India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజలకు అత్యంత ప్రాధాన్యతైలైన మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన సమగ్ర ప్రతిపాదనలను అందజేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వానికి సామాజిక బాధ్యతగా సహకారం అందించేందుకు ఎన్‌పీసీఐఎల్ భాగస్వామ్యంతో ప్రజలకు అత్యంత మేలు జరిగే మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ముందుకు వచ్చిందన్నారు. జిల్లా పరిధిలోని ఆయా ప్రాధాన్యతలను గుర్తించి వెంటనే ప్రతిపాదనలను పంపించాలన్నారు.
రాజీయే రాజమార్గం అనే నినాదంతో ఉమ్మడి జిల్లాలో వివిధ కోర్టుల పరిధిలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 1863 కేసులకు పరిష్కారం లభించింది. విజయనగరం(1136), పార్వతీపురం(138), బొబ్బిలి(160), సాలూరు(151), ఎస్ కోట(65), గజపతినగరం(91), చీపురుపల్లి(50), కొత్తవలస(53), కురుపాం(19ల)లో కేసుల చొప్పున పరిష్కరించారు. ఈ ఒక్క రోజే సుమారు రూ.15 కోట్ల మొత్తాన్ని కక్షిదారులకు చెల్లించారు.
బొబ్బిలి పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ బాబు కుమారుడు హేమంత్ విశాఖలో జరిగిన ఓ ప్రమాదంలో శనివారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. విశాఖలోని పీఎం పాలెంలో నాలుగు అంతస్తుల భవనం పై ఏసీ బిగిస్తుండగా.. ప్రమాదవశాత్తు జారిపడి హేమంత్ మృతిచెందాడు. దీంతో బొబ్బిలిలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పని చేసి పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ దీపిక పాటిల్ శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో వారు చేసిన సేవలను కొనియాడారు. విధిలో చేసిన సేవలే అందరికి గుర్తింపునిస్తాయన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సేవలందించారని, ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని అన్నారు.
జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పని చేసి పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ దీపిక పాటిల్ శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో వారు చేసిన సేవలను కొనియాడారు. విధిలో చేసిన సేవలే అందరికి గుర్తింపునిస్తాయన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సేవలందించారని, ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని అన్నారు.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పెంచిన పింఛన్లను ప్రభుత్వం జులై నుంచి పంపిణీ చేస్తున్నందున పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టర్ వెబెక్స్ ద్వారా పింఛన్ పంపిణీ ఏర్పాట్లపై ఆయన ఎంపీడీఓలతో సమీక్షించారు. 1వ తేది ఉదయం 6 గంటలకే పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని సూచించారు. మొదటిరోజు 90 శాతం పంపిణీ పూర్తి కావాలన్నారు.
వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ప్రాతిపదికన నియామకాలు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చలపతిరావు తెలిపారు. ఫిజికల్ ఎడ్యుకేషన్, లైబ్రేరియన్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తామన్నారు. అభ్యర్థులు జులై మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు కళాశాల ప్రిన్సిపల్‌కు అందజేయాలని ఆయన తెలిపారు.
భార్యపై హత్యాయత్నం చేసిన కేసులో టీచర్‌కు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానాను బొబ్బిలి కోర్టు విధించినట్లు కోర్టు సమన్వయ అధికారి ఏఎస్సై కొండలరావు తెలిపారు. మండలంలోని గజరాయునివలసకు చెందిన గుండెల సూరిబాబు టీచర్‌గా పని చేస్తున్నాడు. తన భార్యపై కత్తితో దాడి చేసిన ఘటనలో 2016లో కేసు నమోదయ్యింది. నేరం రుజువు కావడంతో సబ్ జడ్జి ఎస్.అరుణశ్రీ మూడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో పాముకాటుతో ఎక్కవ మంది మృతి చెందుతున్నారు. వర్షాలు పడుతుండడంతో రైతులు, వ్యవసాయ కూలీలంతా పొలం పనులకు వెళ్తూ అక్కడ పాముకాటుకు గురౌతున్నారు. 2014 నుంచి ఈ ఏడాది మే నెల వరకు 4,447 పాముకాటు కేసులు నమోదయ్యాయి. వీరిలో సుమారు 30% మృతిచెందారు. ప్రథమ చికిత్సపై అవగాహన లేకపోవడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రధాన కారణాలు. జిల్లా ఆస్పత్రులలో వారానికి ఆరు పాముకాటు కేసులు నమోదౌతున్నాయి.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణచక్రవర్తిని, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానంలోని ఆయన ఛాంబర్‌లో కలిసి, పూలగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొద్దిసేపు జిల్లాకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆర్‌డిఓ ఎం.వి.సూర్యకళ కూడా తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.