India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని విశాఖపట్నం రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బి.విజయభాస్కర్ సూచించారు. విజయనగరం డీఈఓ ఆఫీసులో విద్యాశాఖ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థి పాఠశాలలోనే భోజనం చేసేటట్లు ప్రోత్సహించాలన్నారు. భోజన నాణ్యతను పరిశీలించాలన్నారు. అకాడమిక్ విషయాలపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. డీఈవో ప్రేమకుమార్, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.
గుర్ల మండలం గుజ్జంగివలస గ్రామానికి చెందిన అట్టాడ లక్ష్మి గురువారం పాముకాటుకు గురై మృతి చెందింది. లక్ష్మి గ్రామంలో కిరాణా షాప్ నడుపుకుంటూ జీవన ఉపాధి పొందుతుంది. గురువారం ఎప్పటిలాగే షాపు తెరచి తన పనిలో నిమగ్నమవ్వగా.. అప్పటికే షాపులో ఉన్న పాము లక్ష్మిని కాటు వేసింది. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందింది.
పార్వతీపురం మన్యం జిల్లాలోని గరుగుబిల్లి మండలం రావివలస సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న అల్లు తిరుపతినాయుడు ఏసీబీకి చిక్కాడు. గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తికి కాంట్రాక్టు బిల్లుల నిమిత్తం రూ.20వేలు లంచం డిమాండ్ చేయగా.. సదరు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
గిరిజన గ్రామాలకు ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. గిరిజనుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలలో మందులు అందుబాటులో ఉండేలా పూర్తి చర్యలు చేపట్టాలని సూచించారు. పీహెచ్సీ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
మెరకముడిదాం మండలం చిన్నమంజిరిపేట గ్రామానికి చెందిన రాగోలు మహేశ్(38) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. బాడంగి మండలంలోని గజరాయునివలస గ్రామంలో ఓ ఇంటికి పెయింటింగ్ వెయ్యడానికి బుధవారం వెళ్లాడు. అక్కడ రెండో అంతస్థులో పెయింటింగ్ వేస్తుండగా తాడు తెగిపోవడంతో ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదుతో ఎస్.ఐ జయంతి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యా రాణి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్వతీపురం కలెక్టర్ కార్యాలయానికి గురువారం ఉదయం 10 గంటలకు రానున్నారు. ముందుగా పార్టీ నాయకులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 72.27 శాతం ఉత్తీర్ణతతో 12వ స్థానంలో నిలిచింది. 440 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 318 మంది పాసయ్యారు. విజయనగరం జిల్లాలో 2,748 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,711 మంది ఉత్తీర్ణత సాధించారు. 62.26 శాతం పాస్ పర్సంటేజ్‌తో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది.
విశాఖలో టెక్ మహీంద్రాలో 328 ఉద్యోగాల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డి.అరుణ తెలిపారు. ఈనెల 29న విశాఖపట్నంలోని డా. విఎస్ కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను సంబంధిత వెబ్సైట్లో ఈనెల 28లోగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉన్న వాళ్లకి ప్రాధాన్యత.
విజయనగరం జిల్లాలో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, విద్యార్థుల్లో బాలికల నిష్పత్తి ఎందుకు తగ్గుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రశ్నించారు. దీనిపై అధ్యయనం చేసి, వారం రోజుల్లో తనకు నివేదిక సమర్పించాలని విద్యాశాఖను ఆదేశించారు. విద్య, అనుబంధ సంక్షేమ వసతిగృహాలపై తన ఛాంబర్లో బుధవారం సమీక్షించారు.
సాలూరు నుంచి ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు 6 లైన్ల రహదారి తయారవుతుంది కానీ.. రైలు పట్టాలు సరిచేయడం లేదు. విద్యుదీకరణ పూర్తయి ఏళ్లు గడుస్తున్నా రైలు మాత్రం పట్టాలెక్కడం లేదు. గత దసరాకు సాలూరు నుంచి విశాఖకు రైలు వేస్తున్నామని ట్రైల్ రన్ కూడా నిర్వహించారు. కానీ ఇంతవరకు రియల్ రన్ లేదు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం కేంద్రంతో చర్చించి ఈ సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.