మండలంలోని కుంటినవలసుకు మార్పు చేసింది.
కుక్కకరిస్తే వేసే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అన్ని పీహెచ్సీలలో ఉన్నా.. పిచ్చికుక్కలు కరిస్తే వేయాల్సిన హ్యూమన్ రేబిస్ వ్యాక్సిన్ కేజీహెచ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ముప్పని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాగా.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు వైద్యులను 8,339 మంది సంప్రదించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో 70 వేలకు పైగానే కుక్కకాటు కేసులు నమోదయ్యాయి.
తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం నిలకడగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 105 మీటర్లు కాగా.. 104.10 మీటర్ల వరకు నీరు నిల్వ ఉందన్నారు. ప్రస్తుతం రెండు గేట్లు ఎత్తి 2,139 క్యూసెక్కుల నీటిని కిందకి విడిచిపెడుతున్నట్లు వెల్లడించారు. రెండు కాల్వల ద్వారా 210 క్యూసెక్కుల సాగునీటిని పంట పొలాలకు అందిస్తున్నామని తెలిపారు.
జిల్లాలోని ఐదు అన్న క్యాంటీన్ల మరమ్మతులకు రూ.కోటి నిధులు కేటాయించినట్లు ప్రజారోగ్యశాఖ ఈఈ దక్షిణామూర్తి తెలిపారు. బొబ్బిలిలోని భవనాన్ని బుధవారం పరిశీలించి మాట్లాడారు. బొబ్బిలి, రాజాం, నెల్లిమర్లతో పాటు జిల్లా కేంద్రంలో మూడు క్యాంటీన్లు ఉన్నట్లు చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నాటికి జిల్లా కేంద్రంలో రెండు, బొబ్బిలిలో క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వీటి పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజును ఉమ్మడి విజయనగరం జిల్లా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బుధవారం అమరావతిలో కలసి పలు సమస్యలు, ఇతర అంశాలు చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చెయ్యాలని అశోక గజపతి రాజు మంత్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అతిది గజపతి పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.