India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మొహర్రం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిందని జిల్లా విద్యా శాఖాధికారి ప్రేమ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. హిందువుల పండుగ తొలి ఏకాదశి, మొహర్రం రెండూ కలిసి రావడంతో సెలవును ప్రకటించిందన్నారు. స్పెషల్ క్లాసులు, స్టడీ హవర్స్ పేరిట పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మెంటాడ మండలం మీసాలపేట సమీపంలో రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధురాలు మరణించిందని స్థానికులు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆండ్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే విప్లవాత్మకమైన పరిపాలన అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సమీక్షలు చేస్తూ, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతున్నారని తెలిపారు.
కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావాల్సిన వినియోగదారులు టోల్ ఫ్రీ నంబరు 1912 కు ఫోన్ చేసి సర్వీసు పొందవచ్చని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి సర్కిళ్ల పరిధిలోని వినియోగదారులు కనెక్షన్‌లను ఈ నంబరుకి ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం మీసేవా కేంద్రాలు, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ జరుగుతుందన్నారు.
విజయనగరంలోని అలకానంద కాలనీలో ఓ రైల్వే ఉద్యోగి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం, రైల్వేలో టీఏగా పనిచేస్తున్న శంకర్రావు మధ్యానికి బానిస కావడంతో భార్య ఆదివారం రాత్రి మందలించింది. మనస్తాపానికి గురైన శంకర్రావు తన రూమ్‌లో ఉరివేసుకున్నాడు. సోమవారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
భోగాపురం మండలంలో అసైన్డ్ భూములపై సీఎం చంద్రబాబు స్పందించారు. వైసీపీ ప్రభుత్వం భూముల రీసర్వే పేరిట భూములను దోచుకున్నారని మండిపడ్డారు. మాజీ సీఎస్ జవహార్‌రెడ్డి భోగాపురం మండలంలోని అసైన్డ్ భూములను బినామీల పేర్లతో దోచుకున్నారు కదా అని పలువురు విలేకర్లు సీఎంను ప్రశ్నించారు. దీనికి స్పందించి ఉన్నత స్థాయిలో విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీనికి ప్రజల నుంచి మద్దుతు కోరుతున్నామని తెలిపారు.
ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్ధ్య వారోత్సవాలు విజయవంతం అవుతాయని పార్వతీపురం కలెక్టరు ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వారోత్సవాల ఏర్పాట్లు, సన్నద్ధతపై అధికారులతో సోమవారం కలెక్టరు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
పదో తరగతి అర్హతతో పోస్టల్‌లో BPM/ABPM ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. విజయనగరం డివిజన్‌లో 43, పార్వతీపురం డివిజన్‌లో 40 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. >Share It
గంట్యాడ మండలం పెనసాంకి చెందిన కడుపుట్ల రమణమ్మ గత నెల 28న పొలంలో పనులు చేస్తున్న సమయంలో పాముకాటుకు గురైంది. వైద్యం కోసం విజయనగరం ఆసుపత్రిలో చేరిందని, అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్ తరలించారని గంట్యాడ ఎస్సై సురేంద్ర నాయుడు తెలిపారు. ఆమె ఈరోజు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. ఆమె మేనల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవికి ఘన సత్కారం లభించింది. తాడేపల్లి జనసేన కార్యాలయంలో జనసేన ప్రజా ప్రతినిధుల సత్కార సభ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధకి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణెదల పవన్ కళ్యాణ్ దుశ్శాలువ కప్పి పుష్పగుచ్చం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికలలో ఘనవిజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలను పవన్ సత్కరించారు.
Sorry, no posts matched your criteria.