India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్వతీపురం వైసీపీ జిల్లా కార్యాలయానికి వార్డు సచివాలయాల టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు గురువారం రెండోసారి నోటీసును అంటించారు. పట్టణంలోని బెలగాంలో 16వ వార్డులో సాయినగర్ కాలనీకి ఆనుకుని అనుమతులు పొందకుండా వైసీపీ జిల్లా కార్యాలయాన్ని నిర్మిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ కె.శ్రీనివాసరావు ఆదేశాలతో సిబ్బంది నోటీసులు అంటించారు.
రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం జిల్లాలో పర్యటిస్తారు. ఆయన ఉదయం 10 గంటల నుంచి జిల్లాపరిషత్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం 3 గంటలకు దత్తిరాజేరు మండలం కోమటిపల్లిలో జరిగే పార్టీ సమావేశంలో పాల్గొంటారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొవాలని అన్నారు.
కొమరాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒప్పంద అధ్యాపకులుగా పనిచేస్తున్న ఎం. సత్యనారాయణ గురువారం మృతి చెందినట్లు ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలిపారు. గతేడాది ఆగస్టు 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయమయ్యింది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయన నేడు మృతి చెందినట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఆయన మృతి పట్ల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు మౌనం పాటించి నివాళులర్పించారు.
అగ్ని వీర్ స్కీంలో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి వహీదా తెలిపారు. పది, ఇంటర్ వివాహం కానీ యువతీ యువకులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని అన్నారు. ఈనెల 8 నుంచి 28 వరకు అప్లికేషన్ నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. http://agnopathvayu.cdac.in లింకు ద్వారా అప్లే చేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కేంద్రీయ గిరిజన వర్శిటీతో పాటు వీటీ అగ్రహారంలో ఉన్న నాక్ శిక్షణ కేంద్రంలో స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధికారి గోవిందరావు తెలిపారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉండి కనీసం 8వ తరగతి చదివిన వారికి 3 నెలల పాటు వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తామన్నారు. ఆసక్తి గల వారు తక్షణమే రెండు కేంద్రాల్లో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.
గంజాయి సాగు చేయకుండా కార్యాచరణ సిద్ధం చేస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. హోం మంత్రి అనిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, రవీంద్ర, సత్యకుమార్, సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకోవల్సిన పటిష్ఠమైన చర్యలపై సబ్ కమిటీలో సుదీర్ఘంగా చర్చించారు.
జునోసిస్ దినోత్సవ సందర్భంగా ఈ నెల 6న జిల్లాలోని 28,490 పెంపుడు కుక్కలకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు వై.వి.రమణ తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న పెంపుడు కుక్కల యజమానులు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సమీప పశు వైద్య కేంద్రాలను సంప్రదించాలన్నారు.
మార్కెట్‌లో మిరప మరింత ఘాటెక్కింది. స్థానిక రామభద్రపురం కూరగాయల మార్కెట్‌లో గత నెల కిలో రూ.30 ఉన్న మిర్చిని ప్రస్తుతం రూ.100కు వ్యాపారులు అమ్ముతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మిరపకు తెగుళ్లు సోకి, పంట పాడైపోవడంతో గిరాకీ పెరిగిందని రైతులు చెబుతున్నారు. ఒకే సారి భారీగా పెరిగిపోవడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
పలాస-విజయనగరం డివిజన్ పరిధిలో భర్త భద్రతాపరమైన పనులు కారణంగా రేపు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డిసిఎం కే సందీప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 07471 పలాస-విశాఖ, 07470 విశాఖ -పలాస, 08522 విశాఖ – గునుపూర్, 08521 గునుపూర్ – విశాఖ, 08504 విశాఖ – భవానీపట్నం, 08532 విశాఖ – బ్రహ్మపుర ప్యాసింజర్ ట్రైన్ లు, 22820 విశాఖ – భువనేశ్వర్ ఇంటర్ సిటీ రైలు రద్దు చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు మంత్రుల సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోంమంత్రి అనిత అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన ఈ సబ్ కమిటీలో రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంధ్ర, సత్యకుమార్ యాదవ్, గుమ్మిడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు. ఈ సబ్ కమిటీ తొలి సమావేశం 4వ తేదీ గురువారం రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో ఉదయం 11.00 గంటల నుంచి జరుగనుంది.
Sorry, no posts matched your criteria.