India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇన్‌స్పైర్ మనక్ కోసం ప్రాజెక్టులు తయారు చేసి.. ఆ వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేయాలని విజయనగరం డీఈవో ప్రేమకుమార్ సూచించారు. తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి పాఠశాల నుంచి ప్రాజెక్టులను ఈనెల చివరిలోగా నమోదు చేయాలన్నారు. అన్ని పాఠశాలల ప్రాజెక్టులను అప్‌లోడ్ చేయాలని కోరారు. ఉన్నత పాఠశాల నుంచి 5, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి 3 ప్రాజెక్టులు ఉండాలని సూచించారు.
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలోని శాసనమండలిలో ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. బొత్స చేత శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముందుగా తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌తో బొత్స భేటి అవుతారు.
ఉపాధి హామీ పనుల ఆమోదం కోసం ప్రతి గ్రామంలో ఈ నెల 23 న గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. ఈ గ్రామ సభల్లో సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయం చేసుకొని ప్రణాళికా బద్దంగా సభలను విజయవంతం చేయాలన్నారు. మంగళవారం కలెక్టర్ ఎం.పి.డి.ఓ లు, ఈఓఆర్డిలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రామ సభలపై ఆయన పలు సూచనలు చేశారు.
పాచిపెంట మండలంలో ఇద్దరు గిరిజన యువతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని బొర్రమామిడి పంచాయతీ బొడ్డపాడు సమీపంలోని నేలబావిలో దూకి సేబి సంబురమ్మ (24), పోయి లక్మి (18) ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం రాత్రి వీరిద్దరూ చేతులకు చున్నీలు కట్టుకొని బావిలో దూకినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం తరుఫున న్యాయవాదిగా హైకోర్టులో వాదనలు వినిపించేందుకు గరివిడి మండలం అర్తమూరు గ్రామానికి చెందిన పతివాడ రామకృష్ణను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో న్యాయవాది రామకృష్ణ మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులైన రామకృష్ణకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
విజయనగరం జిల్లా వాసికి అరుదైన అవకాశం లభించింది. గరివిడి మండలం అర్తమూరు గ్రామానికి చెందిన పతివాడ రామకృష్ణ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. గతంలో ఆయన ఉమ్మడి ఏపీ హైకోర్టులో లాయర్‌గా పని చేశారు. అలాగే వృత్తిపరంగా ఆయన చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. ప్రభుత్వానికి సంబంధించిన కేసులను ఆయన వాదిస్తారు.
అభివృద్ధిలో ప్రతి వారం ప్రగతి కనిపించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అభివృద్ధి పనులు వేగవంతం కావాలని, ప్రతి వారం ప్రగతిలో మార్పులు ఉండాలన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు వంద రోజులు, సంవత్సరం, ఐదు సంవత్సరాల ప్రణాళికలు పక్కాగా రూపొందించాలని ఆయన ఆదేశించారు. ఆయా ప్రణాళికల మేర అభివృద్ధి జరగాలని సూచించారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గడిచిన 3రోజుల నుంచి రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలు హోరాహోరీగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి బాలబాలికల జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. రెండు విభాగాల్లోనూ విజయనగరం జిల్లా జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. విజేతలకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులను అభినందించారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పశువులకు గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలకు సంబంధించి గోడ పత్రికలను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సోమవారం ఆవిష్కరించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వైవీ రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 19 వరకు జిల్లా వ్యాప్తంగా ఐదో విడత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తారని, పాడి రైతులు వినియోగించుకోవాలని కోరారు.
రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నివాసంలో శ్రావణమాస పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. సోదర, సోదరి అనుబంధానికి ప్రతీక రాఖీ అని మంత్రి చెప్పారు. అనంతరం ఆమె తన సోదరులు, పార్టీ నేతలు నిమ్మాది చిట్టి, మత్స శ్యామ్, గుళ్ల వేణు, ఆముదాల పరమేశు, కనక, కూనిశెట్టి భీమా తదితరులకు రాఖీలు కట్టారు.
Sorry, no posts matched your criteria.