India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లాలో ఆదివారం 6వ తరగతి మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను డిఈఓ పరిశీలించారు. జిల్లాలో 14 సెంటర్లలో 3,669మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 3,167 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 502 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ పేర్కొన్నారు.
క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసై అప్పులు పాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెంటాడ మండలంలో జరిగింది. పెద మేడపల్లి గ్రామానికి చెందిన కిల్లాడ ఈశ్వరరావు గతంలో రూ.4 లక్షలు వరకు బెట్టింగ్‌లో ఓడిపోయాడని, ఇటీవల మళ్ళీ రూ.లక్ష వరకు బకాయి పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు, వ్యసనాలకు బానిసై విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై దేవి తెలిపారు.
అనకాపల్లిలో శనివారం ఓ మహిళ మృతిచెందింది. మృతురాలి తండ్రి నూకరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి శారదా నగర్ ముత్రాసి కాలనీలో నివాసం ఉంటున్న APRJC లెక్చరర్ ఉమాదేవి(32), శనివారం అర్ధరాత్రి తన ఇంట్లో కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విజయనగరం జిల్లాలో లెక్చరర్‌గా ఈమె పనిచేస్తున్నారు. 2021లో వివాహమైన ఉమాదేవికి భర్తతో గొడవలు ఉన్నాయని ఆయన తెలిపారు.
మూడో రోజున శనివారం 9 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీర భద్ర స్వామి, యుగతులసి పార్టీ నుంచి ఒక నామినేషన్ వేశారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన కుమారుడు బొత్స సందీప్ వేశారు. నెల్లిమర్లలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. బొబ్బిలిలో కాంగ్రెస్ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. అరకు ఎంపీకి పి రంజిత్ కుమార్, కురుపాంలో స్వతంత్ర అభ్యర్థి వేశారు.
☞ అభ్యర్థి: కోలగట్ల వీరభద్రస్వామి
☞ నియోజకవర్గం: విజయనగరం
☞ పార్టీ: వైసీపీ
☞ చరాస్తులు: రూ.6.48
☞ కేసులు: 2
☞ బంగారం: 1KG
☞ స్థిరాస్తి: రూ.15.34
☞ అప్పులు: రూ.7.49 కోట్లు
☞ భార్య పేరిట చరాస్తులు: రూ.2.97 కోట్లు
☞ భార్య పేరిట స్థిరాస్తి: రూ.4.60 కోట్లు
☞ భార్య పేరిట బంగారం: 2KG
☞ కార్లు: లేవు
➠ కోలగట్ల వీరభద్రస్వామి శనివారం నామినేషన్ దాఖలు చేయగా, ఆఫిడవిట్లో ఈ వివరాలను వెల్లడించారు.
అక్రమంగా మద్యం విక్రయిస్తూ పలుమార్లు పట్టుబడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని తహశీల్దార్ హనుమంతురావు తెలిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎస్ఈబీ ఎస్సై ఆర్.రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో మండలంలోని పలుగ్రామాలకు చెందిన ఆరుగురిపై సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బైండోవర్ చేశారు. వీరంతా గతంలో పలుమార్లు మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డారని, వీరిపై నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు.
అరుకు ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత 22న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమానికి కూటమి నేతలు భారీగా వచ్చి విజయవంతం చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గీత తప్పకుండా విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ పొందేందుకు దరఖాస్తులను 22వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అందజేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లను పొందేందుకు అర్హత ఉన్నవారికి సంబంధిత దరఖాస్తు ఫారాలను అందజేయడం జరిగిందన్నారు. వాటిని పూర్తిగా నింపి సోమవారం సాయంత్రంలోగా సంబంధిత నియోజకవర్గ కేంద్ర తహశీల్దార్ కార్యాలయంలో అందజేయాలన్నారు.
గరివిడి మండలంలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. వెదుళ్లవలస గ్రామానికి చెందిన అప్పన్న(30) తాగుడుకు బానిసై నిత్యం భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో వేధింపులు భరించలేని భార్య దేవి, మామ సన్యాసిరావుతో కలిసి భర్తను ఉరి వేసి చంపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టు మార్టం నిమిత్తం బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విజయనగరం జిల్లాలో ఆదివారం జరగనున్న 6వ తరగతి మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ ప్రేమ్ కుమార్ శనివారం తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 14 సెంటర్లలో 3,669 మంది పరీక్షలు రాయనున్నారన్నారు. ఉదయం 10గం నుంచి 12 వరకు పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రనికి 30 నిమిషాల ముందే చేరుకోవాల్సి ఉందని తెలిపారు. https://cse.ap.gov.in/లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.