India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సంక్షేమ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది తమ సమస్యలను ఎస్పీ వకుల్ జిందాల్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఎస్పీ పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పోలీస్ సిబ్బంది తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని స్పష్టం చేశారు.

అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి గజపతినగరం MLAగా గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ చంద్రబాబు క్యాబినేట్‌లో MSME., సెర్ప్, NRI సాధికారత, సంబంధాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే 25 మంది మంత్రుల పనితీరుపై ర్యాంకులు కేటాయించగా కొండపల్లి మూడో ర్యాంకు సాధించారు. ఉత్తరాంధ్రలో సీనియర్లు అయిన అచ్చెన్నకు 17, అనితకు 20, సంధ్యారాణికి 19 ర్యాంక్ ఇచ్చారు. మరి కొండపల్లి పనితీరుకు మీరెచ్చే ర్యాంకు ఎంత?

విజయనగరం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మార్చి 8 వరకు జిల్లాలో కోడ్ అమల్లో ఉంటుందని, పక్కాగా అమలయ్యేలా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నేతల ఫొటోలు ఉండరాదన్నారు. ముఖ్యంగా బెల్టు షాపులు లేకుండా చూడాలని, విస్తృతంగా దాడులు నిర్వహించాలని ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారిణి జీవన రాణి సూచించారు. వైద్య శాఖ కార్యాలయంలో జిల్లాలో పీహెచ్సీ, సీహెచ్సీ వైద్యులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మాతృ సేవలు, జేఎస్ వై, పీఎం మాతృ సురక్ష అభియాన్, తదితర కార్యక్రమాలపై చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే శత శాతం ప్రసవాలు అయ్యేలా చూడాలని సిబ్బందికి సూచించారు.

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మూడో ర్యాంకు పొందారు.

విజయనగరం జిల్లాలో గుర్ల మండలంలో తప్ప జిల్లా అంతటా ఈ నెల 10న డీ వార్మింగ్ డే సందర్భంగా అల్బెండజోల్ మాత్రలను సరఫరా చేయనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష జరిపారు. గుర్ల మండలంలో బోదకాలుకు సంబంధించిన మాత్రలు వేస్తున్నందున నులిపురుగుల నివారణా మాత్రలు ప్రస్తుతం వేయడం లేదని తెలిపారు. 19 ఏళ్లలోపు ఉన్న వాళ్లంతా అల్పెండజోల్ మాత్రలు వేసుకోవాన్నారు.

వెయిట్ లిఫ్టింగ్‌కు పుట్టినిల్లు కొండవెలగాడ తన పేరును సార్థకం చేసుకుంది. వల్లూరి శ్రీనివాసరావు, మత్స సంతోషి లాంటి సీనియర్ లిఫ్టర్లు ఈ గ్రామం నుంచే వెళ్లి కామన్ వెల్త్‌లో ఛాంపియన్స్‌గా నిలిచి దేశ ఖ్యాతిని ఖండాంతరాల్లో నిలిపారు. వాళ్లని ఆదర్శంగా తీసుకొని పదుల సంఖ్యలో క్రీడాకారులు గ్రామం నుంచి పుట్టుకొచ్చారు. తాజాగా జాతీయస్థాయిలో జరిగిన పోటీల్లో గ్రామానికి చెందిన శనపతి పల్లవి గోల్డ్ మెడల్ కొట్టింది.

గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి మంగళవారం ప్రసవానికొచ్చిన గర్భిణిని జిల్లా కేంద్రాసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనపై <<15363231>>Way2News<<>>లో ‘108లో మగబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి’ అని వార్త పబ్లిష్ అయ్యింది. ఈ వార్తపై DM&HO జీవరాణి స్పందించారు. ఆసుపత్రిలో బుధవారం విచారణ చేపట్టారు. ముగ్గురు గైనకాలజిస్టులు ఉండగా జిల్లా ఆస్పత్రికి ఎలా రిఫర్ చేస్తారని ప్రశ్నించారు. ఘటపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చీపురుపల్లి మండలంలో చోటుచేసుకుంది. రేగిడిపేటకు చెందిన దన్నాన శ్రీనువాసరావు (35) బుధవారం రాత్రి తన బైక్‌పై గరివిడి నుంచి చీపురుపల్లి వస్తున్నాడు. ఆంజనేయపురం సమీపంలోకి వచ్చేసరికి ట్రాక్టర్ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో శ్రీనివాసరావు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు మంగళవారం మూడు నామినేషన్లు దాఖలవగా.. బుధవారం ఒక్కటి కూడా కాలేదు. టీఎన్ఎప్ఎఫ్ మద్దతో పోటీలో ఉన్న సిటింగ్ MLC రఘువర్మ మొన్న నామినేషన్ వేశారు(ఈయనకు కూటమి మద్దతు ఇచ్చినట్లు సమాచారం). యూటీఎఫ్ ప్రజా సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్న విజయగౌరి నేడు విశాఖలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మాజీ MLC గాదె శ్రీనివాసులునాయుడుకు పీఆర్టీయూ మద్దతు తెలిపింది.
Sorry, no posts matched your criteria.