India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
త్వరలోనే నామినేటెడ్ పదువులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో టికెట్ ఆశించిన భంగపడ్డ పలువురు నేతలకు సైతం అధిష్ఠానం నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎవరికి ఏ నామినేటెడ్ పదవి వస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.
ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 53 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో నిలిచింది. 1,679 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 884 మంది పాసయ్యారు. విజయనగరం జిల్లాలో 5,673 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,502 మంది ఉత్తీర్ణత సాధించారు. 44 శాతం పాస్ పర్సంటేజ్‌తో రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది.
నకిలీ షేర్ మార్కెట్ యాప్‌ల ద్వారా రూ.67 లక్షలు నష్ట పోయారని బొబ్బిలి పట్టణ సీఐ నాగేశ్వరరావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత ఫోన్ కాల్స్, మెసేజ్, లోన్ యాప్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధిక మొత్తాలకు ఆశపడితే మోసపోవడం తప్ప.. చేయగలిగిందేమి లేదన్నారు.
ప్రతిపక్ష హోదా అడిగే హక్కు జగన్ కు లేదని మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సభలో ఒక్క నిమిషం కూడా ఉండలేని జగన్ ఇంకా ప్రజా సమస్యల కోసం ఏం పోరాడుతారని ప్రశ్నించారు.
పూసపాటిరేగ మండలంలో విషాదం అలముకుంది. గోవిందపురానికి చెందిన శ్రీను జూనియర్ లైన్‌మెన్ వద్ద పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా షాక్ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఘటనలో వెల్దూరికి చెందిన అర్జున్ రెడ్డి(38) మద్యానికి బానిస అవ్వడంతో కడుపునొప్పితో బాధపడేవాడు. రెండురోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో వెతకగా.. మంగళవారం ఓ తోటలో పురుగుమందు తాగి మృతిచెందినట్లు గుర్తించారు.
భోగాపురం మండలం పోలిపల్లి గ్రామానికి చెందిన కర్రోతు నారాయన (40) మద్యానికి బానిసయ్యాడు. భార్య ఎల్లమ్మ, మిగతా కుంటంబసభ్యులు తాగొద్దని పలుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన నారాయణ ఈనెల 21న పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటింబీకులు విజయనగంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.
ఉత్తరాంధ్రలో జరిగిన యధార్థగాథలే.. కథలుగా వెండితెరపై అలరిస్తున్నాయి. ఇటీవల పలాస, జయమ్మ పంచాయతీ, కోటబొమ్మాళి లాంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. తాజాగా.. పాకిస్థాన్ జైలులో చిక్కుకున్న సిక్కోలు మత్స్యకారుడి స్టోరీలో నాగచైతన్య-సాయి పల్లవి నటిస్తున్నారు. రామ్‌చరణ్-బుచ్చిబాబు సినిమాకు కోడి రామ్మూర్తి జీవిత చరిత్రే ఆధారమని టాక్. అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.
పార్వతీపురం మన్యం జిల్లాలోని తోటపల్లి కర్రల డిపో వద్ద ఓ ఆడ ఏనుగు(మహాలక్ష్మి) అనారోగ్య కారణాలతో మృతి చెందింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకొని పరిశీలించారు. మృతికి గల కారణాలను తెలుసుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారి ఆదేశాలతో అక్కడే గొయ్యి తీసి ఖననం చేశారు.
విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి.ఆర్ అంబేద్కర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లాకు బదిలీ మీద వెళ్తున్న ప్రస్తుత కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి నుంచి ఆయన చార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని రంగాలపై అవగాహన పెంచుకుంటానని, ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలు చేసేందుకు, ప్రజోపయోగ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్‌గా గుంటూరు జిల్లాకు బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నగరంలో సోమవారం సాయంత్రం జరిగింది. జిల్లా అధికారుల సంఘం, జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీ.సాయికళ్యాణ్ చక్రవర్తి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం.దీపిక, జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ పాల్గొని కలెక్టర్‌కు వీడ్కోలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.