India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలలకు డీఈఓ పగడాలమ్మ సెలవు ప్రకటించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా పాఠశాలలకు శనివారం నాడు సెలవు ప్రకటించినట్లు ఆమె తెలిపారు. విద్యార్థులంతా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఆమె కోరారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి విద్యార్థులు తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని ఆమె కోరారు.
జిల్లాలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లోని వాగులు, గెడ్డలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో అన్ని మండలాల తహశీల్దార్, రెవెన్యూ డివిజన్‌లను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.బీ.ఆర్. అంబేడ్కర్ ఆదేశించారు. వాగులు, గెడ్డలు ప్రవాహం కొనసాగుతున్న ప్రదేశాల్లో ఎవరూ వాటిని దాటకుండా, ప్రమాదాలు జరగకుండా 24 గంటల పహారా ఏర్పాట్లు చేయాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా ఈ రోజు అన్నీ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోరారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
సింహాచలం గిరి ప్రదక్షిణకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 32 కిలో మీటర్ల మేర సాగే నడక మార్గంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ క్రింది నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
➣ సింహాచలం దేవస్థానం: 0891-2954944/9390501082
➣ జీవీఎంసీ కమాండ్ కంట్రోల్ సెంటర్:1800-42500009
➣ వాటర్ సప్లై&పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్: 0891-2869111
➣ విశాఖ పోలీస్: 9390105353/9330105355
>>> Share it
విజయనగరం జేఎన్‌టీయూ జీవీ ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా డి.రాజ్యలక్ష్మి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ, వివిధ విభాగాల డైరెక్టర్లు, కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపల్, బోధన, బోధనేతర సిబ్బంది పుష్పగుచ్ఛాలతో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అందరి సహాయ సహకారాలతో విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
పరవాడలో ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న తాపీ మేస్త్రీ అమరపు సురేశ్(32) మూడో ఫ్లోర్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడడంతో మృతి చెందాడు. ఈ ఘటన గురవారం సాయంత్రం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలానికి చెందిన సురేశ్ కుటుంబంతో కలిసి ఏడాదిన్నరగా పరవాడలో ఉంటున్నాడు. మృతుడు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతని భార్య ఫిర్యాదుతో పోలీసులు మృతదేహాన్ని అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
గరుగుబిల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గొట్టాపు శశిభూషణరావును విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఈయన ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. ఏయూలో సీయూసీ అధ్యాపకుడిగా 19 ఏళ్ల అనుభవం ఆయనకు ఉంది. 15 ఏళ్ల పాటు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, ఇస్రోలో పనిచేశారు. ఆయన ఉన్నత స్థాయికి వెళ్లడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సింహాచలం గిరి ప్రదక్షిణ పురస్కరించుకొని విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో రవాణా శాఖ ట్రాఫిక్ ఆంక్షలు జారీచేశారు. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే వాహనదారులకు విశాఖపట్నం సిటీ గుండా వెళ్లేందుకు అనుమతిలేదని తెలిపారు. ప్రత్యామ్నాయంగా లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం గుండా ప్రయాణించాని సూచించారు. అలానే శ్రీకాకుళం వైపు నుంచి అనకాపల్లి రావాలని తెలిపారు.
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన విద్యుత్ స్తంభాలను నేరుగా తాకరాదని విద్యుత్ శాఖ SE మువ్వల లక్ష్మణరావు సూచించారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా విద్యుత్ తీగలు మీద చెట్లు విరిగిపడిన, విద్యుత్ తీగలు తెగిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో విద్యుత్ పరికరాలను తడి చేతితో తాకవద్దన్నారు. విద్యుత్ ప్రమాదాలను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు గాని, 1912 టోల్ ఫ్రీ నంబరుకు తెలియజేయాలన్నారు.
ఏ.పి. కోస్టల్ మేనేజ్ మెంట్ జోన్ పై ఈనెల 19న ఉదయం 10-30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించనున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ సరిత తెలిపారు. కలెక్టర్ అంబేద్కర్ అధ్యక్షతన ఉదయం 10-30 గంటలకు కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో పబ్లిక్ హియరింగ్ జరుగుతుందని చెప్పారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 2019 చట్ట నిబంధనల మేరకు ఈ పబ్లిక్ హియరింగ్ జరుగుతుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.