Vizianagaram

News July 12, 2024

బాడంగి: సైనిక లాంఛనాలతో రేపు అంత్యక్రియలు

image

బాడంగి మండలంలోని బొత్సవానివలస గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ గొట్టాపు శంకర్రావు(41) కశ్మీర్‌లోని లద్దాక్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలి గురువారం మృతి చెందిన సంగతి తెలిసిందే. సైనిక లాంఛనాలతో బొత్సవానివలసలో శంకర్రావు అంత్యక్రియలను శనివారం నిర్వహిస్తామని జిల్లా సైనిక సంక్షేమ అధికారి కెప్టెన్ సత్య ప్రసాద్ తెలిపారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News July 12, 2024

VZM: వరుణుడి కోసం అన్నదాతల ఎదురు చూపులు

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వరుణుడి కరుణ కోసం అన్నదాతలు ఎదురు చూపులు చూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నప్పటికీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో సాగుకు సిద్దమైన అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తోటపల్లి కాలువల్లో నీరు లేకపోవడంతో అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి.

News July 12, 2024

VZM: అక్కడలా..? ఇక్కడిలా..? ఎందుకలా?

image

జొన్నాడ టోల్‌గేట్ ఎత్తివేయాలని గత కొద్ది రోజులుగా జిల్లాలో నిరసనలు చేస్తున్న సంగతి తెలిసందే. ఈ తరుణంలో అగనంపూడి టోల్‌గేట్ ఎత్తేసిన విషయాన్ని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ టోల్‌గేట్ ఎత్తేశారు. జొన్నాడ టోల్‌గేట్ వలన ఇటీవల ఆర్టీసీ కూడా టికెట్ రేట్లు పెంచడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

News July 12, 2024

VZM: ఒకే పాఠశాలకు 11 ట్రిపుల్ ఐటీ సీట్లు

image

IIITలో కొత్తవలస మండలం అర్ధాన్నపాలెం ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన 11 విద్యార్థులు సీట్లు సాధించినట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. ఎం.హేమ వర్షిణి, డి.శ్రావ్య, టి.జగదీశ్, పి.మేఘన, కే.సాహిత, ఎస్.శిరీష, జె.గీతాశ్రీ, షేక్ సమీర నూజివీడులో..డి.అశ్విని, ఎం.లిఖిత, జి.హర్షవర్ధన్‌కు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో సీట్లు వచ్చాయన్నారు. విద్యార్థులను పాఠశాల సిబ్బందితో పాటు గ్రామస్థులు అభినందించారు.

News July 12, 2024

విజయనగరం: ఉచిత ఇసుక సరఫరాపై టోల్ ఫ్రీ నంబరు

image

ఉచిత ఇసుక సరఫరాకు సంబంధించి సమాచారం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసింది. సమాచారం, ఫిర్యాదుల కోసం 18004 256014 టోల్ ఫ్రీ నంబరుకు, ఆ నంబర్ అందుబాటులోకి రాకుంటే 90323 38135 ఫోన్ నంబరును సంప్రదించవచ్చునని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ఇసుక వినియోగదారులు గమనించాలని కోరింది.

News July 12, 2024

విశాఖపట్నం రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి

image

విశాఖపట్నం రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్‌గా గోపీనాథ్ జెట్టి నియమితులయ్యారు. ప్రస్తుతం విశాఖ రేంజ్ డీఐజీగా ఉన్న విశాల్ గున్నీ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2008 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన గోపీనాథ్ జెట్టి రెండు మూడు రోజులలో డీఐజీగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.

News July 12, 2024

విజయనగరం-రాయగడ సెక్షన్‌లో DRM తనిఖీలు

image

డివిజనల్‌ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ వాల్తేర్ డివిజన్‌లోని విజయనగరం-రాయగడ రైల్వే సెక్షన్‌లో గురువారం తనిఖీలు నిర్వహించారు. ఆ సెక్షన్‌లో ప్రస్తుతం జరుగుతున్న మూడో లైన్‌ పనుల పురోగతి, స్టేషన్ల పునరాభివృద్ధి కార్యక్రమాలు, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలలపై సమీక్ష జరిపారు. అనంతరం విజయనగరం నుంచి రాయగడ వరకు విండో-ట్రైలింగ్‌ తనిఖీని నిర్వహించారు.

News July 12, 2024

VZM: మరో ఆరునెలల్లో రిటైర్మెంట్.. అంతలోనే..

image

లద్దాక్‌లో ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో మృతి చెందిన బొత్సవానివలసకు చెందిన జవాన్‌ <<13611983>>గొట్టాపు శంకర్రావు<<>>(41) మరో ఆరు నెలల్లో రిటైర్ కాబోతున్నారు. 2003లో ఆర్మీలో చేరిన ఆయన మెకానిక్‌గా పనిచేస్తున్నారు. శంకర్రావుకు భార్య, తొమ్మిదేళ్ల పాప, ఏడేళ్ల బాబు ఉన్నారు. ఫిబ్రవరిలో ఇంటికి వచ్చి సరదాగా గడిపారని అతని తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తున్నారు. మృతదేహాన్ని హెలికాప్టర్‌లో స్వగ్రామానికి తీసుకురానున్నారు.

News July 12, 2024

VZM: ఆక్సిజన్ సిలిండర్ పేలి ఆర్మీ జవాన్ మృతి

image

బాడంగి మండలంలోని బొత్సవానివలసలో విషాదఛాయలు అలముకున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని లద్దాఖ్ వద్ద ఆక్సిజన్ సిలిండర్ పేలిన సంఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతి చెందిన వారిలో బాడంగి మండలం బొత్సవానివలసకి చెందిన గొట్టాపు శంకరరావు ఉన్నారు. శంకరరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతితో విషాదం నెలకొంది.

News July 11, 2024

గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా.. ఐతే ఇది తప్పనిసరి

image

ఈ నెల 20న సింహాచలం గిరి ప్రదక్షిణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రదక్షిణ చేయటానికి లక్షల మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. కావున వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ప్రదక్షిణ చేసే భక్తులకు ఆస్తమా, జ్వరం మొదలైనవి ఉన్నట్లయితే తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రదక్షిణ సమయంలో అలసట, నీరసం వస్తే దగ్గరలో వైద్యశిబిరాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.