India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 4వ తేదీన జరగాల్సిన రెండో, నాల్గో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ టీ. చిట్టిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ విద్యార్థి సంఘాలు 4వ తేదీన బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. గురువారం జరగాల్సిన పరీక్షలు మరలా ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2024 సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారి ప్రేమ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో కనీసం 10 సంవత్సరముల సేవ పూర్తిచేసిన వారు అర్హులు. ఈ నెల 15వ తేదీలోగా వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలను teacher.education.gov.in వెబ్ సైట్ ద్వారా పొందవచ్చు
పూరి జగన్నాధుడి రథయాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యానికి అన్‌రిజర్వుడ్ ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే సందీప్ తెలిపారు. విశాఖ-పూరి(08347) ప్రత్యేక రైలు ఈనెల 6,14,16 తేదీల్లో మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖలో బయలుదేరి అదే రోజు రాత్రికి పూరి చేరుకుంటుందని పేర్కొన్నారు. తిరిగి పూరి-విశాఖ(08348) రైలు 8,16,18 తేదీల్లో తెల్లవారుజామున 1.45 గంటలకు పూరిలో బయలుదేరుతుందని తెలిపారు.
సార్వత్రిక విద్యాపీఠం పదోతరగతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో విజయనగరం జిల్లా రాష్ట్రంలో వరుసగా 15, 16వ స్థానాల్లో నిలిచింది. పదో తరగతిలో 543 మందికి 369, ఇంటర్లో 658కి 411 మంది పాసైనట్లు డీఈవో ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసేందుకు సబ్జెక్టుకు రూ.200, రీవెరిఫికేషన్‌కు రూ.1000 (సబ్జెక్టుకు) చొప్పున ఈనెల 13వ తేదీ లోపు ఆన్లైన్లో చెల్లించాలి.
బాడంగి మండలం గొల్లాదిలో వీధి కుక్కలు దాడిలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డి.లోకేశ్ ఇంటి నుంచి మంగళవారం బయటకు వెళ్లగా కుక్కలు దాడి చేసి ముక్కు కొరికేశాయి. చెంప, చేతి భాగంలో కూడా గాయాలయ్యాయి. సాయంత్రం చింతాడ లక్ష్మిపై కూడా దాడి చేశాయి. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అధికారులు స్పందించి కుక్కలు బెడద నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
AU పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ నెల 4,6 తేదీలలో డా.వీఎస్ కృష్ణ కళాశాలలో స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 10 వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని.. 11 తేదీ నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 19న సీట్ల కేటాయించి..22 లోపు క్లాసులు ప్రారంభిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. AU పరిధిలో మొత్తం 163 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.
జిల్లాలో కాన్సర్ బాధితులకు ఎటువంటి వైద్య సహాయం అందించట్లేదని కాన్సర్ ఆసుపత్రి సాధన కమిటీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అంబేడ్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మన్యం జిల్లాకు కూడా కలిపి విజయనగరంలో కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసే ఏర్పాట్లు చేయాలని కోరారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కీమోథెరపీ లాంటి చికిత్సలు అందించేలా కృషి చేయాలన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాకు నూతన కలెక్టర్‌గా ఏ.శ్యామ్ ప్రసాద్‌ను నియమించారు. ఈయన పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. రాష్ట్రంలో పలువురు కలెక్టర్ల బదిలీల్లో భాగంగా మన్యం జిల్లాకు ఈయన రానున్నారు. ఇక్కడ కలెక్టర్‌గా పనిచేస్తున్న నిశాంత్ కుమార్ బదిలీపై వెళ్లారు.
రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సేర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాటిపూడి రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేశారు. మూడు మండలాల్లోని 11 కాలువల ద్వారా 15,365 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. రిజర్వాయర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసి, శివారు భూములకు కూడా సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
విజయనగరం మహరాజా సంగీత, నృత్య కళాశాలలో నాలుగేళ్ల సర్టిఫికెట్ కోర్సు, రెండేళ్ల డిప్లమో కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ K.A.V.L.N శాస్త్రి తెలిపారు. 01.07.2023 నాటికి 10 సంవత్సరాల వయసు నిండిన వారు అర్హులని, 60 ఏళ్ల లోపు వారూ చేరవచ్చన్నారు. ఈ రెండు కోర్సులకు ప్రవేశ రుసుములుగా రూ.1600, రూ.2100 చొప్పున నిర్ణయించామన్నారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.