India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ-అరకు జాతీయ రహదారి విస్తరణకు త్వరలో మోక్షం కలగనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని కొత్తవలస, శృంగవరపుకోట మీదుగా రహదారి విస్తరణ పనులు జరగనున్నాయి. గత ఏడాది విస్తరణ పనులు ప్రారంభించినప్పటికీ కేంద్రం ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూలంగా స్పందించారు.కొత్తవలస, ఎల్ కోట, వేపాడ, ఎస్ కోట మీదుగా 4 లైన్లకు విస్తరించనున్నారు.
జులై మొదటి వారం గడుస్తున్నప్పటికీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఖరీఫ్ సేద్యం మందకొడిగా సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఆశాజనకంగా కురవకపోవడమే దీనికి కారణంగా రైతులు చెబుతున్నారు. అధికారిక గణంకాల ప్రకారం విజయనగరం జిల్లాలోని 4 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని 6 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టుల్లో నీరు లేని కారణంగా వరి సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం జిల్లాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం పర్యటించనున్నారు. భోగాపురం మండలంలో జరుగుతున్న అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను మధ్యాహ్నం రెండు గంటలకు రామ్మోహన్ నాయుడు పరిశీలించనున్నారు. విమానాశ్రయ నిర్మాణ పనుల పురోగతి, వేగవంతానికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి ఆరా తీయనున్నారు.
వేపగుంట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.కోట మండలం వెంకటరమణపేటకు చెందిన కృష్ణ(37) మృతి చెందాడు. విశాఖలోని ఆసుపత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు వెళ్తుండగా.. బైక్ అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రగా గాయపడ్డ అతనిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా.. కృష్ణ దంపతులకు రెండు నెలల క్రితమే కవల పిల్లలు(ఆడ, మగ)పుట్టారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
రాజాంకు చెందిన జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంథి మల్లిఖార్జునరావును రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో సోమవారం ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా జిఎంఆర్‌ను మంత్రి శ్రీనివాస్ సత్కరించారు. తాను జీఎంఆర్ ఐటిలో ఇంజినీరింగ్ చదివిన రోజులను గుర్తు చేసుకున్నారు.
తమిళనాడు రాష్ట్రం సేలంలో నిర్వహించిన జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలో విజయనగరం జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. మూడు కాంస్య పతకాలు సాధించినట్లు రెజ్లింగ్ అధ్యక్షుడు వెంకట రమణ తెలిపారు. 57 కేజీల విభాగంలో పావని, 61 కేజీల విభాగంలో కరుణానిధి, 74 కేజీల విభాగంలో తిరుమల ప్రసాద్ కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. దీంతో క్రీడాకారులను అసోసియేషన్ సభ్యలు, బంధువులు, స్నేహితులు అభినందిస్తున్నారు.
విజయనగరం జిల్లాలో పలు మండలాలలో అక్రమంగా గ్రావెల్, మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయని కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. ఇక పై జిల్లాలో అక్రమ మైనింగ్ జరిగిన సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మార్వో, ఆర్డీవో అధికారులు నిఘా పెట్టి వాటిని నిరోధించాలన్నారు. భవిష్యత్తులో అక్రమ మైనింగ్ జరిగినట్లు ఫిర్యాదులు వస్తే ఎమ్మార్వోలనే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చర్యల్లో భాగంగా, వివిధ ప్రైవేటు కంపెనీల్లో మొత్తం 270 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 11న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి అరుణ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ వివరాలను ముందుగా employment.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. జులై 11న ఉదయం 10 గంటలకు విజయనగరం శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకి హాజరుకావాలన్నారు.
రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాల నుంచి వచ్చే వాడుక నీటిని శుద్ధి చేసేందుకు భారీ వ్యయంతో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నిర్మించారు. దీనిని నిర్మించినందుకు రూ.2.50 కోట్లు ఖర్చు చేశారు. దీనిని బీచ్ రోడ్డులోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం పక్కన నిర్మించారు. ఇందుకోసం అర కిలోమీటర్ మేర భూగర్భంలో పైపులైన్లను ఏర్పాటు చేశారు. అత్యంత విలువైన వీధి దీపాలను కూడా ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.
వసతి గృహాల్లో చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక సాయి నగర్ కాలనీలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌గా విధుల్లో చేరిన రోజే ఆశ్రమ పాఠశాల నిర్వహణపై దృష్టి సారించారు. విద్యార్థులకు వండిన వంటకాలను రుచి చూశారు.
Sorry, no posts matched your criteria.