India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హెల్త్ మినిస్టర్ సత్య కుమార్ యాదవ్ పార్వతీపురం మన్యం జిల్లాలో రేపు పర్యటించనున్నారు. ఉదయం 9:40 నిమిషాలకు సీతానగరం చేరుకుని అక్కడ పిహెచ్సీని పరిశీలిస్తారు. 10:45 నిమిషాలకు మరిపి వలస పిహెచ్సీని సందర్శిస్తారు. 11:35 నిమిషాలకు పార్వతీపురం జిల్లా ఆసుపత్రి సందర్శించి అనంతరం వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.
మెంటాడ మండలం చిన్నమేడపల్లి, దత్తి రాజేరు మండలం మర్రివలస గ్రామాల వద్ద నిర్మించనున్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిన మౌలిక వసతులను వేగవంతం చేస్తామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సౌరవ్ గౌర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ట్రైబల్ యూనివర్సిటీ పనులను సమీక్షించారు. వచ్చే మార్చినాటికి అకడమిక్ బ్లాక్స్, హాస్టల్స్ ప్రారంభం కావాలన్నారు.
బొబ్బిలి మండలంలోని విజయపురి గ్రామానికి చెందిన గౌరమ్మ అనే మహిళ చికిత్స పొందుతూ విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి మృతి చెందిందని సీఐ సతీశ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 17న భర్తతో కలిసి గౌరమ్మ మద్యం తాగింది. మద్యం చాలలేదని గొడవ పడటంతో భర్త మందలించగా పురుగు మందు తాగినట్లు తెలిపారు. గమనించిన భర్త జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
విజయనగరంలో జిల్లాలోని దత్తిరాజేరు మండలం మానాపురం రైల్వే గేటు వద్ద రాయ్‌పూర్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణం వచ్చే జనవరి నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తికావాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఈ వంతెన నిర్మాణం పనుల పురోగతిపై ఇకపై ప్రతి నెలా నిర్మాణ సంస్థతో, జాతీయ రహదారుల సంస్థ ఇంజినీర్లతోను సమీక్ష నిర్వహిస్తామన్నారు.
విజయనగరం జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2024కు ఈనెల 28వ తేదీలోగా ప్రతిపాదనలు పంపించాలని DEO ఎన్.ప్రేమ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ డైట్ ఇతర యాజమాన్యాల కింద పనిచేస్తున్న 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులంతా ఈ అవార్డుకు అర్హులని పేర్కొన్నారు.
విజయనగరం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమెన్ పీఎస్‌లో పనిచేస్తున్న నారాయణరావుకు గుర్ల, 1టౌన్ తారకేశ్వరరావును బాడంగి, పీటీసీలో ఉన్న ప్రసాద్‌ను రామభద్రపురం, గరివిడి దామోదర్‌ను చీపురుపల్లి, బుదరాయవలస లోకేశ్వరరావును గరివిడి పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. తక్షణమే విధుల్లో చేరాలని SP ఆదేశించారు.
MLAగా ఓడినా.. రెండు నెలలు తిరగక ముందే బొత్స సత్యనారాయణకు క్యాబినెట్ హోదా లభించనుంది. చీపురుపల్లి నుంచి పోటీ చేసిన బొత్స తన ప్రత్యర్థి కళావెంకట్రావు చేతిలో ఓడిపోయారు.అధినేత జగన్ నిర్ణయంతో ఆయన మళ్లీ చట్ట సభల్లో అడుగుపెట్టే అవకాశం దక్కింది. MLCగా ప్రమాణ స్వీకారం చేసిన బొత్సను శాససనమండలిలో విపక్ష నేతగా నియమించాలని జగన్ నిర్ణయించారు. దీంతో బొత్స అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన పేలుడులో 18 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో ఉమ్మడి విజయనగరం జిల్లా వాసులు ముగ్గురు ఉన్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతులు అసిస్టెంట్ మేనేజర్ నారాయణరావు (గరివిడి), ఫిట్టర్ పార్థసారథి(పార్వతీపురం), ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్ ఆనందరావు బమ్మిడి(గొల్లపేట, పూసపాటిరేగ)గా గుర్తించారు.
జిల్లాలోని కౌలు రైతులందరికీ గుర్తింపుకార్డులను జారీ చేసి, 100 శాతం రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో 15,500 సీసీఆర్సీ కార్డులను రైతులకు అందించాల్సి ఉండగా, ఇప్పటికే 14,860 కార్డులు (95.5శాతం) అందజేశామన్నారు. మిగిలిన కార్డులను రెండు రోజుల్లో అందజేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు.
బహుళ జాతి కంపెనీ (MNC)లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు.సాయి కుమార్ తెలిపారు. జెన్ ప్యాక్ట్ కంపెనీలో కంటెంట్ మోడరేషన్, కస్టమర్ సర్వీస్ వాయిస్ సపోర్ట్ విభాగాలలో 1500 ఖాళీల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారన్నారు. 2022,23,24 సంవత్సరాలలో డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులుగా తెలిపారు. ఈనెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.