Vizianagaram

News July 9, 2024

VZM: రోడ్డు ప్రమాదంతో వ్యక్తి మృతి

image

వేపగుంట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.కోట మండలం వెంకటరమణపేటకు చెందిన కృష్ణ(37) మృతి చెందాడు. విశాఖలోని ఆసుపత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు వెళ్తుండగా.. బైక్ అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రగా గాయపడ్డ అతనిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా.. కృష్ణ దంపతులకు రెండు నెలల క్రితమే కవల పిల్లలు(ఆడ, మగ)పుట్టారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

News July 9, 2024

VZM: జీఎంఆర్‌ను కలిసిన మంత్రి శ్రీనివాస్

image

రాజాంకు చెందిన జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంథి మల్లిఖార్జునరావును రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో సోమవారం ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా జిఎంఆ‌ర్‌ను మంత్రి శ్రీనివాస్ సత్కరించారు. తాను జీఎంఆర్ ఐటిలో ఇంజినీరింగ్ చదివిన రోజులను గుర్తు చేసుకున్నారు.

News July 8, 2024

VZM: జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీల్లో జిల్లాకు 3 కాంస్య పతకాలు

image

తమిళనాడు రాష్ట్రం సేలంలో నిర్వహించిన జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలో విజయనగరం జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. మూడు కాంస్య పతకాలు సాధించినట్లు రెజ్లింగ్ అధ్యక్షుడు వెంకట రమణ తెలిపారు. 57 కేజీల విభాగంలో పావని, 61 కేజీల విభాగంలో కరుణానిధి, 74 కేజీల విభాగంలో తిరుమల ప్రసాద్ కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. దీంతో క్రీడాకారులను అసోసియేషన్ సభ్యలు, బంధువులు, స్నేహితులు అభినందిస్తున్నారు.

News July 8, 2024

VZM: అక్ర‌మ మైనింగ్‌ను సహించేది లేదు: కలెక్టర్ అంబేడ్కర్

image

విజయనగరం జిల్లాలో ప‌లు మండలాలలో అక్ర‌మంగా గ్రావెల్‌, మ‌ట్టి త‌వ్వ‌కాలు జ‌రుగుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయ‌ని కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. ఇక పై జిల్లాలో అక్ర‌మ మైనింగ్ జరిగిన స‌హించేది లేద‌ని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మార్వో, ఆర్డీవో అధికారులు నిఘా పెట్టి వాటిని నిరోధించాల‌న్నారు. భవిష్యత్తులో అక్ర‌మ మైనింగ్ జ‌రిగిన‌ట్లు ఫిర్యాదులు వ‌స్తే ‌ఎమ్మార్వోల‌నే బాధ్యుల‌ను చేస్తామ‌ని హెచ్చరించారు.

News July 8, 2024

విజయనగరంలో ఈ నెల 11న జాబ్‌మేళా: అరుణ

image

నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి కల్పించే చర్యల్లో భాగంగా, వివిధ ప్రైవేటు కంపెనీల్లో మొత్తం 270 ఉద్యోగాల భ‌ర్తీ కోసం ఈ నెల 11న జాబ్‌మేళా నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి అరుణ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు త‌మ వివరాలను ముందుగా employment.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. జులై 11న ఉదయం 10 గంటలకు విజయనగరం శ్రీ చైతన్య డిగ్రీ క‌ళాశాల‌లో జరిగే ఇంటర్వ్యూకి హాజరుకావాలన్నారు.

News July 8, 2024

రుషికొండ భవనాల వాడుక నీరు శుద్ధికి రూ.2.5 కోట్లు..!

image

రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాల నుంచి వచ్చే వాడుక నీటిని శుద్ధి చేసేందుకు భారీ వ్యయంతో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నిర్మించారు. దీనిని నిర్మించినందుకు రూ.2.50 కోట్లు ఖర్చు చేశారు. దీనిని బీచ్ రోడ్డులోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం పక్కన నిర్మించారు. ఇందుకోసం అర కిలోమీటర్ మేర భూగర్భంలో పైపులైన్లను ఏర్పాటు చేశారు. అత్యంత విలువైన వీధి దీపాలను కూడా ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.

News July 8, 2024

పార్వతీపురం: ‘నాణ్యమైన ఆహారం అందించాలి’

image

వసతి గృహాల్లో చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక సాయి నగర్ కాలనీలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌గా విధుల్లో చేరిన రోజే ఆశ్రమ పాఠశాల నిర్వహణపై దృష్టి సారించారు. విద్యార్థులకు వండిన వంటకాలను రుచి చూశారు.

News July 8, 2024

పార్వతీపురం: 4వ రోజు 117 మందికి ఈ సెట్ కౌన్సెలింగ్

image

4వ రోజు 117 మందికి ఈసెట్ కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎమ్మార్ నగరం పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపల్ విలియం క్యారీ అన్నారు. స్థానిక కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టమన్నారు. ఈనెల 10వ తేదీ వరకు వెరిఫికేషన్ కార్యక్రమం ఉంటుందన్నారు. తొలి నాలుగు రోజులు కలిపి 510 ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

News July 7, 2024

గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

గంట్యాడ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో గంట్యాడకి చెందిన హరీశ్ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

News July 7, 2024

VZM: ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు

image

వ్యవసాయ శాఖ విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ఆధ్వర్యంలో నగరంలోని కర్షకరత్న ఆగ్రో కెమికల్స్‌లో ఆదివారం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సూక్ష్మ పోషకాల నిల్వ పట్టికలను తనిఖీ చేశారు. మండల వ్యవసాయ అధికారి సమక్షంలో తనిఖీలు చేసి నివేదికలు అందించినట్టు వ్యవసాయ అధికారి తెలిపారు. రూ.3.94 లక్షల విలువ చేసే ఎరువులకు సంబంధించి నమూనాలు తనిఖీ కోసం పంపినట్లు తెలిపారు.