India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం పట్టణంలోని గంట స్తంభం సమీపంలో సోమవారం ఎటువంటి పత్రాలు లేకుండా ఓ వ్యక్తి వద్ద ఉన్న 14.405 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని 1వ పట్టణ సీఐ వెంకట్రావు తెలిపారు. వెండి వస్తువులకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో తదుపరి చర్యల నిమిత్తం తహశీల్దార్‌కు అప్పగించామని చెప్పారు. సీజ్ చేసిన వెండి వస్తువుల విలువ సుమారు రూ.9.30 లక్షలు ఉంటుందని తెలిపారు.
ఎన్నికల విధుల్లో వైఫల్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ హెచ్చరించారు. సోమవారం మన్యం జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి సంసిద్ధత ఉండాలన్నారు. వచ్చే పది రోజులు కీలకమని, ప్రతి అంశంపై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై వచ్చే ప్రతి అంశాన్ని పరిశీలించాలన్నారు.
నెల్లిమర్ల మండలం కొండగుంపాంలో పెన్షన్‌తో జీవనం సాగిస్తున్న సతివాడ రాములమ్మకి విద్యుత్ బిల్లు షాకిచ్చింది. సర్వీసు నెంబరు 759కి నెల బిల్లు రూ.44718 వచ్చింది. సోమవారం రీడింగ్ సిబ్బంది రాములమ్మ కొడుకు కాంతరావుకు బిల్లు అందజేశారు. దీంతో ఆయన బిల్లు చూసి ఆశ్చర్య పోయారు. వెంటనే సచివాలయానికి వెళ్లి బిల్లు కోసం తెలియజేయగా విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లాలని సలహా ఇచ్చారు.
విజయనగరం జిల్లాలో వాలంటీర్ల రాజీనామాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 209 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా సోమవారం భోగాపురం మండలంలో 18 మంది, కొత్తవలసలో 27 మంది, కొప్పెర్లలో11 మంది మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. వారి రిజైన్ లెటర్స్‌ని పంచాయతీ కార్యదర్శికి అందజేశారు.
ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు లావాదేవీలు, రవాణా జరగకుండా నిఘా పెంచాలని వివిధ శాఖల జిల్లా అధికారులను, విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. జిల్లా స్థాయి విజిలెన్స్, ఇఎస్ఎంఎస్ (ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్) నోడల్ ఆఫీసర్ల సమావేశాన్ని కలెక్టర్ తన ఛాంబర్లో సోమవారం నిర్వహించారు. సీజర్స్ పెంచి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు.
ఎన్నికల విధుల్లో వైఫల్యాలకు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ హెచ్చరించారు. రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ది అధికారులతో జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారి శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి సంసిద్ధత ఉండాలన్నారు.
గరుగుబిల్లి మండలం తోటపల్లి డ్యామ్ ఎడమ కాలువ వద్ద సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహన్ని గుర్తించినట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 50 నుంచి 55 సంవత్సరాలు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి సమాచారం తెలిసిన వారు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.
విజయనగరం నుంచి రాయగడ మార్గంలో పెదమానాపురం వద్ద సోమవారం ట్రైన్ కిందపడి గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. అక్కడ పనిచేస్తున్న రైల్వే సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
పరవాడ జెఎన్ ఫార్మాసిటీలోని రెండు పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన జిల్లాకు చెందిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేందుకు యాజమాన్యాలు అంగీకరించాయని CITU నేత గనిశెట్టి సత్యనారాయణ తెలిపారు. గంట్యాడ మండలం సిరిపురానికి చెందిన ఆళ్ల గోవింద కుటుంబానికి రూ.32.50 లక్షలు, పూసపాటిరేగ మండలం గొల్లపేటకు చెందిన రమణ కుటుంబానికి రూ.35 లక్షల పరిహారం చెల్లించేందుకు అంగీకారం కుదిరిందన్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈరోజు పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విజయనగరంలోని 20 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొన్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. వడదెబ్బకు గురికాకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.