India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ జిల్లా భీమిలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లిమర్ల పట్టణానికి చెందిన యువకుడు మృతి చెందాడు. చింతలవలస ఎంవీజీఆర్‌లో బీటెక్ చదువుతున్న సాయి గణేష్, తన స్నేహితుడితో కలిసి భీమిలి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో భీమిలి వద్ద డివైడర్‌ను ఢీకొట్టడంతో సాయి గణేశ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వెనుక కూర్చున్న మరో యువకుడికి గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
విజయనగరంలో వాయుకాలుష్య నియంత్రణకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆదేశించారు. నేషనల్ క్లీన్ ఎయిర్ కార్యక్రమంపై కలెక్టర్ తన ఛాంబర్‌లో సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలో వాయుకాలుష్యం ఎక్కువ ఉందని, దానిని తగ్గించేందుకు వివిధ శాఖల సమన్వయంతో పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని సూచించారు.
గిరిజన ప్రాంతాల్లో డోలీమోతలు కనిపించకూడదని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమశాఖపై సచివాలయంలో జరిగిన సమీక్షలో అధికారులకు పలు సూచనలు చేశారు. ఫీడర్ అంబులెన్సులను తిరిగి ప్రవేశ పెట్టాలన్నారు. గర్భిణి వసతి గృహాలు, ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలను యాక్టివేట్ చేయాలని సూచించారు. గిరిజన విద్యార్థుల కోసం తెచ్చిన పలు పథకాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం నిర్వహించిన గిరిజన సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సమీక్షలో ఐటీడీఏలు బలోపేతం, ఫీడర్ అంబులెన్సులు పునరుద్ధరణ, గిరిశిఖర గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించడం తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీలో విజయనగరం జోన్ పరిధిలో అప్రెంటిషిప్ చేయడానికి ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆగస్టు ఒకటి నుంచి 16 తేదీ వరకు తమ పేర్లను www.apprenticeshipindia.gov.in సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. అనకాపల్లి, విశాఖ జిల్లా పరిధిలో వివిధ ట్రేడ్‌లలో ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో విజయనగరం జిల్లా బాలికపై అత్యాచారం జరిగినట్లు కేసు నమోదైంది. స్థానిక SI జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం యువకుడికి విజయనగరం బాలిక ఇన్‌స్టాలో పరిచయమైంది. అతడిని కలిసేందుకు JRG బస్టాండ్ వద్దకు వెళ్లింది. యువకుడు బాలికతో మాట్లాడి కాసేపట్లో వస్తానని వెళ్లిపోయాడు. వేగవరానికి చెందిన రాజు అనే మరొక వ్యక్తి బాలికను ఊరు పంపిస్తానని చెప్పి రూంలో ఉంచి అత్యాచారం చేశాడు.
విజయనగరం-విశాఖ మార్గంలో జొన్నాడ వద్ద ఏర్పాటు చేసిన టోల్ గేట్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మహా ధర్నా చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లా పౌర వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి తలపెట్టారు. గ్రామీణ ప్రాంతంలో టోల్ ప్లాజా ఏర్పాటు వలన వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారని, వేరే చోటుకి తరలించాలానే డిమాండ్ తో ధర్నా చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
భార్య అనారోగ్యానికి గురవడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుర్ల మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై భాస్కరరావు వివరాల ప్రకారం.. కెల్ల గ్రామానికి చెందిన అప్పలనాయుడు(31) భార్య లక్ష్మి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితిని చూసి తట్టుకోలేక సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలను వెనువెంటనే పరిష్కరించే లక్ష్యంతో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు జేసీ కె.కార్తీక్ చెప్పారు. దీనికి సంబంధించిన పోస్టర్ను సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆవిష్కరించారు. పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో 95023 49267 టోల్ ఫ్రీ నెంబరుతో కంట్రోల్ రూం పనిచేస్తుందని జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రాజా తెలిపారు.
విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో వివిధ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 1న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.అరుణ తెలిపారు. అమర్ రాజా బ్యాటరీస్‌లో మిషన్ ఆపరేటర్ (250), అప్రంటీస్ ట్రైనీ(250), ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకులో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ (60) ఉద్యోగాల భర్తీ జరుగుతుందని తెలిపారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, ఉత్తీర్ణులైనవారు హాజరు కావాలని కోరారు.
Sorry, no posts matched your criteria.