India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రానున్న మూడు రోజుల పాటు జిల్లాలో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారని, అలాగే విజయనగరం జిల్లాలో కూడా సెలవు ప్రకటించాలని కోరుతున్నారు.
జిల్లాలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందని కలెక్టర్ డా బి.ఆర్ అంబేడ్కర్ తెలిపారు. భారీ వర్ష సూచన దృష్ట్యా ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈదురు గాలులు బలంగా వీచే అవకాశం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద తలదాచుకోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం నిర్వహించారు. ప్రజల నుంచి 29 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి, వారి సమస్యలను విని సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 15న ప్రారంభించేందుకు విజయనగరం జిల్లాలో 3 అన్నా క్యాంటీన్లను సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. విజయనగరం, బొబ్బిలి, రాజాం, నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్లతో తన ఛాంబర్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. ముందుగా మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యాధుల వ్యాప్తిపై సమీక్ష నిర్వహించారు.
గంజాయి అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన వ్యక్తులతోపాటు, అక్రమ రవాణకు కారకులైన ప్రధాన సూత్రధారుల మూలాలలను వెలికితీస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు ఎవరూ పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు. నిందితులనువిచారించి,సమాచారం సేకరించడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గంజాయి అక్రమ రవాణాకు ప్రధాన సూత్రదారులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారు.
వర్షాకాలంలో విద్యుత్తు ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని ఈపీడీసీఎల్ ఎస్.ఈ ఎం.లక్ష్మణరావు సూచించారు. ఉమ్మడి జిల్లాలో 6 కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సమస్యలపై 1912 టోల్ ఫ్రీ నంబరుతో పాటు విజయనగరం సర్కిల్‌లో 94906 10102, టౌన్‌లో 63005 49126, రూరల్‌లో 94409 07289, బొబ్బిలిలో 94906 10122, పార్వతీపురంలో 83320 46778 నంబర్లను సంప్రదించాలన్నారు.
విజయనగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న ప్రవీణ్ కుమార్ ఖాతాదారులు చెల్లించిన సొమ్మును బ్యాంక్‌లో జమ చేయకుండా సొంత అవసరాలకు వాడేసుకున్నారు. హోమ్ లోన్లు తీసుకున్న ఖాతాదారులు చెల్లించిన డబ్బులు సుమారు రూ.34 లక్షలు వాడేసుకున్నారు. ఇది గుర్తించిన బ్యాంక్ యాజమాన్యం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రవీణ్ కుమార్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని S.I హరిబాబు తెలిపారు.
గంజాయి విక్రయిస్తే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ఆశ పడ్డారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు విశాఖపట్నానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు గంజాయి విక్రయించడానికి ఎస్.కోట-విశాఖ రహదారిలో బైక్‌పై తీసుకువెళ్తుండగా కొత్తవలస పోలీసులకు చిక్కారు. వారితో పాటు గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసారు. 3.42 కిలోల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నారు.
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని ఏడుగురు ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలో గళం వినిపించనుండగా.. వారిలో కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్.కోట నుంచి కోళ్ల, చీపురుపల్లి నుంచి కిమిడి వంటి సీనియర్లు ఉన్నారు. మరి మీ MLA అసెంబ్లీలో ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి.
కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో జలాశయాలు నిండుకుండాల్లా మారాయి. తోటపల్లి పూర్తి స్థాయి నీటిమట్టం 105 మీటర్లు కాగా.. ప్రస్తుతం 104 మీటర్ల వరకు నీరు చేరింది. వట్టిగెడ్డలో 121.62 M.కి 115.82మీ., పెద్దగెడ్డలో 213.80 M.కి 213.82 M., వెంగళరాయసాగర్‌లో 161మీ.కి 157.45మీ., జంఝావతిలో 124మీ.కి 122.56 M నీటిమట్టం ఉంది. దీంతో నదీ తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.