India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లాలోని సీడీపీవో విభాగంలో 23 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల అయింది. ఆ ఉద్యోగాలు ఇప్పిస్తామని రాజ్ కుమార్ అనే వ్యక్తి మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులను డబ్బులు అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఐసీడీఎస్ పీఓ బి.శాంత కుమారి తెలిపారు. అటువంటి వ్యక్తులను నమ్మవద్దని సూచించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
గుర్ల మండలం పున్నపురెడ్డిపేటకి చెందిన పున్నపురెడ్డి కనక నాయుడు అనే వ్యక్తి తేలు కాటుకు గురై మృతి చెందాడు. పొలంలో పని చేస్తుండగా తేలు కరిచిందని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు గంటల తరువాత చికిత్స పొందుతూ చనిపోయాడని గ్రామస్థులు తెలిపారు. ఇదిలా ఉంటే సంవత్సరం క్రితం అదే పొలంలో మృతుడి చిన్న కూతురు ఏదో విషపురుగు కరిచి చనిపోయింది. ఇప్పుడు మరొకరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఏయూ పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును జులై 25వ తేదీ వరకు పొడిగించారు. స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జులై 23 నుంచి 25 వరకు జరుగుతాయి. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్స్ నమోదు జులై 26 నుంచి 29 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్ మార్చుకోవడానికి జులై 30న అవకాశం ఇచ్చారు. ఆగష్టు 3న సీట్ల కేటాయింపు ఉంటుంది.
విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి బుధవారం బాధ్యతల స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా గోపీనాథ్ జెట్టిని విశాఖ రేంజ్ డీఐజీగా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన తొలిత సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి దర్శించుకుని అనంతరం లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. 2008 బ్యాచ్‌కు చెందిన జెట్టి గతంలో చింతపల్లి ఏఎస్పీగా విధులు నిర్వహించారు.
మక్కువ మండలం కన్నంపేటకి చెందిన ఆర్మీ జవాన్ తేలు దినేష్ (34) ఈనెల 12న సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వచ్చారు. మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురి కావటంతో చికిత్స కోసం విజయనగరం తీసుకొని వెళ్లారు. చికిత్స పొందుతూ రాత్రి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జవాన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విజయనగరం రైల్వే స్టేషన్‌లో ప్లాట్ ఫామ్ కింద పడి వ్యక్తి మృతి చెందాడు. పి.చంద్రపాత్రో అనే వ్యక్తి మూడో ప్లాట్ ఫామ్ వద్ద రైలు దిగుతుండగా కాలు జారి కింద పడ్డాడు. మృతుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన మల్కన్‌గిరి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని అధికారులు తెలిపారు. మృతదేహాన్ని మహారాజా సర్వజన ఆసుపత్రికి తరలించారు.
ధన్ బాద్-అలెప్పి బొకారో ఎక్స్‌ప్రెస్‌కు మంగళవారం పెద్ద ప్రమాదం తప్పింది. ఏ2 సెకండ్ ఏసీ భోగికి స్ప్రింగ్ విరిగిపోయింది. రైలు విశాఖ స్టేషన్‌కు చేరుకునే సమయంలో జరగడంతో ఆవరణలో ఉన్న రోలింగ్ సిబ్బంది దానిని గుర్తించి సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. ప్రయాణికులను ఖాళీ చేయించి రైలు నుంచి బోగిని తొలగించారు. వేరొక బోగిని దానికి అమర్చారు. గంటన్నర పాటు రైలు స్టేషన్‌లో నిలిచిపోయింది.
మొహర్రం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిందని జిల్లా విద్యా శాఖాధికారి ప్రేమ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. హిందువుల పండుగ తొలి ఏకాదశి, మొహర్రం రెండూ కలిసి రావడంతో సెలవును ప్రకటించిందన్నారు. స్పెషల్ క్లాసులు, స్టడీ హవర్స్ పేరిట పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మెంటాడ మండలం మీసాలపేట సమీపంలో రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధురాలు మరణించిందని స్థానికులు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆండ్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే విప్లవాత్మకమైన పరిపాలన అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సమీక్షలు చేస్తూ, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతున్నారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.