India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ పేరిట +977 ISD కాల్స్ వస్తున్నాయని అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగం గురువారం తెలిపింది. +977 970-2640751 నంబర్ పేరిట కాల్ చేసి కొంత మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇటువంటి నంబర్‌తో వచ్చిన కాల్స్‌ను ఎవరు లిఫ్ట్ చేయవద్దని అధికారులు చెబుతున్నారు. ఈ స్కామ్‌కి సంబంధించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఉమ్మడి విజయనగరంలో జిల్లా జనాభా 28,56,151కు చేరుకుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 9,25,340 మంది, విజయనగరం జిల్లాలో 19,30,811 మంది జనాభా ఉన్నట్లు ఏయూ జనాభా అధ్యయన కేంద్రం అంచనా వేసింది. 2011తో పోల్చితే ఉమ్మడి జిల్లాలో సుమారు ఐదు లక్షలకు పైగా జనాభా పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి విజయనగరం జిల్లా జనాభా 23,42,868గా ఉంది.
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. 18 నుంచి 20 వరకు స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తారు. 23 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్లో మార్పులు చేసుకోవడానికి 27వ తేదీన అవకాశం కల్పిస్తారు. ఈ నెల 31న తొలి దశ సీట్ల కేటాయిస్తారు. >Share it
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి చదురు గుడి హుండీ ఆదాయాన్ని బుధవారం సిబ్బందితో స్థానిక కల్యాణ మండపంలో లెక్కించారు. 37 రోజులకు రూ.13,43,881 నగదు, 18.600 గ్రాముల బంగారం, 486 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ ప్రసాదరావు, దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ టి.అన్నపూర్ణ తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11.20 నుంచి 11.50 వరకు అనకాపల్లి జిల్లాలోని దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి 12.35కు భోగాపురం చేరుకుంటారు. 1.30 వరకు ఎయిర్ పోర్టు ప్రాంతాన్ని సందర్శిస్తారు. అనంతరం పనులు జరుగుతున్న తీరుపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం విశాఖకు వెళ్లనున్నారు.
విజయనగరం పట్టణంలోని గోకపేటలో 45వ సచివాలయాన్ని విజయనగరం కమిషనర్ మల్లయ్య నాయుడు బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇద్దరు సచివాలయ కార్యదర్శులు విధులకు గైర్హాజరు కావడంతో వారికి శ్రీముఖాలు జారీ చేశారు. రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడంపై సిబ్బందిపై మండిపడ్డారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గజపతినగరం మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడి బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.40 లక్షలు తస్కరించారు. ఈ మేరకు ఆయన బుధవారం గజపతినగరం సబ్ ఇన్స్పెక్టర్ మహేశ్‌కు ఫిర్యాదు చేశారు. నగదు ఖాతా నుంచి డెబిట్ అయినట్లు సంక్షిప్త సందేశాలు వచ్చాయని, బ్యాంక్ ఖాతాను పరిశీలిస్తే సొమ్ము లేదని వాపోయారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న నేపథ్యంలో భద్రతా, బందోబస్తు ఏర్పాట్లను విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్ని బుధవారం పరిశీలించారు. జిల్లా ఎస్పీ దీపిక పాటిల్‌తో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు భద్రతాపరమైన సూచనలు అందజేశారు.
పార్వతీపురం జిల్లాలోని జంఝావతి రబ్బరు డ్యామ్‌లో ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం స్నానానికి వెళ్లిన పార్వతీపురం మండలం మరికి పంచాయతీ కొత్తూరుకి చెందిన కడ్రక గోపాలరావు(25) ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు కొమరాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖపట్నం జిల్లా పద్మనాభంలో 1794 జులై 10న ఆంగ్లేయులు విజయనగరం సంస్థానాధీశులు మధ్య జరిగిన యుద్ధానికి నేటికి 230 ఏళ్లు. ఆ యుద్ధంలో చినవిజయరామరాజుతో పాటు 394 మంది మరణించారు. దీంతో ఆ యుద్ధాన్ని స్కాట్లాండ్ ప్లోడెన్ యుద్ధంతో పోల్చారు. చినవిజయరామరాజును మచిలీపట్నం పంపించడానికి పన్నాగం పన్నగా అతను తన సామంతులతో కలిసి పద్మనాభం వద్ద ఆంగ్లేయులపై యుద్ధం చేసి వీరమరణం పొందారు. అక్కడే ఆయనకు సమాధి నిర్మించారు.
Sorry, no posts matched your criteria.